ఆప్టికల్ ఇల్యూషన్లు పరిశీలనా నైపుణ్యాలను పరీక్షించడానికి ఒక మంచి మార్గం. ఇవి మీ మెదడు, కళ్ళు ఎలా పనిచేస్తున్నాయో చెప్పేస్తాయి. ఇక్కడ ఇచ్చిన ఆప్టికల్ ఇల్యూషన్లో G, H, O అనే ఆంగ్ల అక్షరాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా గజిబిజిగా ఉన్నాయి. ఒకచోట మాత్రం HOG అనే పదం ఉంది. ఆ పదం ఎక్కడుందో మీరు కనిపెట్టాలి. ఎక్కువ సమయం ఇస్తే ఎవరైనా కనిపెట్టేస్తారు. కేవలం 10 సెకన్లలో మాత్రమే కనిపెట్టాలి. పది సెకన్లలో మీ కళ్ళు ఈ పదాన్ని వెతికి పట్టుకుంటే మీరు తెలివైన వారే అని అర్థం. ఇంకెందుకు ఆలస్యం ఈ పదం ఎక్కడ దాక్కుందో వెతికి పట్టుకోండి.  కేవలం మూడు నుంచి పది సెకన్లలోనే వాటిని కనిపెట్టాలి. అప్పుడే మీరు చాలా తెలివైన వారని, మీలో పరిశీలనా శక్తి అధికంగా ఉందని, మీ మెదడు చురుగ్గా పనిచేస్తుందని అర్థమవుతుంది. 


ఆప్టికల్ ఇల్యూషన్ అంటేనే కళ్లను, మెదడును కాస్త గజిబిజి చేస్తాయి. ఆ గజిబిజిని, గందరగోళాన్ని దాటి జవాబు వరకు ముందుకు వెళ్లాలి. అప్పుడే మీకు సమాధానం దొరుకుతుంది. ఇప్పటికే జవాబు కనిపెట్టిన వారికి కంగ్రాట్స్. పది సెకన్లలోనే మీరు కనిపెట్టి ఉంటే మీరు తెలివి తేటలు, చూపు, మెదడు పనితీరు, పరిశీలనా శక్తి సూపర్. ఇక జవాబు కోసం వెతుక్కుంటున్న వారు... కింద నుంచి మూడో లైన్లో... చివరి మూడు అక్షరాలను చూడండి. అదే జవాబు. 


ఆప్టికల్ ఇల్యూషన్లు ఈనాటివి కావు. వీటికి వేల ఏళ్ల చరిత్ర ఉందని చెబుతారు. టీవీలు వంటి వినోదాలు లేని కాలంలో ఇవే అప్పటి ప్రజలకు అలరించాయిట. అయితే వీటి సృష్టి కర్త  ఎవరో మాత్రం ఇంతవరకు తెలియలేదు . చరిత్రకారులు తెలుసుకునే ప్రయత్నం చేసినా జవాబు దొరకలేదు. మెదడు చురుగ్గా పనిచేయడానికి ఇలాంటి ఆప్టికల్ ఇల్యూషన్లు మేలు చేస్తాయి. ఇలాంటివి మెదడుకు , కంటికి సమన్వయాన్ని పెంచుతాయి. అలాగే ఏకాగ్రతను పెంచుతుంది. అందుకే ఆప్టికల్ ఇల్యూషన్లు చాలా ప్రజాదరణ పొందుతున్నాయి. ఇప్పుడు ఆప్టికల్ ఇల్యూషన్లు క్రియేట్ చిత్రకారుల సంఖ్య పెరిగిపోయారు.  విదేశాల్లో చాలా మంది చిత్రకారులు ఇప్పుడు ఆప్టికల్ ఇల్యూషన్లు వేస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇప్పటికే చాలా ఇల్యూషన్లు వైరల్ గా మారాయి.  ఆప్టికల్ ఇల్యూషన్లను ఈ ఇన్ స్టా ఖాతాలో అధికంగా ఉంటాయి చూడండి.


Also read: ఆదియోగి ప్రపంచానికి ఇచ్చిన వరం యోగా, దీని వెనుక ఐదువేల ఏళ్ల చరిత్ర




Also read: లావుగా ఉన్న ఉద్యోగులు సరిగా పనిచేయలేరు, కంపెనీ ఖర్చులు పెంచుతారంటున్న కొత్త అధ్యయనం
















































































































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.