Food Combinations for Better Brain Health : ఇంట్లో తాళాలు ఎక్కడ పెట్టామో గుర్తుకురాకపోవడం.. ఎవరిదైనా పేరు గుర్తుకు రాకపోవడం.. ఏదైనా పని కోసం మరో గదిలోకి వెళ్లి.. ఎందుకు వెళ్లామో మర్చిపోవడం.. ఇలాంటి చిన్న చిన్న విషయాలు అప్పుడప్పుడు అందరికీ జరుగుతుంటాయి. అయితే తరచూ మతిమరుపు, ఏకాగ్రత లోపం కనిపిస్తుంటే.. మన జీవనశైలి, నిద్ర, ఒత్తిడితో పాటు ఆహారంపై కూడా దృష్టి పెట్టాలని అర్థం అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఆహారంలో కొన్ని ఫుడ్స్ చేర్చుకోవాల్సి ఉంటుంది. 

Continues below advertisement

అయితే ఏ ఒక్క ఆహారం కూడా రాత్రికి రాత్రే మెమరీ పవర్ పెంచదు. కానీ కూరగాయలు, పండ్లు, సంపూర్ణ ధాన్యాలు, పప్పులు, గింజలు, చేపలు, ఆరోగ్యకరమైన కొవ్వులు వంటి పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మెదడు ఆరోగ్యానికి మేలు చేయవచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి. కొన్ని కాంబినేషన్స్ కూడా మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అవేంటంటే..  

Also Read : బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదం ఎవరికి ఎక్కువ? FAST టెక్నిక్ గుర్తుపెట్టుకుంటే ప్రాణం కాపాడొచ్చు.. లేకుంటే అంతే

Continues below advertisement

పాలకూర, గుడ్లు

పాలకూర, తోటకూర వంటి ఆకుకూరల్లో ఫోలేట్, విటమిన్ కె, కెరోటినాయిడ్స్ వంటి పోషకాలు ఉంటాయి. గుడ్లలో కోలిన్ ఉంటుంది. ఇది కణాల నిర్మాణంతో పాటు నాడీ వ్యవస్థకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రక్రియల్లో పాత్ర పోషిస్తాయి. అందుకే బ్రేక్‌ఫాస్ట్‌లో పాలకూరతో ఆమ్లెట్ లేదా పాలకూరతో స్క్రాంబుల్డ్ ఎగ్స్ లేదా ఉడికించిన గుడ్డుతో ఆకుకూరల సలాడ్ తీసుకోవచ్చు. వీటిని రెగ్యులర్గా డైట్లో చేర్చుకుంటే మెదడు ఆరోగ్యం మెరుగుపడవచ్చని చెప్తున్నారు. 

బెర్రీలు, వాల్‌నట్స్

స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీస్ వంటి బెర్రీల్లో ఫ్లేవనాయిడ్స్, ఆంథోసైనిన్స్ వంటి మొక్కల సమ్మేళనాలు ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యంపై ఎలా ప్రభావం చూపుతాయనే అంశంపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. వాల్‌నట్స్, బాదం వంటి గింజల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. కాబట్టి సాయంత్రం స్నాక్‌గా కొద్దిగా బెర్రీలతో పాటు కొన్ని వాల్‌నట్స్ లేదా బాదం తీసుకోవచ్చు.

Also Read : చనిపోయాక గుండె ఆగిపోయినా కూడా బ్రెయిన్ పని చేస్తుందా? కొత్త అధ్యయనంలో షాకింగ్ విషయాలు

చేపలు, కూరగాయలు, ఆలివ్ ఆయిల్

సాల్మన్, సార్డిన్స్, మాకెరెల్ వంటి కొవ్వు చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి మెదడు, గుండె ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు. వీటితో పాటు కూరగాయలు, కొద్దిగా ఆలివ్ ఆయిల్ కలిపి తీసుకుంటే ఆరోగ్యకరమైన ఫ్యాట్స్, ఫైబర్, విటమిన్లు, మొక్కల సమ్మేళనాలు భోజనంలో అందుతాయి. 

పప్పు, బ్రౌన్ రైస్

కందిపప్పు, పెసరపప్పు, శనగలు వంటి పప్పుధాన్యాలతో పాటు బ్రౌన్ రైస్ లేదా ఇతర సంపూర్ణ ధాన్యాలు తీసుకోవచ్చు. పప్పుల్లో ప్రోటీన్, ఫైబర్, వివిధ మినరల్స్ ఉంటాయి. సంపూర్ణ ధాన్యాల్లో ఫైబర్ వంటి పోషకాలు లభిస్తాయి. రోజువారీ ఆహారంలో వీటిని చేర్చుకుంటే ఆరోగ్యానికి మంచిది.

Also Read : ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ దినోత్సవం.. మెదడులో కణితులు ప్రాణాంతకమా? చరిత్ర, చికిత్సలు ఇవే

పెరుగు, బెర్రీలు, నట్స్ 

సింపుల్ బ్రేక్‌ఫాస్ట్ లేదా సాయంత్రం స్నాక్ కావాలంటే పెరుగులో బెర్రీలు, కొద్దిగా బాదం లేదా వాల్‌నట్స్ కలిపి తినవచ్చు. దీంతో ప్రోటీన్, హెల్తీ ఫ్యాట్స్, ఫైబర్, వివిధ మొక్కల పోషకాలు లభిస్తాయి. అయితే ఫ్లేవర్డ్ యోగర్ట్స్‌లో చక్కెర ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ప్లెయిన్ పెరుగు తీసుకోవడం మంచిది.

ఓట్స్, నట్స్, ఫ్రూట్స్

ఉదయాన్నే బ్రేక్​ఫాస్ట్​లో భాగంగా ఓట్స్‌, బాదం, వాల్‌నట్స్, చియా లేదా ఫ్లాక్స్ సీడ్స్‌తో పాటు ఒక పండు కలిపి తీసుకోవచ్చు. ఓట్స్, గింజలు, పండ్ల నుంచి ఫైబర్, మినరల్స్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఇతర మొక్కల పోషకాలు అందుతాయి. 

Also Read : ప్రపంచ బ్రెయిన్ డే 2025.. మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరిచి, మతిమరుపును దూరం చేసే టాప్ 5 ఫుడ్స్ ఇవే

ఉసిరి/జామతో నట్స్ 

విటమిన్ C ఎక్కువగా ఉండే ఉసిరి, జామ వంటి పండ్లను స్నాక్‌గా తీసుకోవచ్చు. వీటితో పాటు కొన్ని బాదం లేదా వాల్‌నట్స్ తీసుకుంటే పండ్లతో పాటు ఆరోగ్యకరమైన కొవ్వులు, ఇతర పోషకాలు కూడా లభిస్తాయి. ఇలాంటి రంగురంగుల పండ్లు, కూరగాయలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం మొత్తం ఆరోగ్యానికి మంచిది.

తరచూ ఏదైనా మర్చిపోతున్నారంటే దాని అర్థం కేవలం ఆహార సమస్యే కాదు. నిద్ర సరిగ్గా లేకపోవడం, ఎక్కువ ఒత్తిడి, కొన్ని మందులు ఉపయోగించడం, ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం, వయసుతో వచ్చే మార్పులు, కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా జ్ఞాపకశక్తి, ఏకాగ్రతపై ప్రభావం చూపిస్తాయి. కాబట్టి తగినంత నిద్ర, క్రమం తప్పకుండా శారీరక వ్యాయామం, ఒత్తిడిని నియంత్రించుకోవడం చేస్తే మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. సమస్య తీవ్రంగా ఉంటే మాత్రం కచ్చితంగా వైద్యసహాయం తీసుకోవాల్సి ఉంటుంది. 

Also Read : ఒంటరిగా తినే అలవాటు మంచిది కాదా? మానసిక ఆరోగ్యానికి హాని చేస్తుందా?