నెమలి రంగులు ఎంత ఆకర్షణగా ఉంటాయో అందరికీ తెలిసిందే. అందానికి, నాట్యానికి ప్రసిద్ధి చెందినది నెమలి. ఒకప్పుడు నెమలి ఈక కనిపిస్తే చాలు పిల్లలందరూ పుస్తకాల్లో దాచుకునేవారు. నెమలికన్నులు చూడముచ్చటగా ఉంటాయి. చాలా మంది గుత్తులుగా ఇంట్లో గోడలకు పెట్టుకునేందుకు ఇష్టపడతారు. కొందరిలో మాత్రం ఇంట్లో నెమలికన్నులను ఉంచవచ్చా లేదా అనే సందేహం ఉంటుంది. అందమైన నెమలీకలను ఇంట్లో నిరభ్యంతరంగా పెట్టుకోవచ్చు. దీనివల్ల ఎన్నో లాభాలు కూడా కలుగుతాయి. అవేంటో తెలుసుకోండి. 


బల్లులు రావు
నెమలీకలు ఉన్నచోటకి బల్లులు రావు. గోడలపై నెమలీకల గుత్తిని తగిలిస్తే బల్లులు, ఇతర కీటకీలు మీ ఇల్లు వదిలి పారిపోతాయి. ఇంటి ప్రతి మూలలో నెమలీకలను ఉంచితే బల్లుల నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు. ఇలా ఇంటి పరిశుభ్రతను కాపాడుతుంది. 


అందం పెరుగుతుంది
నెమలి అంటేనే అందానికి ప్రతీక. ఇంట్లో నెమలీకలు గుత్తులు పెట్టగానే ఇల్లు ఆహ్లాదకరంగా మారుతుంది. నెమలి నృత్యం చేసే భంగిమలో నెమలి కన్నులను అమరిస్తే ఆ గదికి గొప్పగా, ఆడంబరంగా కనిపిస్తుంది. 


నెగిటివ్ వైబ్స్‌ను తొలగిస్తుంది
నెమలి ఈకలను మీ కార్యాలయంలో, ఇంట్లో పెట్టుకుంటే చాలా ప్రశాంతమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. ఆ ప్రదేశంలో ఉన్న నెగిటివ్ వైబ్స్‌ తొలగిపోతాయి. అలాగే నివాసస్థలంలోని వాస్తుదోషాలు కూడా పోతాయి. మానసిక ఒత్తిడి పోయి ప్రశాంతంగా అనిపిస్తుంది. 


సానుకూల శక్తి   
నెమలీకలను ఇంట్లోని ఆగ్నేయదిశలో ఉంచితే చాలా మంచిదని చెబుతారు. ఇలా ఉంచడం వల్ల సంపద, ఆనందం పెరుగుతాయని ఎంతో మంది నమ్మకం. గోడలపై నెమలి పెయింటింగ్ లు పెట్టుకున్నా మంచిదే. కుటుంబ సంబంధాలను బలపరచడంతో పాటూ, శాంతి వర్ధిల్లుతుంది. 


వినాయకునికి నెమలీక
ప్రతి ఇంట్లో వినాయక పటం లేదా విగ్రహం ఉండాలని చెబుతారు. గణేష్ విగ్రహం సానుకూల శక్తిని ఇంట్లోకి తీసుకొచ్చి, ప్రతికూల ప్రభావాలను రాకుండా అడ్డుకుంటుంది. వినాయక విగ్రహానికి నెమలీకను జతAlso చేయడం వల్ల అదనపు ప్రయోజనాలు కలుగుతాయి. వాస్తు దోషం కూడా పోతుంది. 


గృహ సంపద పెరుగుతుంది
ఇంట్లో సంపద పెరగాలంటే నెమలికన్నులను తెచ్చి మీరు డబ్బులు దాచే చోట పెట్టుకోవాలి. ఇది సంపదను పెంచడమే కాదు, ఆ సంపదకు స్థిరత్వాన్ని ఇస్తుందని పెద్దల నమ్మకం. 


గాయాలను నయం చేస్తుంది
గాయాలను సమర్థవంతంగా నయం చేయడంలో నెమలీకలు ముందుంటాయి. గాయాల మీద కట్టులా కడితే మంచి ఫలితం ఉంటుంది. శరీరం నుంచి విషాన్ని తొలగించగల శక్తి కూడా దీనికి ఉంది. 


Also read: అమ్మవారుని అడ్డుకునే శక్తి దానికే ఉంది, వేసవిలో కచ్చితంగా తినాల్సిందే


Also read: కేవలం మూడు పదార్థాలతో పదినిమిషాల్లో చేసే లడ్డూ, రుచి అదిరిపోతుంది