సెలెబ్రిటీల డైట్‌గా మారిపోయింది వీగన్ డైట్. చాలా మంది సెలెబ్రిటీలు వీగన్ డైట్‌ను ఫాలో అయ్యేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ, ఆమిర్ ఖాన్, కంగనా రనౌత్, సోనమ్ కపూర్, ఆలియా భట్, సెరెనా విలియమ్స్, వీనస్ విలియమ్స్ వంటి ఎంతో మంది సెలెబ్రిటీలు ప్రస్తుతం వీగన్ డైట్ లవర్స్ గా మారారు. మరింత మంది ఇదే బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. సెలెబ్రిటీలకు అంతగా నచ్చేలా ఈ డైట్లో ఉన్న ప్రత్యేకత ఏంటి?
అసలు ఏంటి వీగన్ డైట్?
పూర్తిగా మొక్కల ఆధారిత ఆహారమే వీగన్ డైట్. జంతువుల నుంచి వచ్చే, తయారయ్యే ఏ ఉత్పత్తిని వీరు తినరు. చివరికి పాలు, పెరుగు, తేనె వంటివి కూడా ముట్టుకోరు. మొక్కల నుంచి వచ్చే ఆహారాన్ని మాత్రమే వీరు స్వీకరిస్తారు. కొంతమంది కనీసం లెదర్ బ్యాగులు వాడేందుకు కూడా ఇష్టపడరు. ఇలాంటి వీగన్ డైట్ ఫాలో అయ్యేవారిని వీగన్లు అంటారు.
ఈ డైట్ వల్ల ఎన్ని లాభాలో...
చురుగ్గా పనిచేసేందుకు వీగన్ డైట్ చాలా సహకరిస్తుంది. ముఖ్యంగా నటీనటులు, క్రీడాకారులకు శరీరం ఫ్లెక్సిబుల్ గా, ఉత్సాహంగా, చురుగ్గా ఉండడం చాలా అవసరం. వీగన్ డైట్ ను ఫాలో అవ్వడం వల్ల ప్రొటీన్లు, కాల్షియం, విటమిన్ డి, కార్బోహైడ్రేట్లు, ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా అందుతాయి. గాయాలు త్వరగా మానేందుకు కూడా ఈ డైట్ చాలా అవసరం. ఈ డైట్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బరువు పెరగరు. పైగా అధిక బరువు ఉన్న వారు సులువుగా తగ్గుతారు.
ఆరోగ్యానికీ... పర్యావరణానికీ...
వీగన్ డైట్ వల్ల ఆరోగ్యానికే కాదు పర్యావరణానికీ మేలు జరుగుతుంది. ఈ డైట్ ను అనుసరించడం వల్ల చక్కెర, కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. కాబట్టి మధుమేహం, క్యాన్సర్ బారిన పడే అవాకాశం చాలా తక్కువ. అందుకే ఈ ఆహారాన్ని అధిక శాతం మంది తినేందుకు ఇష్టపడుతున్నారు. పర్యావరణానికి ఈ డైట్ వల్ల చాలా లాభం. కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు ఇది సహాయపడుతుంది. అయితే ఈ డైట్‌ను అనుసరించడం వల్ల మైక్రో న్యూట్రియంట్ల లోపం,ప్రొటీన్ల లోపం కూడా తలెత్తే అవకాశం ఎక్కువ. అందుకే ఈ డైట్ ఫాలో అవ్వాలనుకునేవారు గోధుమలు, సోయాబీన్ వంటివి ఆహారంలో చేర్చుకోవాలి. పోషకాలన్నీ ఉండేలీ వీగన్ మెనూని సిద్ధం చేసుకోవాలి.
Also read: ఊబకాయంతో క్యాన్సర్ ముప్పు, బరువు తగ్గాల్సిందే
Also read: సల్మాన్ ఖాన్‌కున్న ఆరోగ్య సమస్య ఇదే, ఇదో వింత రోగం
Also read: ఆహారం, నీళ్లు మింగడం కష్టంగా ఉందా? అది చాలా డేంజరస్ సంకేతం