Festivals in December 2024: గీతాజయంతి, ధనుస్సంక్రాంతి సహా 2024 డిసెంబర్ లో పండుగల జాబితా ఇదే!

Festivals in Margashira Masam 2024: మార్గశిర మాసం డిసెంబరు 02న ప్రారంభమై 30 వరకూ ఉంటుంది. ఈ నెలలో ఎన్ని పండుగలున్నాయో తెలుసా..

Continues below advertisement

Festivals in December : 2024 డిసెంబరు/మార్గశిర మాసంలో పండుగలు ప్రత్యేకరోజులివే!

Continues below advertisement

డిసెంబర్ 02 పోలి స్వర్గం

కార్తీకమాసంలో శివకేశవులను పూజించి, ఉపవాసాలు ఉండి నిత్యం దీపాలు వెలిగించుకునేవారు..మార్గశిర మాసంలో వచ్చే మొదటి రోజైనై పాడ్యమి రోజు దీపాలు వెలిగిస్తారు. ఈ రోజునే పోలి పాడ్యమి అంటారు. కార్తీక పౌర్ణమి రోజు 365 వత్తులు వెలిగించుకున్నట్టే.. పోలి పాడ్యమి రోజు 30 వత్తులు కలిపి దీపాలు వెలిగిస్తారు. అంటే ఈ నెల రోజులు దీపారాధన చేయని వారికి ఈ రోజు 30 వత్తులు వెలిగిస్తే ఆ ఫలితం దక్కుతుందని భక్తుల విశ్వాసం. ఈ రోజు దీపాలు వెలిగించి పోలి స్వర్గం కథ చదువుకుంటారు..( పోలి స్వర్గం కథ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)

డిసెంబర్ 07 సుబ్రహ్మణ్యషష్టి

మార్గశిర శుద్ద షష్ఠినే స్కంద షష్ఠి అంటారు. ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే సంతానం లేనివారి ఆశ ఫలిస్తుందని... సంతానానికి ఉండే సమస్యలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. 

Also Read: డిసెంబరు 02 నుంచి మార్గశిర మాసం.. 4 గురువారాలు ఇలా పూజ చేస్తే లక్ష్మీ అనుగ్రహం!

డిసెంబర్ 08 కాలభైరవాష్టమి

మార్గశిర అష్టమి రోజు  కాలభైరవాష్టమి జరుపుకుంటారు. పరమేశ్వరుడి మరో రూపమే భైరవుడు. భైరవుని దగ్గర కాలుడు అంటే కాలం కూడా తగ్గి ఉంటుంది...అందుకే కాలభైరవుడయ్యాడు. భైరవుణ్ణి శరణు కోరితే అపమృత్యు భయం పోతుంది. కాలభైరవాష్టమి రోజు గంగాస్నానం ఆచరించి పితృ తర్పణాలు విడిచిపెడతారు. 

డిసెంబర్ 11 గీతా జయంతి

విశ్వమానవ విజ్ణాన కోశంగా భావించే భగవద్గీత పుట్టిన రోజే గీతా జయంతి. ఈ పర్వదినం రోజే  శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించాడు. 

"గీకారం త్యాగరూపం స్యాత్
తకారమ్ తత్వబోధకమ్
గీతా వాక్య మిదమ్ తత్వం
జ్ఞేయమ్ సర్వ ముముక్షుభి:"

గీత అనే రెండక్షరాలు సర్వసంగపరిత్యాగానికి, ఆత్మసాక్షాత్కారానికి ప్రతీకగా చెబుతారు. ఈ రహస్యాన్నే గీతాశాస్త్రం ఉపదేశిస్తుంది. అంత పరమపావనమైన భగవద్గీత భగవంతుడి నోటి నుంచి వెలువడిన మహాపుణ్యదినమే మార్గశిర శుక్ల ఏకాదశి. ఈ రోజు భగవద్గీతను పూజించినా, చదివినా పుణ్యఫలం. 

Also Read: 108 వైష్ణవ క్షేత్రాల్లో మొదటిది.. దేశంలోనే అతి పెద్ద ఆలయం ..ధనుర్మాసంలో దర్శించుకుంటే జన్మ ధన్యం!

డిసెంబర్ 13 హనుమద్ర్వతం 

ఆంజనేయుడి భక్తులు ఈ రోజు హనుమాన్ వ్రతం ఆచరిస్తారు
 
డిసెంబరు 14-15 దత్త జయంతి

మార్గశిర పౌర్ణమి రోజు దత్తాత్రేయ జయంతి జరుపుకుంటారు. దత్తాత్రేయుడంటే త్రిమూర్తి స్వరూపం. దత్తాత్రేయ జయంతిని మార్గశిర మాస పౌర్ణమి రోజు జరుపుకుంటారు. ఈ ఏడాది పౌర్ణమి డిసెంబరు 14 సాయంత్రం నుంచి డిసెంబరు 15 మధ్యాహ్నం వరకూ ఉండడంతో దత్తాత్రేయ జయంతిని ఈ రెండు రోజులు జరుపుకుంటారు. 

డిసెంబరు నెలలోనే ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ నెల రోజులు శ్రీ మహావిష్ణువు ఆలయాల్లో ప్రత్యేక పూజలు మారుమోగిపోతాయి. ప్రతి రోజూ తెల్లవారు జామున పండుగవాతావరణం నెలకొంటుంది. గోదాదేవి ధనుర్మాసం మొత్తం విష్ణువు వ్రతం చేపట్టి స్వామిని కీర్తించి..ఆయనలో ఐక్యం అయింది. 

మార్గశిర మాసంలో వచ్చే ప్రతి గురువారం అత్యంత విశిష్టమైవిగా భావిస్తారు. గురువారం రోజు శ్రీ మహాలక్ష్మిని పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందంటారు.

Also Read: దేవుడు ప్రతిచోటా ఉన్నాడు కదా..ఆలయాలకు ఎందుకు వెళ్లాలి - వెళ్లకపోతే భక్తి లేనట్టేనా!

గమనిక: వివిధ శాస్త్రాల నుంచి సేకరించిన విషయాలు, పండితులు పేర్కొన్న వివరాల ఆధారంగా రాసిన కథనం ఇది. దీనిని ఎంతవరకూ  విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం

Continues below advertisement