Mercury in Scorpio: జ్యోతిషశాస్త్రం ప్రకారం నవగ్రహాల్లో బుధుడికి విశిష్టమైన స్థానముంది. బుధుడి సంచారం శుభస్థానంలో ఉన్నన్ని రోజులూ అన్ని విధాలుగా కలిసొస్తుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ప్రస్తుతం బుధుడు వృశ్చిక రాశిలో వక్రంలో సంచరిస్తున్నాడు... డిసెంబరు 14న వక్ర స్థితి నుంచి సాధారణ స్థితికి వస్తాడు. గ్రహాల రాకుమారుడిగా పిలిచే బుధుడు అక్టోబరు 28న వృశ్చిక రాశిలో తిరోగమనం చెందాడు. అప్పటి నుంచి సాధారణ స్థితిలో, తిరోగమనంలో, మళ్లీ సాధారణ స్థితిలో ఇలా మూడు దశల్లో సంచరించడంతో జనవరి 5 వరకూ ఇదే రాశిలో ఉంటాడు
అక్టోబరు 28న తులా రాశి నుంచి వృశ్చికంలోకి వచ్చిన బుధుడు
నవంబరు 22న వృశ్చిక రాశిలో వక్రంలో సంచరిస్తున్న బుధుడు
డిసెంబరు 14 న తిరోగమనం పూర్తిచేసి వృశ్చికంలోనే సంచరించనున్న బుధుడు
జనవరి 05, 2025న వృశ్చిక రాశి నుంచి ధనస్సులోకి పరివర్తనం..
సాధారణంగా రెండు వారాలకు మూడు వారాలకు రాశి పరివర్తనం చెందే బుధుడు.. ఈ సారి వృశ్చిక రాశిలో రెండు నెలల పాటూ సంచరించాడు. ఈ ప్రభావం అన్ని రాశులపైనా ఉంటుంది. అయితే ప్రస్తుతం తిరోగమనం దశ సంగతి పక్కనపెడితే... తిరోగమనం నుంచి సాధారణ స్థితికి వచ్చే సమయం అయిన డిసెంబరు 14 నుంచి జనవరి 05 వరకూ ఈ రాశులవారికి యోగాన్నివ్వబోతున్నాడు గ్రహాల రాకుమారుడు.
Also Read: గీతాజయంతి, ధనుస్సంక్రాంతి సహా 2024 డిసెంబర్ లో పండుగల జాబితా ఇదే!
వృషభ రాశి
బుధుడి ప్రత్యక్ష సంచారం వల్ల వృషభ రాశి వారికి అన్నీ సంతోషాలే. ఉల్లాసంగా, ఆనందంగా ఉంటారు. పెండింగ్‌లో ఉన్న డబ్బు చేతికందుతుంది. ఊహించని ధనలాభం ఉంటుంది. ఉద్యోగులు, వ్యాపారులకు శుభసమయం. వృత్తి జీవితంలో పురోగతి ఉంటుంది.
మిథున రాశి
బుధుడి ప్రత్యక్ష సంచారం మిథున రాశివారికి మంచి చేస్తుంది. ఈ సమయంలో ఉద్యోగులు అదనపు బాధ్యతలు పొందుతారు. వ్యాపారంలో పురోగతి ఉండవచ్చు. ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. పెద్దల నుంచి ఆర్థిక లాభాలు కలుగుతాయి. సంతోషంగా ఉంటారు.
సింహ రాశి
వృశ్చిక రాశిలో బుధుడి ప్రత్యక్ష సంచారం సింహరాశివారి జీవితాల్లో అపారమైన ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ సమయంలో మీరు శుభవార్తలు అందుకుంటారు. కుటుంబ దృష్టికోణంలో ఈ సమయం బాగుంటుంది. అద్భుతమైన ఉద్యోగ అవకాశాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆస్తికి సంబంధించిన వివాదాలు పరిష్కారమవుతాయి.
Also Read: 2024 ఈ రాశులవారికి హ్యాపీ ఎండింగ్.. డిసెంబర్ మాస ఫలాలు!
కుంభ రాశి
కుంభ రాశి వారికి కూడా బుధుడి సంచారం కలిసొస్తుంది. అన్నింటా అదృష్టం వరిస్తుంది. చేపట్టిన పనులన్నీ సమయానికి పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో రాణిస్తారు. కార్యాలయంలో మీ పనితీరుకి ప్రశంసలు అందుకుంటారు.
నవగ్రహ శ్లోకాల్లో బుధుడి శ్లోకం
ప్రియంగు కలికాశ్యామం రూపేణా ప్రతిమం బుధమ్ |
సౌమ్యం సత్వ గుణోపేతం తం బుధం ప్రణమామ్యహమ్ ||
Note: ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కొన్ని మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించాలి. కొన్ని పుస్తకాలు, పండితుల సూచనల ఆధారంగా రాసిన వివరాలివి. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.
Also Read: డిసెంబరు 02 నుంచి మార్గశిర మాసం.. 4 గురువారాలు ఇలా పూజ చేస్తే లక్ష్మీ అనుగ్రహం!