ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ యూజర్ల కోసం కొత్త నెలవారీ మెుబైల్ ప్లాన్ తో ముందుకొచ్చింది. దీనిప్రకారం.. రూ.49 సబ్ స్క్రిప్షన్ తో ఓ ప్లాన్ అందుబాటులో ఉంది. అయితే కేవలం ఎంపిక చేసిన యూజర్స్ కు మాత్రమే వర్తించనున్నట్టు తెలుస్తోంది. స్మార్ట్ ఫోన్, ట్యాబ్స్ లో సేవలను పొందొచ్చు. 720 హెచ్‌డీ వీడియో రిజల్యూషన్‌తో స్టీరియో ఆడియో క్వాలిటీతో వీక్షించొచ్చు. యాడ్స్ కూడా వస్తాయి. అయితే ఈ ప్లాన్ గురించి.. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మాత్రం.. ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రముఖ సామాజిక మాధ్యమం రెడిట్ లో ఈ ప్లాన్ గురించి యూజర్స్ స్క్రీన్ షాట్స్ పెట్టారు. అయితే వినియోగదారులు మాత్రం.. ఒకసారి ఒకే డివైస్ లో లాగిగ్ చేయోచ్చు. డిస్నీ+ హాట్‌స్టార్ తన కస్టమర్ సపోర్ట్‌లో ఎంపిక చేసిన ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం మాత్రమే ఈ ప్లాన్ ను పరీక్షిస్తుంది.
రూ.99 సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌నే కార్డ్, ఫోన్‌పే, పేటీఎం, యూపీఐ ద్వారా చెల్లింపులు చేసినట్టైతే.. ఆండ్రాయిడ్ యూజర్స్‌కు రూ.49కే అందజేస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు.. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ 6 నెలల సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌పై రూ.100 తగ్గింపు చేయనుంది. అంటే మీరు తీసుకునే.. రూ.299 ప్లాన్.. 6 నెలలకు సబ్ స్త్ర్కైబ్ చేస్తే.. రూ.199కి వస్తుందన్న మాట. ఈ ఏడాది సెప్టెంబరులో సబ్‌స్క్రిప్షన్ ధరలలో మార్పులు చేసిన విషయం తెలిసిందే. దీనిప్రకారం.. రూ. 399 వీఐపీ ప్లాన్‌తో యూజర్స్ అన్ని రకాల కంటెంట్‌ను చూసే అవకాశం ఉంది.
కొత్తగా రూ. 499 మొబైల్, రూ. 899 సూపర్, రూ. 1,499 ప్రీమియం పేరుతో మూడు వార్షిక ప్లాన్స్ కూడా తీసుకొచ్చింది. అయితే ఇందులో ప్రీమియం సబ్ స్క్రైబర్స్ కూడా ఓ ఛాన్స్ ఉంది. ఒకేసారి నాలుగు డివైజ్‌లలలో 4K క్వాలిటీ వీడియోలను చూసే అవకాశం ఉంది. సూపర్ ప్లాన్‌లో యూజర్స్ ఒకేసారి రెండు డివైజ్‌లలో హెచ్‌డీ క్వాలిటీ వీడియోలను వీక్షించవచ్చు. మొబైల్ ప్లాన్ సబ్‌స్క్రైబర్స్ కేవలం ఒక మొబైల్‌లో మాత్రమే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ కంటెంట్ ను చూడొచ్చు.
Also Read: Actress Parvathy: అసభ్యకర సందేశాలు.. ఇంటికి వచ్చి మరీ వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన హీరోయిన్..
Also Read: Shanmukh: కప్పు గెలుస్తాననే అనుకున్నా.. కానీ సిరితో సీన్ జరగడంతో.. షణ్ముఖ్ వ్యాఖ్యలు..
Also Read: Pushpa: 'పుష్ప' సినిమా రేటింగ్స్.. విమర్శలపై 'అర్జున్ రెడ్డి' డైరెక్టర్ కామెంట్స్..