IND VS ZIM: మైదానంలో గెలుపు.. డ్రెస్సింగ్ రూములో డాన్స్

జింబాబ్వేపై మూడో వన్డే మ్యాచ్ విజయాన్ని భారత ఆటగాళ్లు బాగా ఆస్వాదించారు. డ్రెస్సింగ్ రూములో డాన్స్ చేస్తూ సంబరాలు చేసుకున్నారు. 

Continues below advertisement

 జింబాబ్వేతో మూడో వన్డేతో పాటు సిరీస్ గెలిచిన ఆనందంలో టీమిండియా జట్టు డాన్స్ చేస్తూ సంబరాలు చేసుకుంది. భారత డ్రెస్సింగ్ రూములో ధావన్, ఇషాన్ కిషన్, శుభ్ మన్ గిల్, అవేశ్ ఖాన్ తదితర ఆటగాళ్లు పంజాబీ పాటలకు నృత్యం చేస్తూ విజయాన్ని ఆస్వాదించారు. 

Continues below advertisement

జింబాబ్వేతో జరిగిన మూడో వన్డేలోనూ విజయం సాధించి 3-0 తో సిరీస్ క్లీన్ స్వీప్ చేసింది టీమిండియా. చివరివరకు ఉత్కంఠ రేపిన ఆఖరి వన్డేలో భారత్ 13 పరుగుల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ శతకం చేయగా, వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ ఇషాన్ కిషన్ అర్ధశతకంతో రాణించాడు. 

జింబాబ్వేతో జరిగిన మూడో వన్డేలోనూ విజయం సాధించి 3-0 తో సిరీస్ క్లీన్ స్వీప్ చేసింది టీమిండియా. చివరివరకు ఉత్కంఠ రేపిన ఆఖరి వన్డేలో భారత్ 13 పరుగుల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ శతకం చేయగా, వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ ఇషాన్ కిషన్ అర్ధశతకంతో రాణించాడు. ఈ వన్డేలో విజయం ద్వారా భారత్ అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకుంది. ఓ ప్రత్యర్థి జట్టుపై భారత్ అత్యధిక విజయాలు సాధించింది. నేటి వన్డే విజయం జింబాబ్వేపై వరుసగా 15వ గెలుపు. చివరగా 2010లో భారత్ ఓటమి.. జింబాబ్వేపై జరిగిన వరుస 15వ వన్డే విజయాన్ని భారత్ ఆస్వాదిస్తోంది. రెండో వన్డేలో గెలుపుతో ఆ జట్టుపై భారత్ వరుస విజయాల సంఖ్య 14కు చేరగా.. నేడు చివరిదైన మూడో వన్డేలోనూ టీమిండియా అదరగొట్టింది. భారత్ చివరగా 10 జూన్ 2010లో జింబాబ్వే చేతిలో ఓటమిపాలైంది. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా 23 వన్డేలాడిన భారత్ 18 మ్యాచ్‌లలో విజయకేతనం ఎగురవేసింది. ఈ వేదికగా అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా భారత్ నిలిచింది.

వన్డేల్లో టీమిండియా వరుస విజయాలు..
ప్రత్యర్థి  -  వరుస విజయాలు  - కాలం
జింబాబ్వే 15  2010 నుంచి నేటి వరకు
బంగ్లాదేశ్ 12  1988 నుంచి 2004 వరకు
న్యూజిలాండ్  11  1986 నుంచి 1988 వరకు
జింబాబ్వే      10  2002 నుంచి 2005 వరకు
జింబాబ్వే       9  1983 నుంచి 1993 వరకు

13 పరుగుల తేడాతో భారత్ విజయం..  
భారత్ మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేసింది. ఇన్నింగ్స్ ను ఓపెనర్లు కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్ ప్రారంభించారు. వీరిద్దరూ తొలి వికెట్ కు 63 పరుగులు జోడించారు. 15వ ఓవర్లో బ్రాడ్ ఇవాన్స్ బౌలింగ్ లో రాహుల్ క్లీన్ బౌల్డయ్యాడు. ఆ తర్వాత శిఖర్ కు గిల్ జతకలిశాడు. ఇన్నింగ్స్ 21వ ఓవర్లో 84 పరుగుల వద్ద ధావన్ ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్ తో కలిసి గిల్ స్కోరు బోర్డును నడిపించాడు. 35వ ఓవర్లో గిల్ తన అర్ధశతకాన్నిపూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత వీరిద్దరూ శతక భాగస్వామ్యం నమోదు చేశారు. మరోవైపు కిషన్ 42వ ఓవర్లో సింగిల్ తో హాఫ్ సెంచరీని అందుకున్నాడు. వెంటనే రనౌట్ గా వెనుదిరిగాడు. గిల్ సమయోచితంగా ఆడుతూ 44వ ఓవర్లో తన తొలి వన్డే సెంచరీని సాధించాడు. దీంతో తొలి ఇన్నింగ్స్ ముగిసేసరికి  భారత్ 8 వికెట్ల నష్టానికి 289 పరుగులు సాధించింది. 290 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే సికిందర్ రజా శతకంతో పోరాడినా ఓటమి తప్పలేదు. చివరి వరకు ఉత్కంఠభరితంగా జరిగిన మూడో వన్డేలో జింబాబ్వే 49.3 ఓవర్లలో 276 పరుగులకు ఆలౌటైంది. గిల్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు దక్కాయి.

Continues below advertisement
Sponsored Links by Taboola