ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందిని వేధిస్తున్న సమస్య డయాబెటిస్. చిన్నవయసులో డయాబెటిస్ బారిన పడినవారు కూడా ఉన్నారు. వీరంతా మధుమేహాన్ని నియంత్రణలో ఉంచేందుకు ఎంతో కష్టపడుతున్నారు. వారందరికీ ఉత్తమమైన ఔషధంలా పనిచేస్తుంది మెంతి నీళ్లు. దీన్ని రోజూ ఉదయం లేచాక పరగడుపునే తాగితే వారంలోనే మధుమేహం దాదాపు నియంత్రణలోకి వస్తుంది. మెంతుల్లో ఫైబర్ తో పాటూ వివిధ రసాయనాలు కూడా ఉన్నాయి. ఈ ఫైబర్ శరీరం అధికంగా చక్కెర గ్రహించకుండా అడ్డుకుంటుంది. రక్తంలోని షుగర్ స్థాయిలను కూడా నియంత్రిస్తుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ను మేనేజ్ చేయడంలో సహాయపడతుంది. 


మెంతినీళ్లు ఇలా చేసుకోవాలి...
ఒక స్పూను మెంతులు ముందురోజు రాత్రి గ్లాసుడు నీళ్లలో నానబెట్టాలి. ఉదయం లేచాక ఆ నీటిని తాగేయాలి. కొంతమంది గింజలు తీసేసి తాగుతారు, అలా కాకుండా గింజలతో తాగితే మంచి ఫలితాలు ఉంటాయి. లేదా మెంతులను మరీ పొడిలా కాకుండా కాస్త కచ్చపచ్చాగా ముందే మిక్సీ చేసుకుని ఒక డబ్బాలో వేసుకోవాలి. ప్రతి రోజు రాత్రి ఒక స్పూను మెంతి పొడిని నానబెట్టుకుని, మరుసటి రోజు తాగేయాలి. 


ఇంకా ఎన్నో లాభాలు
1. రోజూ మెంతి నీళ్లు తాగడం అందం ఇనుమడిస్తుంది. చర్మం కాంతిమంతంగా మారుతుంది. మెంతి గింజల్లో విటమిన్ కె, ఎల్ ఆస్కార్బిక్ ఆమ్లం ఉంటాయి. ఇవి చర్మంలోని లోపాలను, నల్లటి వలయాలను తొలగిస్తాయి. మొలకెత్తిన మెంతిగింజలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. 


2. ఖాళీ పొట్టతో ప్రతి రోజూ మెంతి గింజల నీటిని తాగడం వల్ల మీ జీర్ణక్రియ చక్కగా పనిచేస్తుంది. ఇది బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. పొట్ట నిండిన ఫీలింగ్ పెంచి తక్కువ తినేలా చేస్తాయి. 


3. ఎసిడిటీ ఎవరికైనా వచ్చే సమస్యా. ఛాతీ, గొంతులో మంటను కలిగిస్తుంది. పరగడుపున మెంతి గింజల నీటిని తాగడం వల్ల పొట్ట చల్లగా మారుతుంది. ఎసిడిటీని తగ్గిస్తుంది. 


4. జీర్ణ వ్యవస్థకు, జీర్ణ క్రియకు ఎంతో మేలు చేస్తుంది. శరీరంలోని టాక్సిన్లను బయటికి పంపిస్తుంది. మల బద్ధకం, యాసిడ్ రిఫ్లక్స్ వంటి పొట్ట సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. 


గమనిక: పలు అధ్యయనాలు, ఆరోగ్యనిపుణులు చెప్పిన వివరాల ప్రకారం కథనాన్ని అందించాం. ఇది కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సందేహాలు ఏమున్నా వైద్యుడిని సంప్రదించగలరు. 


Also read: నెమలి ఈకలు ఇంట్లో ఉంటే అందమే కాదు, ఎంతో ఆరోగ్యం కూడా



Also read: కేవలం మూడు పదార్థాలతో పదినిమిషాల్లో చేసే లడ్డూ, రుచి అదిరిపోతుంది