Horoscope Today 03rd December 2024


మేష రాశి


ఈ రోజు ప్రారంభం  అంత బాగా అనిపించదు కానీ సాయంత్రానికి గుడ్ న్యూస్ వింటారు. వ్యాపారులు వినియోగదారులతో సత్సంబంధాలు కొనసాగించాలి. పెద్దల ఆశీస్సులు మీపై ఉంటాయి. తప్పుడు వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది. విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించాలి. 


వృషభ రాశి


ఈ రోజు అలర్జీకి సంబంధించిన సమస్యలు ఇబ్బందిపెడతాయి. వివాహేతర సంబంధాల వల్ల ఇబ్బందులు తలెత్తుతాయి. ప్రత్యర్థులు మీపై పైచేయి సాధిస్తారు. మనసులో ఏదో అస్థిరత ఉద్రిక్తత ఉంటుంది. తప్పని పరిస్థతుల్లో అయితే కానీ దూరప్రాంత ప్రయాణాలు ప్లాన్ చేసుకోవద్దు.


మిథున రాశి


ఈ రోజు మీ శక్తి సమార్థ్యలను సరైన మార్గంలో వినియోగిస్తారు. చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది. భవిష్యత్ కోసం భారీ ప్రణాళికలు వేస్తారు. శుభాకార్యాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ఆర్థిక లాభం పొందుతారు. 


Also Read: డిసెంబరు 01 నుంచి 07 ఈ వారం ఈ రాశులవారికి అన్నీ శుభాలే!


కర్కాటక రాశి


ఈ రోజు ఉద్యోగులు కార్యాలయంలో బిజీ బిజీగా ఉంటారు. మీ మాటలతో ఎవ్వరినైనా ప్రభావితం చేయగలరు. వైవాహిక జీవితంలో సమస్యలు పరిష్కారం అవుతాయి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. పిల్లల గురించి ఆందోళన చెందుతుంది.  సీజనల్ వ్యాధుల వల్ల ఇబ్బందులు ఉంటాయి.  


సింహ రాశి


ఈ రోజు సింహ రాశివారిక మిశ్రమ ఫలితాలున్నాయి. ఏ విషయం గురించి అతిగా ఆలోచించవద్దు, అతిగా ఆశపడొద్దు. కుటుంబంలో వివాదాలు జరిగే సూచనలున్నాయి. మొండి ప్రవర్తన మార్చుకునేందుకు ప్రయత్నించాలి. ఉద్యోగం, వ్యాపారంలో పెద్దగా మార్పులుండవు. ఆర్ఖికంగా లాభపడతారు. 


కన్యా రాశి


ఈ రోజు మీరు పాత పరిచయాల ప్రయోజనం  పొందుతారు. పోటీ పరీక్షలు రాసే విద్యార్థులు విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యుల పురోభివృద్ధితో సంతోషిస్తారు. తల్లిదండ్రుల నుంచి ఆశీర్వాదం పొందుతారు. ఊహించని ఆర్థిక ప్రయోజనం పొందుతారు. మార్కెటింగ్ సంబంధిత పనులకు రోజు అనుకూలంగా ఉంటుంది.


తులా రాశి


నూతన పెట్టుబడులకు ఈ రోజు మీకు మంచిరోజు అుతుంది. కెరీర్లో అడుగు ముందుకుపడుతుంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. రోజంతా సంతోషంగా గడుస్తుంది. ప్రతి విషయాన్ని జీవిత భాగస్వామితో పంచుకోండి. ఈ రాశి ఉద్యోగులు కార్యాలయంలో సహోద్యోగుల నుంచి మద్దతు పొందుతారు. 


వృశ్చిక రాశి


ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మంచి సమన్వయం ఉంటుంది. కోపం తగ్గించుకోవడం మంచిది. చేపట్టిన పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. మాటలో సౌమ్యత పెంచుకునేందుకు ప్రయత్నించండి. పిల్లల కారణంగా సంతోషంగా ఉంటారు.  న్యాయపరమైన విషయాల్లో విజయం సాధించవచ్చు. 


Also Read: డిసెంబర్ మొదటివారం ఈ రాశులవారికి ధననష్టం ఉంటుంది జాగ్రత్త!


ధనస్సు రాశి


ఈ రోజు ధనస్సు రాశివారికి అంత మంచి రోజు కాదు. కార్యాలయంలో సహోద్యోగులతో విభేదాలు ఉండవచ్చు. షేర్ మార్కెట్‌లో జాగ్రత్తగా పెట్టుబడి పెట్టండి. బంధువులను ఎక్కువగా నమ్మడం మంచిది కాదు. కుటుంబానికి సమయం కేటాయిస్తారు. అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త. 


మకర రాశి


మీరు ఈ రోజు ఏదో ఒక విషయం గురించి ఆందోళన చెందుతూనే ఉంటారు. ముఖ్యమైన వస్తువులు పోయే అవకాశం ఉంది జాగ్రత్తపడండి.   ప్రయాణ సమయంలో మీ లగేజీ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. పనికిరాని పనులపై మీ సమయాన్ని వృథా చేయకండి. కోపం , అహంకార వ్యక్తిత్వాన్ని ప్రదర్శించవద్దు. ఓపికగా వ్యవహరించండి. 


కుంభ రాశి


ఈ రోజు మీరు కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. పిల్లలు మీ సంతోషాన్ని పెంచుతారు. ఉద్యోగులకు ప్రతిభ  మెరుగుపరుచుకునే అవకాశం  లభిస్తుంది. ప్రత్యర్థులు మీ స్నేహితులు కావచ్చు. లక్ష్య సాధనకు కృషి చేస్తారు. త్వరలోనే మీరు కోరుకున్న ఫలితాలు అందుకుంటారు. 


మీన రాశి


ఈ రోజు మీకు సాధారణంగా ఉంటుంది. చేపట్టిన కొన్ని పనులు ఆగిపోవచ్చు. ఇతరులకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. కార్యాలయంలో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. ఇంటికి అతిథులు వచ్చే అవకాశం ఉంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.  


Also Read: వక్రం నుంచి సాధారణ స్థితిలోకి బుధుడు - ఇయర్ ఎండ్ ఈ 4 రాశులవారికి అదిరిపోతుంది!


Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.