Tips to Increase Stamina : మనం ఏ పని చేయడానికైనా స్టామినా చాలా అవసరం. లేదంటే త్వరగా నీరసమైపోతాము. చిన్నప్పుడు కిలో మీటర్లు సునాయసంగా పరుగెత్తేసిన మీరు ఇప్పుడు కొంచెం దూరం కూడా పరిగెత్తలేకపోతున్నారా? కనీసం వేగంగా నడవగలుగుతున్నారా? దాని అర్థం మీరు హెల్త్​ని విస్మరిస్తున్నారని. హా మేము ఎందుకు పరుగెడుతాము? మేము ఏమైనా రన్నింగ్ కాంపిటేషన్​లో పాల్గొంటున్నామా? అంటే ఇక అది మీ ఇష్టం. కానీ మీలో స్టామినా తగ్గుతుంది అంటే.. మీలో ఆరోగ్య సమస్యలు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయని అర్థం.


మీరు ప్రొఫెషనల్ మారథానర్ కాకపోయినా.. రోజులో కాస్త పరుగెత్తగలిగే మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఇది మీరు అలసటకు త్వరగా గురి కాకుండా.. ఎక్కువ సేపు మీరు ఎనర్జిటిక్​గా ఉండడంలో సహాయం చేస్తుంది. అంతేకాకుండా మీలో ఏకాగ్రతను పెంచుతుంది. అయితే మీ స్టామినాను మెరుగుపరిచే చిట్కాలు ఇక్కడున్నాయి. మీరు కూడా వాటిని ఫాలో అయి హెల్తీగా ఉండండి. 


స్లో అండ్ స్టడీ..


మీ స్టామినా పెంచుకునేందుకు రన్నింగ్​ చేయమంటున్నారు కదా అనే ఒకేసారి, ఓపిక లేకపోయినా పరుగెత్తడం కాదు. నెమ్మదిగా జాగింగ్​ ప్రారంభించండి. దానిని మీ రోటీన్​లో ఇంప్లిమెంట్ చేయండి. ఇది మీలో క్రమశిక్షణను పెంచుతుంది. తెలియకుండా మీరే రన్నింగ్ చేయడం ప్రారంభిస్తారు. వారం వారానికి మీరు జాగింగ్ చేసే దూరాన్ని పెంచుకుంటూ ఉండండి. తర్వాత నెమ్మదిగా రన్నింగ్ ప్రారంభించండి. అంతేకాకుండా వారానికి రెండు, మూడు సార్లు శక్తి శిక్షణ వ్యాయామాలు చేస్తే రన్నింగ్ సామర్థ్యం మెరుగుపడుతుంది. 


స్థిరత్వం ముఖ్యం


మీ స్టామినాను పెంచుకునేటప్పు స్థిరత్వం కీలకం. మీరు ఎక్కువ దూరం పరుగెడుతున్నారా? తక్కువ దూరం పరుగెడుతున్నారా? కాదు రెగ్యూర్​గా మీరు అనుకున్నది చేస్తున్నారా? మీరు వెళ్లాలనుకుంటున్నంత దూరం వెళ్లగలుగుతున్నారా అనేది మీ స్థిరత్వాన్ని డిసైడ్ చేస్తుంది. రన్నింగ్​ చేసే వారు తమ శక్తిని పెంచుకోవడానికి స్ప్రింట్ ఇంటర్వెల్ ట్రైనింగ్ తీసుకుంటారు. ఇది రన్నర్ల పనితీరు మెరుగుపరిచిందని ఓ అధ్యయనం తెలిపింది. 


మీ రన్నింగ్ స్టామినాను పెంచుకోవడానికి టక్ జంప్స్, క్లాప్ పుష్​ అప్​లు, బాక్స్ జంప్​లు, స్క్వాట్స్ జంప్​లు వంటి వ్యాయామాలు చేయవచ్చు. ఇవి కండరాల శక్తిని మెరుగుపరుస్తాయి. ఎందుకంటే కండరాలు తక్కువ సమయంలో ఎక్కువ శక్తిని వినియోగిస్తాయి. ఇది కండర సమస్యలను కూడా దూరం చేస్తాయి. 


ఒత్తిడి తగ్గించుకోండి..


ఒత్తిడి తగ్గించుకుంటే మానసిక, శారీరక రోగాలు సగం తగ్గుతాయి. స్టామినా పెంచుకోవాలని ఆత్రం కాకుండా.. మెల్లిగా దానిని ప్రోసెస్ చేసుకుంటే మీలో తెలియకుండానే స్టామినా పెరుగుతుంది. ఒత్తిడి ఉన్నప్పుడు మీ శరీరం మీకు అంతగా సహకరించదు. మీ రోగ నిరోధక శక్తి క్షీణిస్తుంది. అధికస్తాయిలో కార్టిసాల్, అడ్రినల్ హార్మన్ల అసమతుల్యతో ఇబ్బంది పడతారు. ఇది మీ నిద్ర మీద ప్రభావం చూపించి.. మీ స్టామినాను తగ్గిస్తుంది.


Also Read : అమ్మాయిలు న్యూ ఇయర్ పార్టీ కోసం మీ చర్మాన్ని, జుట్టుని సిద్ధం చేసుకోండిలా















గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.