మన శరీరంలో సహజంగా కొన్ని రకాల హార్మోన్ల ఉత్పత్తి జరుగుతుంది. ఆ హార్మోన్లు జీవక్రియలు సజావుగా జరగడానికి చాలా అవసరం. అలాంటి హార్మోన్లలో ఇన్సులిన్ ఒకటి. ఇది జీర్ణవ్యవస్థలోని పాంక్రియాస్ అనే గ్రంథి నుంచి విడుదలవుతుంది. ఇది మనం ఆహారం ద్వారా తీసుకున్న చక్కెర్ల సంశ్లేషణకు తోడ్పడే హార్మోన్ అంటే ఆహారం ద్వారా శరీరంలోకి చేరిన పిండిపదార్థాలలోని చక్కెరను శక్తిగా మార్చి జీవక్రియలన్నీ సజావుగా జరగడానికి తొడ్పడే హోర్మోన్ ఇన్సులిన్ అని చెప్పవచ్చు. ఇది తగినంత ఉత్పత్తికాకపోయినా లేదా ఉత్పత్తి అయిన ఇన్సులిన్ క్రియాశీలకంగా లేకపోయినా డయాబెటిస్ సమస్య మొదలవుతుంది.
ఇన్సులిన్ ఉత్పత్తి అవుతున్నప్పటికీ అది క్రియాశీలంగా లేకపోవడాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్సి లేదా ఇన్సులిన్ నిరోధకతగా చెప్పుకోవాలి. ఇది ఈజీగా తీసుకోవాల్సిన సమస్య కాదు. తీవ్రమైన అనారోగ్యాలకు ఇది కారణం కావచ్చు. ఇన్సులిన్ నిరోధకత వల్ల గ్లూకోజ్ ను శరీర కణాలు గ్రహించలేవు. అందువల్ల రక్తంలో గ్లూకోజ్ నిల్వలు పెరిగిపోతాయి. దీర్ఘకాలం పాటు కొనసాగినపుడు అది డయాబెటిస్ కి దారితీస్తుంది. అంతేకాదు గుండెజబ్బులు, పీసీఓఎస్, స్థూలకాయం వంటి ప్రమాదకర అనారోగ్యాలకు కూడా కారణం కావచ్చు. కాబట్టి ఇన్సులిన్ సెన్సిటివిటి మెరుగు పరుచుకోవడం చాలా అవసరం.
పచ్చి కొబ్బరి ముక్కలు
పచ్చికొబ్బరి ముక్కల గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. ఇలా తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న పదార్ధాలు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ను చాలా సమర్థవంతంగా తిప్పికొడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. కొబ్బరిలో సహజంగానే కార్బోహైడ్రేట్లు తక్కువ. ఫైబర్ చాలా ఎక్కువ. సహజమైన సాచురేటెడ్ ఫ్యాట్ కలిగిగ ఆహారం. రోజూ కొబ్బరి ముక్కలు ఆహారంలో తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి కూడా అదుపులో ఉంటుంది. కొబ్బరిని అలాగే కూడా తినవచ్చు లేదా రకరకాల పదార్థాల రూపంలోనూ తీసుకోవచ్చు. కొబ్బరి పాలు, కొబ్బరి నూనె ఇలా ఏ రూపంలో తీసుకున్న కొబ్బరి చేసే మేలు అంతాఇంతా కాదు.
మొలకలు
గింజలు మొలకెత్తే స్థితిలో ఉన్నపుడు వాటిలో ఉండే స్టార్చ్ కంటెంట్ తగ్గిపోతుంది. ముఖ్యంగా పప్పు ధాన్యాల మొలకల్లో ప్రొటీన్ కంటెంట్, యాంటీ ఆక్సిడెంట్లు కూడా పెరుగుతాయి. కనుక మొలకెత్తే దశలో ఉన్న బీన్స్ జాతి గింజలేవైనా సరే ఇన్సులిన్ రెసిస్టెన్స్ నుంచి మిమ్మల్ని కాపాడుతాయి. నిజానికి ఇవి సూపర్ ఫూడ్. మొలకెత్తిన గింజలతో సలాడ్ సులభంగా చేసుకుని తినవచ్చు. ఇవి ఎంతో పుష్టికరమైన స్నాక్ గా చెప్పుకోవచ్చు.
పెరుగు, అవిసెగింజలు
ఎలాంటి ఫ్లేవర్స్ ఆడ్ చెయ్యని ప్లెయిన్ పెరుగు జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. నీళ్లు వడకట్టిన హంకర్డ్ మరింత మంచిది. పెరుగులో ఉండే ప్రొబయోటిక్ రక్తంలో గ్లూకోజ్ తగ్గిస్తుంది. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటిని మెరుగు పరుస్తుంది. అయితే ఒమెగా3 ఫాటీ ఆసిడ్స్ కూడా ఇన్సులిన్ సెన్సిటివిటికి అవసరం. ఇవి పుష్కలంగా దొరికే అవిసెగింజలు వీటినే ఫ్లాక్ సీడ్స్ అంటారు. వీటిని పెరుగుతో కలిపి తీసుకున్నపుడు మరింత ప్రయోజన కరంగా ఉంటుంది.
షియా సీడ్స్
షీయా సీడ్స్ కూడా ఓమెగా 3 ఫాటీ ఆసిడ్స్ పుష్కలంగా ఉండే మరో స్నాక్. వీటిలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా ఎక్కువ. చక్కెర లేకుండా ఫుడ్డింగ్ లో షియా సీడ్స్ తీసుకుంటే హెల్దీగా తినెయ్యొచ్చు.
మరి ఈ స్నాక్స్ తీసుకుని ఇన్సులిన్ సెన్సిటివిటి పెంచుకోవడం మాత్రమే కాదు ఇతర అనారోగ్యాలు దరిచేరకుండా ఆరోగ్యంగా ఉండొచ్చు.