ప్రేమలు, ప్రేమవివాహాలు సమాజంలో సాధారణమైపోయాయి. ప్రతి వీధికో లవ్ జంట లేదా లవ్ మ్యారేజ్ చేసుకున్న దంపతులు కనిపిస్తూనే ఉంటారు. ఇంతకుముందు ఆఫ్ లైన్ ప్రేమలే ఉండేవి. అంటే కాలేజీలోనో, వీధిలోనో, కోచింగ్ సెంటర్లోనో చూసి ప్రేమ చిగురించేది. ఇప్పుడు ఆన్లైన్ ప్రేమలు ఎక్కువైపోయాయి. ఫేస్‌బుక్, ఇన్ స్టా లో కూడా ప్రేమించేసుకుంటున్నారు. ప్రేమలు వరకు ఇద్దరూ హ్యాపీనే... కానీ బ్రేకప్ జరిగితే మాత్రం అదో మానసిక హింస. ఎవరికో తెలుసా? మగవారికి. జంట విడిపోయినప్పుడు ప్రియురాలి కన్నా ప్రియుడే ఎక్కువ బాధపడతాడట. ఇంగ్లాండుకు చెందిన లాంకెస్టర్ యూనివర్సిటీలో జరిగిన పరిశోధనలో ఈ ఫలితం వచ్చింది. ఈ పరిశోధన ఫలితాలను ‘జర్నల్ ఆఫ్ సోషల్ అండ్ పర్సనల్ రిలేషన్ షిప్స్’ మ్యాగజైన్లో ప్రచురించారు.
లాంకెస్టర్ యూనివర్సిటీలోని పరిశోధకులు, మనస్తత్వ శాస్త్రవేత్తల అంతర్జాతీయ బృందం ఈ పరిశోధనను నిర్వహించింది. రిలేషన్‌షిప్ సమస్యలపై తొలిసారి పరిశోధకులు ‘బిగ్ డేటా అనాలసిస్’ చేశారు. ప్రేమపూరితమైన సంబంధ బాంధవ్యాలలో వచ్చే సమస్యలపై ఓ డేటా రూపొందించాలనుకున్నారు. అందులో భాగంగా వారు చేసిన అధ్యయనంలో ఈ బ్రేకప్ స్టోరీ బయటపడింది. బ్రేకప్ అయిన జంటలను అధ్యయనం చేసిన పరిశోధకులు... మగవారే ఎక్కువ మానసిక ఆందోళనకు గురవుతున్నట్టు గుర్తించారు. బ్రేకప్ అయ్యాక అమ్మాయిలు తేలికగానే విషయాన్ని తీసుకుంటారని, కానీ అబ్బాయిలు మాత్రం మనసు పొరల్లో గుండెల్ని పిండేసే బాధను అనుభవిస్తారని చెప్పారు.
ఈ అధ్యయనం కోసం పరిశోధకులు ఆన్‌లైన్ ఫోరమ్‌లో తమ రిలేషన్‌షిప్ సమస్యలను రాయమని కోరారు. ఆ పిలుపుకు 1,84,000 మంది స్పందించారు. వారు రాసిన సమస్యలను పరిశోధనకర్తలు పూర్తిగా చదివారు. అందులో మగవారే ఎక్కువ బాధ అనుభవించినట్టు తేలింది. వారు తమ మానసిక వేదనను అధ్యయనకర్తలతో పంచుకున్నారు. ప్రేమ అంటేనే విసుగుపుట్టే స్థాయికి కొంతమంది మగవారు చేరిపోయినట్టు కూడా పరిశోధకులు చెబుతున్నారు.
ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.
Also read: రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకుంటే... ఏడున్నర కోట్ల రూపాయలు వచ్చాయి, ఎంత అదృష్టవంతురాలో
Also read: మైగ్రేన్‌తో బాధపడే వారు... వీటికి దూరంగా ఉండండి
Also read: పిల్లలకు రోజుకో ఉడికించిన గుడ్డు తినిపించండి... ఆరోగ్యానికి ఢోకా ఉండదు
Also read: మీ గురక వల్ల ఇంట్లో వాళ్లు ఇబ్బంది పడుతున్నారా... ఇలా చేసి చూడండి
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి