చికెన్ కబాబ్స్, మటన్ కబాబ్స్ మనకు తెలిసినవే. వీటిని అందరూ తినే ఉంటారు. కానీ కోడీ గుడ్లతో కబాబ్ చేసుకుంటే ఆ రుచే వారు. వీటిని తయారుచేయడం కూడా చాలా సులభం. కోడి గుడ్లు ఆరోగ్యానికి కూడా చాలా మంచివి. పైగా బోలెడంత శక్తినిస్తాయి. త్వరగా ఆకలేయకుండా చూస్తాయి. అందులోనూ గుడ్డును సంపూర్ణ ఆహారంగా పిలుస్తారు. అలాంటప్పుడు ఎగ్ కబాబ్స్ చేసుకుని తింటే స్నాక్స్ తిన్నట్టు ఉంటుంది, అలాగే పోషకాలు కూడా లభిస్తాయి. 

కావాల్సిన పదార్ధాలుఉడకబెట్టిన కోడిగుడ్లు - నాలుగుశెనగపిండి - వంద గ్రాములుగరం మసాలా - ఒక టీస్పూనుమిరియాల పొడి - అరటీస్పూనుఉల్లితరుగు - పావు కప్పుకొత్తి మీర తరుగు - ఒక టీస్పూనుకారం - ఒక టీస్పూనునూనె - వేయించడానికి సరిపడినంతనీళ్లు - పిండి కలపడానికి సరిపడినన్నిఉప్పు - రుచికి తగినంతబ్రెడ్ పొడి - పావు కప్పు

తయారీ ఇలా...కోడిగుడ్లను సన్నగా తరిగాలి. పచ్చసొనను పడేయాల్సిన అవసరం లేదు. వాటిని కూడా చిదిమేయాలి. ఇప్పుడు అందులో శెనగపిండి, గరం మసాలా, మిరియాల పొడి, ఉల్లితరుగు, కారం, ఉప్పు వేసి బాగా కలపాలి. అవసరమైతే కాస్త నీళ్లు కలుపుకోవచ్చు. గారెలు వేయడానికి ఎంత గట్టిగా రుబ్బుకుంటామో అదే జారుడుతనం ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి డీప్ ఫ్రైకు కావాల్సినంత నూనెను వేసి మరిగించాలి. ఇప్పుడు గుడ్డు మిశ్రమాన్ని కబాబ్స్ లో చేతితో అద్దుకుని ఓ సారి బ్రెడ్ పొడిలో ఇటూ అటూ తిప్పాలి. వాటిని నూనెలో వేయించాలి.  అవి వేగాక తీసి నూనె పీల్చే కాగితంపై వేయాలి. అంతే టేస్టీ ఎగ్ కబాబ్స్ రెడీ. 

Read Also: పిల్లలకు పెట్టేందుకు సింపుల్ స్నాక్స్... అన్నీ ఆరోగ్యకరమైనవే

Read Also: ఉల్లి, అన్నం, బ్రెడ్, మొక్కజొన్న... ఇలాంటివి మాడినా కూడా తింటున్నారా? క్యాన్సర్ రావచ్చు జాగ్రత్తRead Also: వీడెవడండీ బాబు... రిపేరుకు ఖర్చువుతుందని టెస్లా కారునే డైనమైట్లతో పీస్ పీస్ చేసేశాడు, వీడియో చూడండిRead Also: ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే మీ కిడ్నీలు సరిగా పనిచేయడం లేదనే అర్థంRead Also: నెలసరి సమయంలో వీటికి దూరంగా ఉండాలి... లేకుంటే నొప్పులు ఎక్కువవుతాయిRead Also: బీరు తాగితే నిజంగానే బొజ్జ పెరుగుతుందా? పెరగకుండా తాగడం ఎలా?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి