వేసవి మండిపోతోంది. ఉష్ణోగ్రత్తలు పెరుగుతున్నకొద్దీ సీజనల్ వ్యాధులు కూడా దాడిచేసేందుకు సిద్ధమవుతుంటాయి. వాటిల్లో చికెన్ పాక్స్ కూడా ఒకటి. దీన్నే తెలుగు రాష్ట్రాల్లో అమ్మవారు అని పిలుస్తారు. దగ్గు, జ్వరం,వికారం, జలుబుతో పాటూ శరీరంపై ఎర్రటి దద్దుర్లుతో నిండిపోతాయి. ఇది వరిసెల్లా జోస్టర్ అనే వైరస్ వల్ల కలుగుతుంది. ఇది అయిదారు రోజుల పాటూ బాగా వేధిస్తుంది. చిన్నపిల్లల్లో కూడా వస్తుంది. జాగ్రత్తలు పాటించడం, పరిశుభ్రంగా ఉండడం ద్వారా చికెన్ పాక్స్ రాకుండా అడ్డుకోవచ్చు. దీని నుంచి ములక్కాడలు రక్షణనిస్తాయని పూర్వం నుంచి ప్రజల్లో నమ్మకం ఉంది. 


ఎలా రక్షణనిస్తుంది?
ములక్కాడను చాలా ప్రాంతాల్లో మోరింగా అని పిలుస్తారు. ఇది రక్తప్రసరణను మెరుగుపరిచే యాంటీబయోటిక్ ఏజెంట్లను కలిగి ఉంటుంది. ఇది రక్తంలో ఆక్సిజన్ స్థాయిలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అలాగే దీనిలో యాంటీ బాక్టిరియల్, యాంటీ వైరల్ లక్షణాలు కూడా ఉంటాయి. దీన్ని తరచూ తినడం వల్ల శరీరానికి అంటువ్యాధులు సోకకుండా రక్షణగా నిలుస్తుంది. ఇందులో ఫైబర్ పేగు కదలికను పెంచుతుంది. ములక్కాడలో నియాసిన్, రిబోఫ్లావిన్, విటమిన్ బి12, ఇతర బి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ చికెన్ పాక్స్ వంటి అంటు వ్యాధులను శరీరానికి సోకనివ్వవు. 


ప్రధాని ఇష్టంగా తినే కూరగాయ
2020లో జరిగిన ‘ఫిట్ ఇండియా’ ఉద్యమం మొదటి వార్షికోత్సవం సందర్భంగా పోషకాహార నిపుణురాలు మోడీకి ములక్కాడ ఎంతిష్టమో వివరించారు. వారానికి రెండు సార్లు కచ్చితంగా మోడి ములక్కాడ వంటకాలను తింటారని తెలిపారు. ములక్కాడతో చేసే పరాఠా అంటే చాలా ఇష్టమట మోడీకి. 


ములక్కాడలోని సుగుణాలు రక్తపోటును నియంత్రించడంతో, గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. కాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉన్న మునక్కాయలు ఎముకల ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి. డయాబెటిస్ రోగులకు ఈ కూర చాలా మేలు చేస్తుంది. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిని సరైన స్థాయిలో ఉంచుతుంది. మహిళలకు, పిల్లలకు మునక్కాయ లేదా మునగాకుల రెసిపీలు రక్తహీనత సమస్య నుంచి బయటపడేస్తాయి. మతిమరుపు వ్యాధి రాకుండా అడ్డుకుంటుంది. 


ఆయుర్దేదంలో మునగాకుకు చాలా విలువైన స్థానం ఉంది. 300 పైగా వ్యాధులను నయం చేసేందుకు దీన్ని వాడతారు. క్యారెట్లు తింటే వచ్చే విటమిన్ ఎ కన్నా మునగాకు పొడి తినడం వల్ల అందే విటమిన్ ఎ పదిరెట్లు అధికం. కళ్లకు కూడా మునగాకు పొడి చాలా మేలు చేస్తుంది. రోజూ భోజనానికి ముందు రెండు ముద్దలు మునగాకుపొడితో తింటే చాలా మంచిది.


Also read: కోడిగుడ్లను నీళ్లతో శుభ్రం చేస్తున్నారా? అలా చేస్తే ఎంత హానికరమో తెలుసా?


Also read: ఇలా మామిడికాయ పొడి చేసుకుంటే, చింతపండు అవసరం ఉండదు, మధుమేహులకు ఎంతో మేలు