ఉపవాసం అంటే పొట్టను క్లీన్ చేసే పద్దతి అని చెప్పుకోవాలి. నెలలో ఒక్కరోజైనా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏమీ తినకుండా కేవలం నీళ్లు తాగుతూ ఉండడం వల్ల పొట్ట డిటాక్ష్ అయిపోతుందని చెబుతారు. కేవలం నీళ్లతో మాత్రమే ఉండలేని వారు పండ్లు లాంటివి తిన్నా ఫర్వాలేదు. ఇక నోములు, వ్రతాలు, పూజలు చేసే భక్తులు ఎంతో మంది ఉపవాసం ఉంటుంటారు. సాధారణ్య వక్తులు ఉపవాసం చేయగలరు. మరి డయాబెటిస్ తో బాధపడుతున్న వారి పరిస్థితి ఏమిటి? వారు ఉపవాసం ఉండొచ్చా? ఉపవాసం ఉండడం వల్ల శరీరంలో ఎలాంటి మార్పులు కలుగుతాయి?
డయాబెటిస్ వారికి...
మధుమేహం వచ్చిందా తినే ఆహారం దగ్గర నుంచి, ఆ ఆహారం తినే సమయాల విషయం వరకు చాలా జాగ్రత్తలు పాటించాలి. వారు ఎంత సక్రమంగా తింటున్నా కూడా శరీరం వారు తిన్నా ఆహారాన్ని పూర్తి వినియోగించుకునే పరిస్థితిలో ఉండదు. మధుమేహం ఉన్న వారిలో కొవ్వు పదార్థాల నుంచే శరీరం శక్తిని సమకూర్చుకుంటుంది. మధుమేహం ఉన్న వారు ఖాళీ పొట్టతో ఎక్కువ సమయం ఉండకూడదని చెబుతారు వైద్యులు. 3 గంటల కంటే ఎక్కువ సమయం ఏమీ తినకుండా ఉంటే వారిలో మార్పులు మొదలవుతాయి. అదే ఆరు గంటల పాటూ ఏమీ తినకూండా ఉంటే శరీరంలో కొవ్వును కరిగించుకుని శక్తిగా మార్చుకోవడం ప్రారంభిస్తుంది. ఈ సమయంలో ఎసిటాల్డిహైడ్, బీటా హైడ్రాక్సి బ్యుటిరేట్, ఎసిటోన్ ఆమ్ల పదార్థాలు అధికంగా విడుదలవుతాయి. ఇవి శరీరంలో అధికంగా పెరిగితే గుండె, ఊపిరితిత్తుల పనితీరు దెబ్బతింటుంది.
ఇలా దీర్ఘకాలం పాలూ ఎక్కువ గంటలు తినకుండా ఉంటే గుండె, ఊపిరితిత్తుల సమస్యలు వస్తాయి. అంతెందుకు సాధారణ వ్యక్తులకు ఏదైనా సర్జరీ చేయాల్సి వస్తే గంటల పాటూ ఏ ఆహారాన్ని పెట్టరు. కానీ డయాబెటిస్ రోగులకు సర్జరీ చేయాల్సి వస్తే మాత్రం ఓ పక్క ఇన్సులిన్ ఇంజెక్షన్లు ఇస్తూ, మరో పక్క గ్లూకోజు ఎక్కిస్తూ ఉంటారు. అందుకే మధుమేహులు ఎక్కువ గంటల పాటూ తినకుండా ఉండకూడదు.
ఉపవాసం?
వైద్యుల సలహా మేరకు ఉపవాసం జోలికి డయాబెటిస్ రోగులు వెళ్లకపోవడమే ఉత్తమం. ఉపవాసం చేయడం వల్ల వారికి సమస్య పెరిగిపోతుంది. కానీ మధుమేహం లేని వారిలో మాత్రం ఉపవాసం చేయడం వల్ల ఈ సమస్య రాకుండా ఉండేందుకు దోహదపడుతుంది. కాబట్టి నోములు, వ్రతాల రోజు దేవుడిని మనస్పూర్తిగా స్మరించుకుని ప్రసాదాన్ని స్వీకరించండి. ఉపవాసాల జోలికి పోకండి.
Also read: ఈ బ్లడ్ గ్రూపు వారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువట
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.