Skoda Kylaq Price: స్కోడా కైలాక్ అనే కాంపాక్ట్ ఎస్‌యూవీ మనదేశంలో ఇటీవలే లాంచ్ అయిన సంగతి తెలిసిందే. లాంచ్ అయినప్పుడు దీని ప్రారంభ వేరియంట్ ధరను మాత్రమే ప్రకటించారు. వాహన తయారీదారులు ఈ కారుకు సంబంధించిన అన్ని వేరియంట్ల ధరలను త్వరలో వెల్లడించబోతున్నారు. ఈ కారు ప్రారంభ ధరను కంపెనీ తాజాగా రివీల్ చేసింది. స్కోడా కైలాక్ ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర రూ.7.89 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. ఇప్పుడు దాని వేరియంట్ల ధర గురించి సమాచారం డిసెంబర్ 2వ తేదీన వెల్లడించనున్నారు. దీనికి సంబంధించిన బుకింగ్స్ కూడా అదే రోజు ప్రారంభం కావచ్చు. స్కోడా కైలాక్ డెలివరీ జనవరి 27వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది.


స్కోడా కైలాక్ వేరియంట్లు ఇవే...
స్కోడా కైలాక్‌ను క్లాసిక్, సిగ్నేచర్, సిగ్నేచర్ ప్లస్, ప్రెస్టీజ్ అనే నాలుగు వేరియంట్లలో మార్కెట్లోకి తీసుకువచ్చే అవకాశం ఉంది. మీడియా నివేదికల ప్రకారం ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షన్ అన్ని ట్రిమ్‌లతో లభించనుంది. ఈ కారు ఐదు కలర్ వేరియంట్లలో మార్కెట్లోకి వచ్చింది. ఆలివ్ గోల్డ్, టోర్నాడో రెడ్, కార్బన్ స్టీల్, బ్రిలియంట్ సిల్వర్, క్యాండీ వైట్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఈ స్కోడా కారును అనేక సేఫ్టీ ఫీచర్లతో కంపెనీ లాంచ్ చేయనుంది. స్కోడా కార్లకు మనదేశంలో నగర ప్రాంతాల్లో డిమాండ్ ఎక్కువగా ఉంది. ప్రస్తుతానికి స్కోడా ఇంకా ఎలక్ట్రిక్ వాహనాల స్పేస్‌లోకి ఎంటర్ అవ్వలేదు. త్వరలో రెండు ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను కూడా లాంచ్ చేసే అవకాశం ఉంది.



Also Read: ఇండియాలో మోస్ట్ అవైటెడ్ కారు వచ్చేసింది - మహీంద్రా బీఈ 6ఈ ధర ఎంత?


స్కోడా కైలాక్ ఇంజిన్ ఎలా ఉంది?
స్కోడా కైలాక్ 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌తో మార్కెట్లోకి వచ్చింది. ఈ ఇంజన్ 115 హెచ్‌పీ పవర్, 178 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఈ ఇంజన్ 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ లేదా 6 స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో మార్కెట్లోకి రానుంది. ఈ కారు గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడానికి 10.5 సెకన్లు పడుతుంది.


స్కోడా కైలాక్ పోటీ దీనితోనే...
స్కోడా కైలాక్‌తో పోటీపడే అనేక కార్లు ఇండియన్ మార్కెట్లో ఉన్నాయి. ఈ కారు మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, టాటా నెక్సాన్ వంటి కార్లకు గట్టి పోటీని ఇవ్వగలదు. మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో ఎక్స్ షోరూమ్ ధర రూ. 7.79 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. టాటా నెక్సాన్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 7.99 లక్షల నుంచి, హ్యుందాయ్ వెన్యూ ధర రూ. 7.94 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.



Also Read: బజాజ్ ప్లాటినా వర్సెస్ హోండా షైన్ - ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్?