కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయం మెల్లగా దేశం మొత్తం కమ్మేస్తోంది. కొత్తగా ప్రభుత్వాలు ఆంక్షలు దిశగా వెళ్తున్నాయి. ఒమిక్రాన్ కారణంగా దేశంలోనే తొలిసారిగా కర్ణాటక ప్రభుత్వం ఆంక్షలు విధిస్తున్నట్లుగా ప్రకటించింది. ముఖ్యంగా న్యూఇయర్ వేడుకలు జరగడానికి వీల్లేదని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై ప్రకటించారు. డిసెంబర్ 30వ తేదీ నుంచి జనవరి 2వ తేదీ వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఎలాంటి బహిరంగ పార్టీలు, సామూహిక వేడుకలు జరుపుకోకూడదు. పబ్‌లు, రెస్టారెంట్లు, అపార్టుమెంట్లలో డీజేల వాడకాన్ని నిషేధించారు. ఒమిక్రాన్ వ్యాప్తి అంశంపై నిపుణులతో సంప్రదింపులు జరిపిన కర్ణాటక ప్రభుత్వం ఆంక్షలు విధించడమే మేలని నిర్ణయానికి వచ్చింది.
అయితే కొన్ని నిబంధనలతో సాధారణంగా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవానికి పర్మిషన్ ఇవ్వాలని నిర్ణయించారు. పబ్‌లు, రెస్టారెంట్లలోయాభై శాతం సీటింగ్ సామర్త్యంతో వేడుకలు నిర్వహించుకోవచ్చు.అయితే డీజేలు మాత్రం పెట్టకూడదు. అదే సమయంలో వేడుకలకు వచ్చే వారు ఎట్టి పరిస్థితుల్లోనూ రెండు డోసుల టీకాలు తీసుకుని ఉండాలి. టీకాలు తీసుకోనని వారిని అనుమతించకూడదు. ఈ నిబంధనలతో కర్ణాటక ప్రభుత్వం అధికారిక ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే పెద్ద ఎత్తున న్యూఇయర్ వేడుకలకు ఏర్పాట్లు జరుగుతూండటంతో... వాటిని ఆపేయాల్సిన పరిస్థితి వచ్చింది.
Also Read: 'అయ్యా.. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి... బూస్టర్‌కు అనుమతివ్వండి'
కర్ణాటకలో ఒమిక్రాన్ శరవేగంగా విస్తరిస్తోంది. కర్ణాటకలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు 19 నమోదయ్యాయి. ఇప్పటికే విదేశాల నుంచి వస్తున్న వారికి కఠినమైన పరీక్షలు నిర్వహిస్తోంది. అనుమానితులను క్వారంటైన్‌లో ఉంచుతోంది. అయినప్పటికీ కేసులు పెరుగుతూండటంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించారు. బెంగళూరు మెట్రోపాలిటన్ సిటీ కావడంతో న్యూఇయర్ వేడుకలు చాలాపెద్ద ఎత్తున జరుగుతాయి. గతంలో ఇలాగే జరగడంతో కరనా వ్యాప్తి జరిగిందన్న విమర్శలు ఉన్నాయి. అందుకే ఈ సారి కర్ణాటక సర్కార్ ముందుగానే జాగ్రత్తలు తీసుకుంది.
Also Read: Omicron Doubling: స్పీడ్ పెంచిన ఒమిక్రాన్.. 1.5 నుంచి 3 రోజుల్లోనే కేసులు డబుల్!