మీకు ఒత్తిడిగా అనిపిస్తోందా? అయితే చెవి మసాజ్ చేయించుకోండి. ఎంతో ఉపశమనం కలుగుతుంది. చెవిలో పీడనాన్ని కలిగించే పాయింట్లు ఉంటాయి. సరిగ్గా ఆ ప్రదేశాల్లో మసాజ్ చేయడం వల్ల ఒత్తిడి తగ్గడంతో పాటూ ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాదు చెవి దగ్గర మసాజ్ చేయడం వల్ల శరీరంలోని చాలా ప్రాంతాలపై ఆ ప్రభావం పడుతుంది. ఎన్నో అనారోగ్యాలకు, నరాల సమస్యలకు ఈ చెవి మసాజ్ చికిత్సలా పనిచేస్తుంది. 


కండరాల నొప్పి
చెవి లోబ్స్ (తమ్మెలు)దగ్గర చర్మం సున్నితంగా ఉంటుంది. వాటిపై మెల్లగా మసాజ్ చేయడం వల్ల ఎండార్ఫిన్లు విడుదల అవుతాయి. ఎండార్ఫిన్లు అనేవి ఒత్తిడిని తగ్గించే హార్మోన్లు. అలా రుద్దడం వల్ల రక్త ప్రసరనణ కూడా మెరుగుపడుతుంది. శరీరానికి రక్త ప్రసరణ మెరుగ్గా జరగడం వల్ల అన్ని అవయవాలు చురుగ్గా పనిచేస్తాయి. 


మైగ్రేన్
సాధారణ తలనొప్పులతో పాటూ మైగ్రేన్ వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా మైగ్రేన్ ఒకంతట తగ్గక తీవ్రంగా వేధిస్తోంది. అలాంటివారు తరచూ చెవి మసాజ్ చేయించుకోవడం ఉత్తమం. ఇలా చేయడం నొప్పి తగ్గుతుంది. ఏవేవో మందులు వాడేకన్నా సహజసిద్ధమైన ఈ చిట్కాను పాటించడం ఉత్తమం. 


అధిక బరువు
అధిక బరువు బారిన పడిన వారు ఎంతో మంది. ఆరోగ్యకరమైన ఆహారంతో పాటూ, వ్యాయామాలు చేయాలి. అలాగే అప్పుడప్పుడు చెవి మసాజ్ చేయించుకోవడం వల్ల కూడా బరువు తగ్గడం సులభం అవుతుంది. చెవి మసాజ్ చేస్తున్నప్పుడు శరీరంలో చాలా ప్రాంతాలు ప్రభావితం అవుతాయి. క్రమం తప్పకుండా చెవి మసాజ్ చేయించుకుంటే మంచి ఫలితాలు కనిపిస్తాయి. 


శక్తిని అందించే...
చెవి మసాజ్ వల్ల మెదడులోని సెరెబ్రమ్ ప్రదేశాలను ప్రేరేపించవచ్చు. అప్పుడు మీకు తాజాగా, కొత్తగా ఉన్న అనుభూతి కలుగుతుంది. మీకు శక్తిహీనంగా, నీరసంగా అనిపించినప్పుడు లేదా నిరాశగా అనిపించినప్పుడు చెవి మసాజ్ చేయించుకుంటే ఫలితం మీకు వెంటనే కనిపిస్తుంది. 


ఒత్తిడి
ఒక అధ్యయనం ప్రకారం చెవి మసాజ్‌ల వల్ల ఆందోళన, నిరాశ, ఆత్రుత వంటివి తగ్గుతాయి. ఎవరైతే ఒత్తిడికి గురవుతున్నారో వారు రోజూ చెవి మసాజ్ చేయించుకోవాలి. యాంగ్జయిటీ వంటివి ఇట్టే తగ్గుతాయి. 


నిద్రకు..
నిద్రలేమితో బాధపడుతున్నవారు చెవి మసాజ్ ప్రయత్నించండి. రోజూ చెవి మసాజ్ చేయించుకుంటే నిద్రలేమి సమస్య తగ్గుతుంది. రిలాక్స్‌గా, టెన్షన్ ఫ్రీగా ఉన్నప్పుడే నిద్ర త్వరగా పడుతుంది. చెవి మసాజ్ పాయింట్లు తెలుసుకుంటే మీకు మీరు కూడా చేసుకోవచ్చు.


Also read: వీటిని రోజూ తింటే డయాబెటిస్ వచ్చే అవకాశం సగం వరకు తగ్గిపోతుంది













గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.