Foods That Worsen Menstrual Cramps : పీరియడ్ సమయంలో ఫుడ్ క్రేవింగ్స్ ఉంటాయి. ఆ సమయంలో ఏది పడితే అది తినేస్తూ ఉంటారు. అప్పటివరకు డైట్​లో స్ట్రిక్ట్​గా ఉన్నా పీరియడ్స్ సమయంలో అది కంప్లీట్​గా బ్రేక్ చేసేవాళ్లు ఉంటారు. అయితే ఆ సమయంలో కొన్ని ఫుడ్స్ జోలికి అస్సలు వెళ్లకూడదని చెప్తున్నారు. వాటివల్ల క్రాంప్స్, బ్లీడింగ్ ఎక్కువయ్యే అవకాశముందని హెచ్చరిస్తున్నారు. ఇంతకీ తినకూడని ఫుడ్స్ ఏంటి? పీరియడ్స్ సమయంలో తినాల్సిన ఫుడ్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. 


స్వీట్లు


రిఫైండ్ షుగర్స్ తింటే మూడ్ స్వింగ్స్ ఎక్కువ అవుతాయి. అంతేకాకుండా శరీరంలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. కాబట్టి వీలైనంత వరకు బయట దొరికే స్వీట్స్​కి, బేక్ చేసిన ఫుడ్స్​కి వీలైనంత దూరంగా ఉండాలి. 
షుగర్ క్రేవింగ్స్ ఉంటే బెల్లంతో చేసిన స్వీట్స్, ఇంట్లో చేసుకునే ఫుడ్స్, ఫ్రూట్స్​ తింటే బెటర్. కానీ వేటిని అయినా లిమిట్​లో తీసుకోవాలి. అప్పుడు క్రేవింగ్స్ కంట్రోల్​లో ఉంటాయి. ఆరోగ్యానికి మేలు చేస్తాయి. 


కెఫిన్ 


టీ లేదా కాఫీలలో కెఫిన్ ఉంటుంది. చాలామంది వీటిని తలనొప్పిని దూరం చేసుకోవడానికి తాగుతారు. మరికొందరు దానిని మంచినీళ్లలా తాగుతూనే ఉంటారు. అలా కెఫిన్ ఎక్కువగా తీసుకునేవారికి కెఫిన్ తలనొప్పి సమస్యలను పెంచుతుందట. పీరియడ్స్ సమయంలో మరింత ఇబ్బందులు పడాల్సి వస్తుంది. 


ఆల్కహాల్


ఆడవారిలో పీరియడ్ సైకిల్​ని ఆల్కహాల్ నెగిటివ్​గా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా శరీరాన్ని డీహైడ్రేట్ చేసి.. పీరియడ్ సమయంలో పరిస్థితిని మరింత దిగజార్చుతుంది. బీపీ, మధుమేహం ఉన్నవారికి అయితే ఇది ప్రాణాంతక సమస్యలు ఇస్తుంది. కాబట్టి వీలైనంత తొందరగా ఆల్కహాల్​ని లిమిట్ చేసుకుంటే మంచిది. 


పొటాటో చిప్స్


సినిమా చూసేప్పుడు.. ఫ్రెండ్స్​తో ఛాయ్ తాగేప్పుడు.. లేదా ఆకలివేస్తున్నప్పుడు చాలామంది స్నాక్స్​గా పొటాటో చిప్స్ తింటారు. పిల్లలు కూడా వీటిని ఇష్టంగా లాగిస్తారు. పీరియడ్స్​లో కూడా ఎక్కువమంది చిప్స్ తింటారు. ఎక్కువకాలం నిల్వ ఉంచేందుకు వీటిలో ఎక్కువ ఉప్పు వాడుతారు. దీనివల్ల వివిధ ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయి. పీరియడ్ సమయంలో బ్లీడింగ్​ ఎక్కువయ్యేలా చేస్తాయి. 


వైట్ బ్రెడ్


వైట్ బ్రెడ్​లోని గ్లూటన్ శరీరంలో ఈస్ట్రోజెన్ హార్మోన్స్​ను పెంచుతాయట. అందుకే వైట్ బ్రెడ్ ఆరోగ్యానికి మంచిది కాదని చెప్తున్నారు. కాబట్టి దీనికి బదులుగా పీరియడ్స్ సమయంలో గ్లూటన్ ఫ్రీ బ్రెడ్​ను తీసుకుంటే మంచిదని చెప్తున్నారు నిపుణులు. 


స్పైసీ ఫుడ్


మసాలా, కారం లేకపోతే కొందరికి ముద్దే దిగదు. మసాలా, కారం ఆరోగ్యానికి మంచిదే కానీ.. లిమిట్​లో తినాలి. కానీ దానిని ఎక్కువ మోతాదులో తీసుకుంటే.. ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదట. ముఖ్యంగా పీరియడ్స్ సమయంలో తింటే.. కడుపులో మంట, ఎసిడిటీ, నొప్పి ఎక్కువయ్యే ప్రమాదముంది. 


ఐస్​క్రీమ్​లు


ఐస్​క్రీమ్​లను పిల్లల నుంచి పెద్దలవరకు అందరూ ఇష్టంగా తింటారు. అయితే వీటిలో డెయిరీ, షుగర్, సాల్ట్, వెజిటేబుల్ ఫ్యాట్ వంటి ఎన్నో పదార్థాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మంచిది కాదు. పీరియడ్ సమయంలో తింటే క్రాంప్స్ ఎక్కువ అవుతాయి. 


ఆరోగ్యానికి ఏవి మంచిదంటే.. 


అమ్మాయిలు పప్పులు, రైస్, ఉడికించిన కూరగాయలు, పండ్లు, షుగర్​లేకుండా ఇంట్లో చేసుకునే ఫ్రూట్ జ్యూస్​లు, చికెన్, చేపలు, పనీర్, శనగలు, డార్క్ చాక్లెట్, ఎగ్స్ వంటి వాటిని తీసుకోవచ్చు. ఇవి పీరియడ్ సమయంలో తింటే చాలా మంచిది. అలాగే రోజూ వారి డైట్​లో తీసుకుంటే మరీ మంచిది. కానీ ఏది తిన్నా లిమిట్​గా తినాలని గుర్తుంచుకోవాలి. 



Also Read : పీరియడ్స్​లో ఉన్నప్పుడు ప్రయాణం చేయాల్సివస్తే తీసుకోవాల్సి జాగ్రత్తలు, ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇవే