పిల్లలకు స్కూళ్లు తెరిచాక వారికి స్నాక్స్ ఏం పెట్టాలన్నది పెద్ద తలనొప్పిగా మారిపోయింది తల్లులకి. రోజూ ఒకేలాంటివి పెట్టినా ఊరుకోరు పిల్లలు. స్వీట్లు, ఆయిలీ ఫుడ్స్ పెడితే అనారోగ్యకరం. కాబట్టి వారికి శక్తిని, ఆరోగ్యాన్ని ఇచ్చేవి తయారు చేసి పెట్టాలి. కరోనా వేళ బయట ఆహారాన్ని ఎక్కువ తినిపించడం కూడా మంచిది కాదు. కాబట్టి ఇంట్లోనే ఏదో ఒకటి తయారుచేయాలి. అందుకు కొన్ని స్నాక్స్ రెసిపీలు ఇవిగో...
1. ఎగ్ - బ్రెడ్ ఫ్రై
గుడ్డును పగులగొట్టి కాస్త ఉప్పు, పసుపు, కారం వేసి బాగా గిలకొట్టాలి. బ్రెడ్ స్లైస్‌లపై ఆ మిశ్రమాన్ని పోసి పెనంపై ఇటూ అటూ కాల్చాలి. కావాలనుకుంటే గిలక్కొట్టిన గుడ్డులో కొత్తిమీర తరుగు కూడా వేసుకోవచ్చు. రుచి బావుంటుంది.
2. చిక్కీలు
బెల్లంలో నువ్వులు లేదా వేరుశెనగ పలుకులు వేసి చేసే చిక్కీల వల్ల పిల్లలకు ఐరన్ లభిస్తుంది. కాబట్టి అప్పుడప్పుడు వీటిని బాక్సుల్లో పెట్టొచ్చు.
3. ఆమ్లెట్
గుడ్డుసొనలో ఉల్లితరుగు, టమాటా తరుగు, కొత్తిమీర తరుగు, పసుపు, కారం,ఉప్పు వేసి ఆమ్లెట్‌ను మందంగా వేయాలి. దాన్ని ముక్కలుగా కోయాలి. పలుచగా వేస్తే అట్టులా చేత్తో తినాల్సి వస్తుంది. అదే మందంగా వేస్తే ఆ ముక్కలను ఫోర్క్‌తో పిల్లలు స్కూల్లో ఈజీగా తినగలరు.
4. సాండ్ విచ్
నెయ్యిరాసి కాల్చిన బ్రెడ్ ముక్కల మధ్యలో కాస్త చీజ్, ఉల్లిపాయల ముక్కలు, టమాటా ముక్కలు, మొక్కజొన్న గింజలు వేసి సాండ్‌విచ్ లా పెట్టినా మంచిదే.
5. కొమ్ము శెనగల ఫ్రై
కొమ్ము శెనగలను రాత్రంతా నానబెట్టి, ఉదయాన కాసేపు ఉడికించి, పోపు వేసి బాక్సుల్లో పెడితే, పిల్లల శరీరానికి అవసరమైన ఇనుము అందుతుంది.
6. ఫ్రూట్ సలాడ్
ఒకేపండు పెడితే పిల్లలకు బోరింగ్‌గా అనిపించవచ్చు. అరటి, ఆపిల్, జామ, పైనాపిల్... ఇలా మూడు నాలుగు రకాల పండ్ల ముక్కలు కలిపి పెడితే వారికి ఆసక్తిగా ఉంటుంది.
8. మొక్కజొన్నగింజలు - కారం
ఉడకబెట్టిన మొక్కజొన్న గింజల్లో కాస్త ఉప్పు, కారం కలిపి పెడితే మంచిదే. మొక్కజొన్న గింజలు శరీరాన్ని బలోపేతం చేస్తాయి.
9. బాయిల్డ్ ఎగ్
ఉడకబెట్టిన గుడ్లను ముక్కలు చేసి పైన కొంచెం మిరియాల పొడి చల్లాలి. చలికాలంలో చాలా ఆరోగ్యకరమైన స్నాక్స్ ఇది.
11. బఠానీ ఫ్రై
కొమ్ముశెనగల్లాగే బఠానీలతో కూడా చేయచ్చు. ఎండు బఠానీలను ఉడకబెట్టి పోపు వేయాలి. పిల్లలకు రుచి బాగా నచ్చుతుంది.
12. ఎగ్ రోల్స్
గుడ్డుతో ఉక్కిరి (కీమా) చేసి పలుచటి చపాతీలో రోల్‌లా చుట్టి పెట్టండి. ఇలాగే వెజిటేరియన్ రోల్స్ కూడా చేయవచ్చు.
గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.
Read Also: ఉల్లి, అన్నం, బ్రెడ్, మొక్కజొన్న... ఇలాంటివి మాడినా కూడా తింటున్నారా? క్యాన్సర్ రావచ్చు జాగ్రత్త
Read Also: వీడెవడండీ బాబు... రిపేరుకు ఖర్చువుతుందని టెస్లా కారునే డైనమైట్లతో పీస్ పీస్ చేసేశాడు, వీడియో చూడండి
Read Also: ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే మీ కిడ్నీలు సరిగా పనిచేయడం లేదనే అర్థం
Read Also: నెలసరి సమయంలో వీటికి దూరంగా ఉండాలి... లేకుంటే నొప్పులు ఎక్కువవుతాయి
Read Also: బీరు తాగితే నిజంగానే బొజ్జ పెరుగుతుందా? పెరగకుండా తాగడం ఎలా?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి