కాలం మారింది. ఆధునిక వైద్య శాస్త్రం ఎంతో అభివృద్ధి చెందింది. ఇంత అభివృద్ధి వెనుక ఎంతో మంది వైద్యులు, అధ్యయనకర్తలు, పరిశోకుల కృషి ఎంతో ఉంది. మనదేశంలో క్యాన్సర్ చికిత్స, దాని లక్షణాలు, క్యాన్సర్లకు వైరస్ కు మధ్య బంధాన్ని కనుక్కునే ప్రక్రియలో ఎంతో కష్టపడిన పరిశోధకురాలు కమల్ రణదివే. ఈమె మనదేశంలో తొలితరం క్యాన్సర్ పరిశోధకురాలు. ఆమె 104వ జన్మదినం సందర్భంగా గౌరవార్థం గూగుల్ డూడుల్ మార్చింది. ఈ డూడుల్ ను ఇబ్రహీం రాయినతకత్ అనే చిత్రకారుడి చేత వేయించింది.
కమల్ సాధించిందేమిటి?
ఈమె 1917లో పుణెలో జన్మించారు. కమల్ తండ్రి మంచి విద్యావంతుడు. కూతురిని వైద్యురాలిగా చూడాలని, మరో వైద్యుడికే ఇచ్చి పెళ్లి చేయాలని కలలు కనేవాడు. కానీ కమల్ మాత్రం తనకెంతో ఇష్టమైన పరిశోధనను కెరీర్ గా ఎంచుకున్నారు. ఎమ్మెస్సీ పూర్తిచేశారు. ‘సైటో జెనెటిక్స్’ను ప్రత్యేక సబ్జెక్టుగా ఎంపిక చేసుకున్నారు. దీన్ని కణ జీవశాస్త్రం అని కూడా అంటారు. ఈమె క్యాన్సర్ కణాలకు, వైరస్ లకు మధ్య బంధంపై ఎన్నో పరిశోధనలు చేశారు. ఇందులో ముంబై యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ పట్టా కూడా అందుకున్నారు. ఇండయిన్ క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్లోనే తన పరిశోధనలు మొదలుపెట్టారు. లెప్రసీ వ్యాక్సిన్ ఆవిష్కరణ వెనుక కూడా ఆమె కష్టం ఉంది. అలాగే క్యాన్సర్ కు సంబంధించి మొదట ఆమె జంతువులపై ఎన్నో పరిశోధనలు చేశారు. లుకేమియా, రొమ్ముక్యాన్సర్, అన్నవాహిక క్యాన్సర్ వంటి వాటి వెనుక కారణాలను కనుక్కునే ప్రక్రియలో ఆమె మంచి గుర్తింపు సాధించింది. స్త్రీలలో వచ్చే రొమ్ముక్యాన్సర్ వారసత్వంగా వచ్చే అవకాశాలపై కూడా చాలా పరిశోధనలు చేసి ఫలితాలను రాబట్టారు. ఆమె కృషి వల్లే అనేక రకాల క్యాన్సర్ల గురించి మనం తెలుసుకోగలిగాం. కమల్ కష్టాన్ని గుర్తించిన 1982లో ప్రభుత్వం ఆమెకు పద్మ భూషణ్ ఇచ్చి సత్కరించింది.
Also read: లవ్ బ్రేకప్ అయితే ఎక్కువ బాధపడేది మగవాళ్లేనట... తేల్చిన కొత్త అధ్యయనం
Also read: రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకుంటే... ఏడున్నర కోట్ల రూపాయలు వచ్చాయి, ఎంత అదృష్టవంతురాలో
Also read: మైగ్రేన్‌తో బాధపడే వారు... వీటికి దూరంగా ఉండండి
Also read: పిల్లలకు రోజుకో ఉడికించిన గుడ్డు తినిపించండి... ఆరోగ్యానికి ఢోకా ఉండదు
Also read: మీ గురక వల్ల ఇంట్లో వాళ్లు ఇబ్బంది పడుతున్నారా... ఇలా చేసి చూడండి
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి