Rohit sharma BCCI central contract: భారత క్రికెట్ జట్టులోని ఇద్దరు దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇటీవల టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. టీమిండియా కెప్టెన్లుగా సేవలు అందించిన ఈ స్టార్ బ్యాట్స్‌మెన్ గత ఏడాది టీ20 వరల్డ్ కప్ నెగ్గిన తరువాత టీ20 ఇంటర్నేషనల్ నుంచి తప్పుకున్నారు. అంటే వారు టీ20, టెస్టుల్లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించరు. కేవలం వన్డేల్లో మాత్రమే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఆడతారు. దాంతో వారిద్దరికి బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ కేటగిరీ మారుతుందా? అనే చర్చ జరుగుతోంది. 

ఇటీవల బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాను విడుదల చేసింది. అందులో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మను A+ కేటగిరీలో ఉన్నారు. ఇప్పుడు వారు టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. కేవలం వన్డేల్లో మాత్రమే అడతారు. అలాంటప్పుడు బీసీసీఐ వారిద్దరి జీతాలను తగ్గిస్తుందా లేదా అని వారి అభిమానులు ఆలోచిస్తున్నారు.

బీసీసీఐ నుండి వచ్చిన అప్‌డేట్

బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా విరాట్ కోహ్లీ, రోహిత్ సెంట్రల్ కాంట్రాక్ట్ కేటగిరీపై పెద్ద అప్‌డేట్ ఇచ్చారు. బీసీసీఐ కార్యదర్శి మాట్లాడుతూ.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌లోని A+ కేటగిరీలోనే ఉంటారని చెప్పారు. ఇప్పుడు వారి జీతాలలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టమవుతోంది. వారిద్దరికీ బీసీసీఐ ఏడాదికి ఏడు కోట్ల రూపాయలు ఇస్తుంది. తరువాత కాంట్రాక్ట్ ఇచ్చే సమయంలో వారి కాంట్రాక్ట్ మారే అవకాశం ఉంది.

సెంట్రల్ కాంట్రాక్ట్‌లో చేర్చడానికి రూల్స్ ఏమిటీ..

 కనీసం 3 టెస్ట్‌లు, 8 వన్డేలు లేదా 10 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఒక సంవత్సరంలో ఆడిన ఆటగాళ్లను బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌ జాబితాలో చేర్చుతుంది. ఒక ఆటగాడు టెస్ట్ ఆడకపోయినా, వన్డే, టీ20 ఆడితే, అతన్ని సెంట్రల్ కాంట్రాక్ట్‌లో చేర్చుతారు.

ఈసారి సెంట్రల్ కాంట్రాక్ట్‌లో ఎవరికీ ఏ కేటగరి ఇచ్చారు..

A+ కేటగిరీ- రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా

A కేటగిరీ- కెఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, మహ్మద్ సిరాజ్, హార్దిక్ పాండ్యా, మహ్మద్ షమీ, రిషభ్ పంత్

B కేటగిరీ- కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, సూర్యకుమార్ యాదవ్, యశస్వి జైస్వాల్, శ్రేయాస్ అయ్యర్

C కేటగిరీ- రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబే, రింకు సింగ్, తిలక్ వర్మ,రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, ముకేష్ కుమార్, నితీష్ కుమార్ రెడ్డి, సంజూ శాంసన్, ప్రసిద్ధ కృష్ణ, రజత్ పాటిదార్, అభిషేక్ శర్మ, ఆకాశ్ దీప్, ధ్రువ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్, అర్షదీప్ సింగ్, ఇషాన్ కిషన్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా.