మీకు పెళ్లయ్యిందా? అయితే, దీని గురించి మీకు కొద్దిగా అవగాహన ఉండే ఉంటుంది. పెళ్లయిన కొత్తలో సెక్స్‌పై ఉండే ఆసక్తి.. ఆ తర్వాత ఉండదు. భర్తకు ఆ ఉద్దేశం ఉన్నా.. భార్య మాత్రం అంతగా ఆసక్తి చూపదు. దీంతో చాలామంది ‘నా భార్యే ఇలా ఉందా?’ అని తమలో తాము కుమిలిపోతారు. అయితే, దేశంలో 82 శాతం మంది భార్యలంతా ఇలాగే ఉన్నారని, భర్తతో సెక్స్‌కు నిరాకరిస్తున్నారని ప్రభుత్వ ఆరోగ్య శాఖ నిర్వహించిన హెల్త్ సర్వే వెల్లడించింది. 


దేశంలో ప్రతి ఐదుగురు మహిళల్లో నలుగురు (82 శాతం) భర్తతో లైంగిక సంబంధం ఇష్టం లేకపోతే.. ముఖం మీద ‘నో’ చెప్పేస్తామని చెప్పారట. ముఖ్యంగా లక్షద్వీప్‌లో అత్యధికంగా 94.2 శాతం, గోవాలో (92 శాతం) మహిళలు తమ భర్తకు ధైర్యంగా ‘నో’ చెబుతారట. ఆంధ్రప్రదేశ్‌లో 79.3 శాతం, తెలంగాణలో 84.9 శాతం మంది మహిళలు తమ భర్తకు ‘నో’ చెబుతారని సర్వేలో వెల్లడించారు. కేవలం అరుణాచల్ ప్రదేశ్‌లో (63 శాతం), జమ్మూ కశ్మీర్‌లో (65 శాతం)లో మాత్రం మహిళలు ఆ ధైర్యాన్ని చూపలేకపోతున్నారని నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 (National Family Health Survey 5) పేర్కొంది. 


NFHS-5 నివేదికను కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవ్య గత వారం విడుదల చేశారు. జూన్ 17, 2019 నుంచి జనవరి 30, 2020 వరకు 17 రాష్ట్రాలు, 5 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ సర్వే నిర్వహించారు. జనవరి 2, 2020 నుంచి ఏప్రిల్ 30 వరకు రెండో దశ సర్వే నిర్వహించారు. 2011 వరకు 11 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో సర్వే చేపట్టారు. 


భార్యకు ఇష్టం లేకుండా బలవంతంగా శృంగారం చేయడాన్ని ‘వైవాహిక అత్యాచారం’గా పరిగణిస్తారు. కానీ, భారతీయ శిక్షాస్మృతి (IPC) కింద ఇది అత్యాచారం కాదు. 18 ఏళ్లు పైబడిన భార్యను భర్త బలవంతం చేస్తే.. అతడిని విచారించడం సాధ్యం కాదు. సర్వేలో భాగంగా సెక్స్‌ను నిరాకరించిన భార్యపై భర్తల వైఖరి ఎలా ఉంటుందనే విషయాన్ని కూడా ప్రశ్నించారు. ఈ సందర్భంగా నాలుగు ముఖ్యమైన ప్రశ్నలు సంధించారు. 


Also Read: ప్రియుడి కండోమ్‌కు సీక్రెట్‌గా రంథ్రాలు చేసిన మహిళ, ఊహించని శిక్ష విధించిన కోర్టు!


‘‘భార్య లైంగికంగా కలిసేందుకు నిరాకరిస్తే.. మీ ప్రవర్తన ఎలా ఉంటుంది? కోపం తెచ్చుకుని ఆమెను మందలిస్తారా? ఆమెకు డబ్బు లేదా ఇతర ఆర్థిక సహాయం ఇవ్వడానికి నిరాకరిస్తారా? ఆమె ఇష్టం లేకపోయినా ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకుంటారా? మరొక స్త్రీతో సెక్స్ చేస్తారా?’’ అని ప్రశ్నించారు. అయితే, కేవలం 6 శాతం మంది పురుషులే ఆ ‘నాలుగు’ అమలు చేస్తామని చెబుతున్నారు. 72 శాతం మంది భర్తలు మాత్రం ఆ నాలుగు ప్రవర్తనలతో ఏకీభవించలేదు. అయితే, భార్య.. భర్తతో శృంగారంలో పాల్గొనడానికి నిరాకరిస్తే కోపం తెచ్చుకుని, మందలించే హక్కు భర్తకు ఉందని 19 శాతం మంది పురుషులు అంగీకరించారని సర్వే వెల్లడించింది. దాదాపు అన్ని రాష్ట్రాల్లో, నాలుగు రకాల ప్రవర్తనలలో దేనితోనూ ఏకీభవించని పురుషుల శాతం 70 శాతానికి పైగా ఉంది. వీరిలో అత్యధికంగా పంజాబ్‌ (50 శాతం) పురుషులే ఉన్నారు.


Also read: షిగెల్లా బ్యాక్టిరియా వల్ల మనదేశంలో తొలి మరణం? జాగ్రత్త ఈ బ్యాక్టిరియా అంటువ్యాధి