హైదరాబాద్‌లోని బేగంబజార్‌లో ఓ వ్యాపారిని పోలీసులు చాలా రోజు క్రితం అరెస్టు చేశారు. ఆయనకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్లు, సెల్‌ఫోన్లు, క్రెడిట్, డెబిట్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఆయన కొన్నిరోజులు జైల్లో కూడా ఉన్నాడు. తర్వాత బెయిల్ వచ్చింది. ఇంటికి వచ్చాక తన మొబైల్ చూసుకుంటే ఐదు లక్షలు డ్రా అయినట్టు గుర్తించాడు. తాను జైల్లో ఉన్నప్పుడు ఈ ట్రాన్సాక్షన్ ఎలా ఫిర్యాదు చేస్తే షాకింగ్ న్యూస్ తెలిసింది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో బేగంబజార్‌కు చెందిన టైర్ల వ్యాపారి అగర్వాల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆయన్ని అరెస్టు చేసిన టైంలో అతని వద్ద ఉన్న సెల్‌ఫోన్, డెబిట్ క్రెడిట్ కార్లు స్వాధీనం చేసుకున్నారు. అన్నింటినీ కోర్టుకు సమర్పించారు. ఆ కేసులో అగర్వాల్‌ను రిమాండ్ పంపింది కోర్టు. ఆయన జైలుకు వెళ్లాడు. కొన్ని రోజుల తర్వాత బెయిల్ వచ్చి జైలు నుంచి విడుదలయ్యారు.
ఇంటికి వచ్చిన అగర్వాల్ తను జైలుకు వెళ్లిన తర్వాత జరిగిన వ్యాపార లావాదేవీలపై ఆరా తీశారు. డబ్బులు ఎవరికి ఎంత ఇచ్చారు... ఎలాంటి ట్రాన్సాక్షన్ జరిగాయో అకౌంట్స్ చూసుకుంటూ సరిచూసుకున్నారు. అప్పుడే ఐదు లక్షలు తన అకౌంట్ నుంచి డ్రా అయినట్టు గుర్తించారు. జైల్లో ఉన్నప్పుడు తన అకౌంట్ నుంచి అంత మొత్తాన్ని ఎవరు తీసుంటారు అనే డౌట్ వచ్చింది. ఇంట్లో వాళ్లను అడిగితే తమకు తెలియదన్నారు.
ఐదు లక్షలు తన అకౌంట్‌ను ఎక్కడికి వెళ్లాయో తెలియక తనపట్టుకున్నాడా వ్యాపారి. బ్యాంకు అధికారులను కలిసి తన అకౌంట్‌ను ఐదు లక్షలు డ్రా అయ్యాయని అవి ఎప్పుడు ఎక్కడ తీసారో చెప్పాలని రిక్వస్ట్ చేశారు. ఆ డబ్బులు బ్యాంకు ఏటీఎం నుంచి డ్రా చేశారన్న షాకింగ్ విషయాన్ని బ్యాంకు అధికారులు చెప్పారు.
ఆ డబ్బులు డ్రా చేసిన టైంలో తను జైల్లో ఉన్నానని.. తన అరెస్టు టైంలో ఏటీఎంతోపాటు మిగతా వస్తువులను పోలీసులే తీసుకున్నారని మరి డబ్బులు ఎవరు డ్రా చేసి ఉంటారో అని తలబద్దలగొట్టుకున్నాడు వ్యాపారి. పోలీసులకు చెబితే వాళ్లే అసలు దొంగను పట్టిస్తారని అనుకొని.. రాచకొండ పోలీసుల ఉన్నతాధికారులకు ఐదు లక్షల విషయంపై పిర్యాదు చేశారు.
వ్యాపారి జైల్లో ఉన్నటైంలో... డబ్బులు డ్రా అవడాన్ని పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. ఇదేదో తమ ఇంటి దొంగల పనేమో అనుకొని సీక్రెట్ ఎంక్వయిరీ స్టార్ట్ చేశారు. అప్పుడే అసలు విషయం రివీల్ అయింది. అరెస్టు చేసిన టైంలో ఇన్‌స్పెక్టరే ఈ చోరీలో అసలు సూత్రధారి అని తెలిసింది.
అరెస్టు టైంలో వ్యాపారి వద్ద నుంచి తీసుకున్న ఎటీఎం కార్డు నుంచి ఐదులు లక్షలు కొట్టేసి చేతివాటం ప్రదర్శించింది తమ రాచకొండ ఎస్సై అని తెలిసి అంతా ఆశ్చర్యపోయారు. అంతర్గత విచారణ ప్రారంభించిన రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్.. అతనిపై చర్యలు తీసుకుంటామన్నారు.