కొంతమంది సిగరెట్ వాసన రాకూడదని జామ ఆకులను నమిలేస్తుంటారు. దానివల్ల వారి ఆరోగ్యానికి ఎలాంటి నష్టం ఉండదు. పైగా నోటి దుర్వాసన కూడా పోతుంది. అయితే, సిగరెట్ తాగిన తర్వాతే ఆ ఆకులను నమిలాలి అనే రూల్ ఏమీ లేదు. ఆ తర్వాత కూడా వాటిని తీసుకోవచ్చు. ఎందుకంటే.. దానివల్ల బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట. అవేంటో చూసేయండి మరి.
ఆయుర్వేదం, యునానీ, హోమియోపతి, సిద్ధ వంటి ప్రకృతి వైద్యాల్లో కూడా జామ ఆకుకు ప్రత్యేక స్థానం ఉంది. దీన్ని ఔషధాల తయారీలో విస్తృతంగా ఉపయోగించేవాళ్ళు. అతిసారం, గాయాలు, రుమాటిజం, ఊపిరితిత్తుల సమస్యలు, అల్సర్లు వంటి మొదలైన వ్యాధుల చికిత్సకి జామాకులతో చేసిన ఔషధాలు ఇస్తారు. జామలో ఫ్లేవనాయిడ్లు ఉన్నాయి.
జామ మొక్కలోని గుణాలు గొప్ప చికిత్సా సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. దీనిలో యాంటీ డైరియాల్, యాంటీ మైక్రోబయల్, యాంటీ ట్యూసివ్, హెపాటో ప్రొటెక్టివ్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ క్యాన్సర్, యాంటీ స్ట్రెస్ యాక్టివిటీ వంటి గుణాలు ఉన్నాయి. జామ ఆకుల్ని ఔషధాలు, హెర్బల్ టీ గా తీసుకోవచ్చు. ఈ ఆకుల చూర్ణం చర్మంపై రాసుకోవచ్చు.
గాయాలను నయం చేస్తుంది
ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు గాయాల్ని నయం చేయడంతో కీలకంగా వ్యవహరిస్థాయి. శస్త్ర చికిత్స గాయాలు, కాలిన గాయాలు, చర్మం, మృదు కణజాల ఇన్ఫెక్షన్లతో సంబంధం ఉన్న కొన్ని రకాల బ్యాక్టీరియాలకి వ్యతిరేకంగా పోరాడతాయి.
కాలేయం, పేగులకి మంచిది
అలెగ్జాండ్రియా విశ్వవిద్యాలయం, డామన్‌హౌర్ విశ్వవిద్యాలయం, ఈజిప్ట్ సంయుక్త అధ్యయనంలో జామాకులతో చేసిన ఔషధాలు తీసుకోవడం వల్ల గట్ ఆరోగ్యం బాగుంటుందని హెపాటిక్ అసమతుల్యతకి చికిత్స చేయడంలో గొప్పగా పని చేస్తుందని తేలింది. గియార్డియా అనే ఇన్ఫెక్షన్ ని సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. ఈ ఇన్ఫెక్షన్ వల్ల కడుపు తిమ్మిరి, ఉబ్బరం, వికారం, నీటి విరోచనాలు అవుతాయి. కాలేయం ఆరోగ్యంగా ఉండేందుకు సహకరిస్తుంది.
క్యాన్సర్ ని నిరోధిస్తుంది
క్యాన్సర్ ట్రీట్మెంట్ డ్రగ్ ప్రొడ్యూసర్ అడ్మాక్ ఆంకాలజీ ప్రకారం ప్రొస్టేట్ క్యాన్సర్ పై సమర్థవంతంగా పని చేసిందని నిరూపితమైంది. అధ్యయనం ప్రకారం క్యాన్సర్ కణితి పరిమాణాన్ని తగ్గించడంలో జామ ఆకుల రసం సహాయపడుతుందని తేలింది. జర్నల్ ఆఫ్ మెడిసినల్ ఫుడ్ (2012) మరొక అధ్యయనం ప్రకారం మానవ ప్రోస్టేట్ క్యాన్సర్‌కు వ్యతిరేకంగా ఈ మొక్క యాంటీకాన్సర్ చర్యను నిర్ధారించినట్లు తేలింది.
హైపర్ టెన్షన్ తగ్గిస్తుంది
జామ ఆకులు తీసుకోవడం వల్ల హైపర్ టెన్సివ్ రోగులతో (అధిక రక్తపోటు) చేసిన అధ్యయనం ప్రకారం కొలెస్ట్రాల్ (9.9 శాతం), ట్రైగ్లిజరైడ్స్ (7.7 శాతం), రక్తపోటు (9.0/8.0 మిమీ హెచ్‌జి) గణనీయంగా తగ్గాయి.
మధుమేహుల కోసం
జామ ఆకుల రసం తరచూ తీసుకుంటే దీర్ఘకాలిక ప్రయోజనాలు పొందుతారు. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తూ, ఇన్సులిన్ నిరోధకతని మెరుగుపరుస్తుందని తేలింది.
రుతుస్రావం నొప్పి తగ్గిస్తుంది
ఎపిడెమియాలజీ అండ్ హెల్త్ సర్వీసెస్ రీసెర్చ్ యూనిట్ (మెక్సికో) 197 మంది స్త్రీలను పాల్గొన్న ఒక అధ్యయనం ప్రకారం జామ ఆకుల రసం లేదా చూర్ణం తీసుకుంటే రుతుస్రావం సమయంలో వచ్చే నొప్పులని తగ్గించేందుకు సహాయపడుతుంది. గర్భాశయ తిమ్మిరిని కూడా తగ్గిస్తుంది.
మొటిమలకి చెక్
ఒక జోర్డానియన్ అధ్యయనం జామ ఆకు సారం మొటిమలు కలిగించే బ్యాక్టీరియాను చంపడంలో ప్రభావవంతంగా పని చేసిందని నిరూపితమైంది. ఇందులోని యాంటీ మైక్రోబయల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలే అందుకు కారణం కావొచ్చు. జామ ఆకుల పదార్థాలు తీసుకుంటే శరీరంపై వచ్చే ముడతలు, వృద్ధాప్య సంకేతాలు మందగిస్తాయి.
రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది
జామ ఆకు సారాల్లో అధిక స్థాయిలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫినోలీక్ సమ్మేళనాలు ఇమ్యునోస్టిమ్యులేటరీ ఏజెంట్లుగా పని చేస్తాయని మరొక అధ్యయనం ద్వారా వెల్లడైంది.
జుట్టు రాలడాన్ని అడ్డుకుంటుంది
కొన్ని జామ ఆకులని తీసుకుని వాటిని ఒక లీటరు నీటిలో సుమారు 20 నిమిషాల పాటు మరిగించాలి. ఆ ద్రవాన్ని వడకట్టి చల్లబరచాలి. దాన్ని తలకి అప్లై చేసుకోవాలి. కనీసం 2 గంటలు ఉంచుకోవాలి. లేదంటే రాత్రిపూట రాసుకుని తెల్లారిన తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం పొందుతారు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: శీతాకాలంలో విటమిన్ డి లోపం రాకుండా చూసుకోవడం ఎలా? ఏం తినాలి?