చిన్న చాక్లెట్ తిని తియ్యని వేడుక చేసుకుందాం.. అని వచ్చే యాడ్ మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఎటువంటి బాధ, సంతోషం ఇలా ఏ ఫీలింగ్ లో ఉన్నా చాలా మంది చాక్లెట్స్ తింటూ ఉండటం మనం చూస్తూనే ఉంటాం. మూడ్ బాగోలేదంటే దాని నుంచి బయటకి రావడానికి చాలా మంది క్యాండి బార్స్, బిస్కెట్స్ తింటారు. కానీ అవి మీ మూడ్ మార్చేందుకు ఏ విధంగానూ పను చేయవని నిపుణులు చెబుతున్నారు. మనం తీసుకునే ఆహారం మీదే మన మానసిక స్థితి ఆధారపడి ఉంటుందని అంటున్నారు. ఆహారంలో మార్పులు మెదడు పనితీరు, శారీరక ఆరోగ్యం మొత్తం మీద ప్రభావం చూపుతుంది. మీరు ఎప్పుడైనా డల్ గా నిరుత్సాహంగా ఉన్నప్పుడు మీ మూడ్ బాగోలేనప్పుడు ఈ ఆహార పదార్థాలు తిని చూడండి. మీరు చాలా యాక్టివ్ గా ఉంటారు. ఇవి మీ మూడ్ మార్చడమే కాదు ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి.


మీ మూడ్ మార్చే ఆహారం  


అరటిపండ్లు: అరటిపండ్లలో చక్కెర, ఫైబర్, విటమిన్ B6 ఉంటాయి. ఇది మానసిక స్థితిని స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది. అవి మీ మానసిక స్థితిని తక్షణమే ఉత్తేజపరిచేందుకు సహకరిస్తుంది. దీని తీసుకోవడం వల్ల మీరు రిఫ్రెష్ అనుభూతిని పొందుతారు.


ఓట్స్: రోజును ప్రారంభించడానికి ఓట్స్ అద్భుతమైన ఫుడ్. రక్తంలో చక్కెర స్థాయిలని నియంత్రించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ఐరన్ పుష్కలంగా లభించే ఆహారం. అలసటని దూరం చేసి మీరు యాక్టివ్ గా ఉండేలా చేస్తుంది. మూడ్ బూస్టర్ గా పని చెయ్యడంలో గొప్ప ఫుడ్ ఇది. దీన్ని తినడం వల్ల రోజంతా మిమ్మల్ని ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉంచుతుంది. అందుకే ఉదయం మనం తీసుకునే అల్పాహారం మన రోజువారీ మూడ్ మొత్తాన్ని ప్రభావితం చేస్తుందని అంటారు.


డార్క్ చాక్లెట్స్: చాక్లెట్స్ ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. మీ మూడ్ బాగోలేదంటే ఒక చిన్న డార్క్ చాక్లెట్ ముక్క నోట్లో వేసుకోండి. చాలా రిఫ్రెష్ గా అనిపిస్తుంది. మెదడులో డోపమైన్ ను ఇది పెంచుతుంది. మానసిక స్థితిని మెరుగుపరిచేందుకు మిమ్మల్ని ఉత్తేజపరిచేలా చేస్తుంది. తీపి వంటకాలు ఇష్టపడే వాళ్ళు సాధారణ చాక్లెట్స్ కి బదులుగా డార్క్ చాక్లెట్స్ తింటే బాగుంటుంది.


నట్స్: మీ మూడ్ మార్చుకునేందుకు నట్స్ అద్భుతమైన ఎంపిక. కొన్ని గింజలు మీ నోట్లో వేసుకుని తింటూ ఉండండి చాలా హాయిగా అనిపిస్తుంది. మీ డిప్రెషన్ తగ్గించి వెంటనే మీ మూడ్ మార్చేస్తుంది. మానసిక స్థితిని మెరుగుపరిచేందుకు సహకరిస్తాయి. నైట్ షిఫ్ట్ చేస్తూ అర్థరాత్రి ఏదైనా తినాలని అనిపిస్తే స్నాక్స్ గా సైడ్ డిష్ గా ఇవి పనికొస్తాయి.


బీన్స్, కాయధాన్యాలు: పూర్తి పోషకాలు నిండిన బీన్స్, కాయధాన్యాలు సూపర్ ఫుడ్స్. వీటిలో జింక్, మెగ్నీషియం సమృద్ధిగా ఉంటాయి. మీరు యాక్టివ్ గా ఉండటానికి ఉత్సాహాన్ని పెంచుతాయి.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also Read: జుట్టు రాలడానికి కారణాలివే, ఇలా చేస్తే బట్టతల రానేరాదు


Also Read: ఫ్రొజెన్ ఫుడ్ అతిగా తింటున్నారా? అనారోగ్యాన్ని 'కొని' తెచ్చుకున్నట్లే!