కొంతమంది ప్రజలు.. బురిడీ బాబాల వలలో చాలా ఈజీగా పడిపోతారు. టెక్నాలజీ ఎంతగా డెవలప్ అవుతున్నా.. ఇంకా చాలామంది మూఢ నమ్మకాలనే పట్టుకుని వేలాడుతున్నారు. దీన్ని ఆసరాగా తీసుకుని కొంతమంది స్వామిజీలు తమని తాము దేవుడిగా ప్రకటించుకుంటున్నారు. జనాలు కూడా గంగిరెద్దుల్లా వారి వెంట పడుతున్నారు. ఈ అజ్ఞానం కేవలం మన దేశంలోనే కాదు, థాయ్‌లాండ్‌లో కూడా ఉంది. 


ఇటీవల థాయ్‌లాండ్ పోలీసులు తావీ నంరా(75) అనే ఓ బాబాను అదుపులోకి తీసుకున్నారు. తనని తాను దేవుడిగా ప్రకటించుకోవడమే కాదు.. తన మల, మూత్రాలు ఔషదంలా పనిచేస్తాయని, రోగాలు మాయం చేస్తాయని ప్రకటించాడు. ఇంకేముంది భక్తులు అతగాడి మలమూత్రాలను స్వీకరించేందుకు క్యూ కట్టారు. అప్పటికే చాలామంది అతడి చెండాలన్నీ ఆవురావురమంటూ.. ముక్కు మూసుకుని మరీ తినేశారు. మూత్రాన్ని సైతం కూల్ డ్రింక్‌లా తాగేశారు. 


ప్రభుత్వ స్థలంలో తావీ, తన అనుచరులతో కలిసి ఆశ్రమాన్ని కూడా పెట్టేశాడు. ఈ విషయం తెలిసి పోలీసులు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా ఈ భయానక నిజాలు వెలుగులోకి వచ్చాయి. వారంతా ఆరోగ్యంగా ఉండేందుకు తావీ మలమూత్రాలను స్వీకరిస్తున్నామని చెప్పడంతో పోలీసుల దిమ్మతిరిగింది. మరో షాకింగ్ విషయం ఏమిటంటే పోలీసులకు అక్కడ 11 శవాలు లభించాయి. వాటిలో 5 శవాలకు మాత్రమే డెత్ సర్టిఫికెట్స్ ఉన్నాయి. 


ఈ ఘటనపై ప్రావిన్సిషయల్ గవర్నర్ క్రైస్ర్న్ కొంగుచాలాడ్ ‘AP’తో మాట్లాడుతూ.. ‘‘పోలీసులు అక్కడ రైడింగ్ చేసే సమయానికి సుమారు 12 మంది వరకు భక్తులు తావీతో ఉన్నారు. వారంతా ఆ బాబా మలమూత్రాలను స్వీకరిస్తున్నారని తెలిసి చాలా ఆశ్చర్యం కలిగింది. అలాంటి ఎలా విశ్వసిస్తున్నారా అని అనిపించింది. అక్కడ మాకు శవాలు కూడా లభించాయి. అవి ఎవరివి? ఎందుకు అక్కడ ఉన్నాయనే అంశాలపై విచారణ జరుపుతున్నాం’’ అని తెలిపారు. 


Also Read: భర్తతో సెక్స్‌కు నో! దేశంలో 82 శాతం భార్యలు ఇలాగే ఉన్నారట, ఈ రాష్ట్రాల్లో మరీ ఎక్కువ!


స్థానిక వార్త పత్రికల కథనం ప్రకారం.. అన్ని మతాలకు తానే పెద్దనని తావీ తనకు తాను ప్రకటించుకున్నాడు. అయితే, అతడి వద్దకు వెళ్లిన చాలామంది భక్తులు తిరిగి ఇళ్లకు రాలేదని తెలిసింది. జెంజిరా అనే మహిళ మాట్లాడుతూ.. ‘‘80 ఏళ్ల అమ్మ.. అతడికి ఫాలోవర్. అతడిని దైవంగా భావించేది. తావీ బాబా తన మలం, ఉమ్మిని తినాలని భక్తులకు ఆదేశించేవాడు. తన మూత్రం తాగితే సర్వరోగాలు మాయమవుతాయని చెప్పేవాడు. అతడి వద్దకు వెళ్లిన తర్వాత మళ్లీ మా అమ్మ కనిపించలేదు’’ అని తెలిపింది. 


Also Read: ప్రియుడి కండోమ్‌కు సీక్రెట్‌గా రంథ్రాలు చేసిన మహిళ, ఊహించని శిక్ష విధించిన కోర్టు!


తావీ అరెస్టు సందర్భంగా అతడి అనుచరులు ప్రతిఘటించారు. వారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఆయన్ని మేము దైవంలా భావిస్తున్నాం. అతడి మలం నుంచి అస్సలు వాసన రాదు. కేవలం కళంకిత మనస్సు గల వ్యక్తులకు మాత్రమే అతడి మలం కంపు కొడుతుంది’’ అని పోలీసులతో వాదించారు. బాబా చేస్తున్న మోసాలను పక్కనపెడితే.. అతడి వద్ద శవాలు ఎందుకు ఉన్నాయి? అతడిని ఆశ్రయిస్తున్న భక్తులు ఏమవుతున్నారు? అనే సందేహాలకు ఇంకా సమాధానం రావల్సి ఉంది.