Sri Lanka Crisis: మహింద రాజపక్స ప్రధాని పదవికి రాజీనామా చేసిన తర్వాత శ్రీలంకలో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ప్రజలు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. దీంతో ఆ దేశానికి భారత్ తన బలగాలను పంపిస్తుందని పలు వార్తలు వచ్చాయి. ఇందులో నిజమెంత?
భారత్ స్పందన
ఈ వార్తలపై భారత్ స్పందించింది. శ్రీలంకకు భారత్ పూర్తిగా మద్దతు ఇస్తుందని పేర్కొంది. ఆ దేశ ప్రజాస్వామ్యానికి, స్థిరత్వానికి, ఆర్థిక వ్యవస్థకు భారత్ మద్దతు ఎప్పుడూ ఉంటుందని కొలంబోలోని భారత హై కమిషన్ వెల్లడించింది. అయితే శ్రీలంకకు భారత్ తన బలగాలను పంపిస్తుందన్న వార్తలను మాత్రం ఖండించింది.
తీవ్ర నిరసనలు
అల్లర్లు, హింసాత్మక ఆందోళనలతో శ్రీలంక అట్టుడుకుతోంది. ప్రభుత్వ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఘర్షణలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సోమవారం జరిగిన అల్లర్లలో 8 మంది చనిపోయారు. 200 మందికిపైగా గాయపడ్డారు.
ప్రజలు శాంతియుతంగా ఉండాలని పిలుపునిచ్చారు అధ్యక్షుడు గొటబాయ రాజపక్స. హింసను విడనాడాలని, ఏకాభిప్రాయంతో రాజకీయ స్థిరత్వానికి కృషి చేయాలన్నారు. నిరసనకారులు మాత్రం అధ్యక్షుడు కూడా రాజీనామా చేయాలని ఆందోళన చేస్తున్నారు.
Also Read: Karnataka Loudspeaker Row: లౌడ్ స్పీకర్లపై నిషేధం- ఎట్టకేలకు దిగొచ్చిన సర్కార్!
Also Read: Ola Uber Customer Complaints: ఓలా, ఉబర్ క్యాబ్‌లకు కేంద్రం షాక్- కఠిన చర్యలు తప్పవని వార్నింగ్!