Health Risks with Extreme Heat : ఈ ఏడాది ఎండలు ఎక్కువగానే ఉన్నాయి. ఫిబ్రవరి నుంచే ఈ తీవ్రత రెగ్యూలర్​ ఎండలు కంటే ఎక్కువగానే ఉంటుంది. మే మొదటివారంలో వర్షాల వల్ల కాస్త ఈ ఎండ నుంచి ఉపశమనం వచ్చినా.. ఇప్పుడు మాత్రం ఈ ఎండలు ఠారేత్తిస్తున్నాయి. బయటకి వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. నలభై కిందికి ఉష్ణోగ్రతలు ఉండట్లేదు. కొన్ని ప్రాంతాల్లో 50 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆరోగ్య శాఖ అధికారులు కూడా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ తరహా ఎండ శరీరానికి మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే..


తీవ్రమైన ఆరోగ్య సమస్యలు


ఉష్ణోగ్రతల్లో మార్పులు శరీరంలోపై గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తాయి. ముఖ్యంగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఆరోగ్యంపై దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతమున్న ఆరోగ్య సమస్యలను కూడా ఇవి ఎక్కువ చేస్తాయి. తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ నేపథ్యంలోనే అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. లేదంటే హీట్​ స్ట్రోక్ వంటి ప్రాణాంతక పరిస్థితులు వస్తాయని.. లేదంటే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయని చెప్తున్నారు. 


తక్కువ అంచనా వేయకండి..


అధిక ఉష్ణోగ్రతలు, యూవీ కిరణాలు, హ్యుమిడిటీ, గాలి తగ్గిపోవడం వంటివి.. బాడీ టెంపరేచర్​పై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. కాబట్టి ఈ ఎండలను ఎట్టి పరిస్థితుల్లోనూ తక్కువ అంచనా వేయకూడదని చెప్తోంది. ఇవి జీవక్రియపై ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. దీనివల్ల అలసట, వేడి, హీట్ స్ట్రోక్​ల ప్రమాదం పెరుగుతుంది. అంతేకాకుండా ఈ ఎండ మెదడుపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుందని దానివల్ల శరీరంలోని ఇతర ముఖ్యమైన అవయవాలు నష్టానికి గురవుతాయని పేర్కొంది. 


మధుమేహం వంటి సమస్యలుంటే.. మరింత డేంజర్


గుండె జబ్బులు, శ్వాసకోశ సమస్యలు, మధుమేహం వంటి దీర్ఘకాలిక సమస్యలున్నవారు ఎటువంటి పరిస్థితుల్లో ఈ ఎండల్లో తిరగకూడదని చెప్తున్నారు. ఇవి శరీరాన్ని అతలాకుతలం చేసి.. సమస్యలను రెట్టింపు చేస్తాయని చెప్తున్నారు. గుండె, కిడ్నీలపై ఒత్తిడి పెరిగి.. త్వరగా డీహైడ్రేషన్​కు గురి అవుతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ వేడి మరణానికి దారితీస్తుందని.. కొన్ని సందర్భాల్లో కిడ్నీ ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినే అవకాశముందని చెప్తున్నారు. కాబట్టి అలెర్ట్​గా ఉండాలంటున్నారు. 


ఆ సమయంలో అస్సలు బయటకు వెళ్లకండి..


ఈ హీట్​వేవ్​ల నుంచి మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలనేదానిపై WHO తన మార్గదర్శకాలు జారీ చేసింది. డే టైమ్​లో బయటకు వెళ్లొద్దని.. ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో అసలు బయటకు వెళ్లొద్దని సూచిస్తోంది. ఇంట్లో ఉన్నప్పుడు వేడి లోపలికి రాకుండా తలుపులు, విండోస్ క్లోజ్ చేసుకుంటే మంచిదని తెలిపింది. సాయంత్రం వేళల్లో మాత్రమే డోర్స్ ఓపెన్ చేయాలని చెప్తోంది. కిటికీలు మూయడానికి వీలు లేని సమయంలో బ్లైండ్​లు, కర్టెన్లు వేసుకుంటే హీట్ లోపలికి రాదని తెలిపింది. 


ఆ వస్తువుల వినియోగం తగ్గిస్తే మంచిది..


వేడిని తగ్గించుకోవడానికి ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల వినియోగాన్ని ఆపాలని.. ఎందుకంటే ఇవి శరీరంలో వేడిని పెంచుతాయని ఆసక్తికరమైన విషయాన్ని తెలిపింది. 40 డిగ్రీలు కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్నప్పుడు ఫ్యాన్స్ వేసుకోవాలని తెలిపింది. ఏసీని 27 డిగ్రీలు మాత్రమే పెట్టుకోవాలని.. అంతకంటే తక్కువ పెట్టుకుని.. పొరపాటున బయటకు వెళ్తే.. శరీరం ఈ టెంపరేచర్స్​ని అడ్జెస్ట్ చేసుకోలేదు అని తెలిపింది. దానివల్ల ఆరోగ్య సమస్యలు తీవ్రమవుతాయని వెల్లడించింది. పైగా ఇలా ఎలక్ట్రానిక్స్ వినియోగం తగ్గిస్తే ఖర్చులపై 70 శాతం ఆదా అవుతుంది. 



ఒకవేళ బయటకు వెళ్లాల్సి వస్తే..


తెల్లని, తేలికపాటి దుస్తులు ధరించాలి. రోజూ రెండు పూటల చల్లటి నీటితో స్నానం చేయాలి. రెండు నుంచి మూడు లీటర్ల నీటిని తాగాలి. దీనివల్ల శరీరంలో చల్లగా, హైడ్రేటెడ్​గా ఉంటుంది. అధిక వేడి ఉండదు. ఎండలోకి వెళ్లాల్సి వస్తే తలను కచ్చితంగా కవర్ చేయాలి. కళ్లకు షేడ్స్ పెట్టుకోవాలి. స్క్రార్ఫ్ ఉపయోగించాలి. లైట్ కలర్ డ్రెస్​లు వేసుకోవాలి. నీటిని తీసుకెళ్తూ ఉండాలి. ఇది మీరు డీహైడ్రేట్ కాకుండా చేస్తుంది. అంతేకాకుండా వేయించిన ఫుడ్స్​కి దూరంగా ఉండాలి. ఇవన్నీ మీపై ఎండ తీవ్రత లేకుండా చేస్తాయని అధికారులు చెప్తున్నారు.


 Also Read : సమ్మర్​లో పుచ్చకాయను ఇలా తీసుకుంటే.. హెల్త్​కి, బ్యూటీకి ఎన్నో బెనిఫిట్స్