Natural Drinks to Lower LDL Cholesterol : హార్ట్‌లోని ఆర్టరీ వాల్స్‌లో కొవ్వు ఏర్పడితే గుండెకు రక్తప్రసరణ కావడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. వీటినే Clogged Arteries అని కూడా అంటారు. పరిస్థితి చేయిజారితే.. హార్ట్ ఎటాక్.. మరిన్ని గుండె సమస్యలు వస్తాయి. కాబట్టి గుండెల్లో నిల్వ ఉండే చెడు కొవ్వును తగ్గించుకునేందుకు రెగ్యూలర్‌గా కొన్ని డ్రింక్స్ తాగాలంటున్నారు. వాటిని తీసుకోవడం వల్ల Clogged Arteries తగ్గుతాయి.
శరీరంలో హై కొలెస్ట్రాల్ ఉన్నప్పుడు Clogged Arteries ఏర్పడి గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీసేలా చేస్తాయి. అయితే రెగ్యూలర్ డైట్లో కొన్ని మార్పులు చేయడం వల్ల వీటిని తగ్గించుకోవచ్చంటున్నారు. కొన్ని డ్రింక్స్ తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొవ్వు సహజంగా తగ్గుతుందని చెప్తున్నారు. ఇంతకీ ఆ డ్రింక్స్ ఏంటి? వాటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
బాదం మిల్క్
బాదం మిల్క్‌లో కేలరీలు తక్కువగా ఉంటాయి. ముఖ్యంగా డెయిరీ ప్రొడెక్ట్స్ ఉపయోగించని వారికి ఇది బెస్ట్ ఆప్షన్. వీటిలో హెల్తీ ఫ్యాట్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. వీటిలో విటమిన్ ఈ ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్‌ని కంట్రోల్ చేస్తుంది. స్వీట్‌లేని బాదం మిల్క్ తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి.
పసుపుతో కూడా
కొబ్బరి పాలు లేదా ఆల్మండ్ మిల్క్‌లో పసుపు వేసి నిద్రకు ముందు తాగితే చాలా మంచిది. దానిలో కాస్త పెప్పర్ కూడా వేసుకోవచ్చు. ఇది శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ని కంట్రోల్ చేసి.. గుండె ఆరోగ్యాన్ని హెల్తీగా ఉంచడంలో హెల్ప్ చేస్తాయి. పాలల్లో కూడా మీరు పసుపు వేసి తీసుకోవచ్చు. ఇది ఇమ్యూనిటీని, నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది.
గ్రీన్ టీ
గుండె ఆరోగ్యానికి గ్రీన్ టీ ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని చెడు కొవ్వును తగ్గిస్తాయి. మంచి కొలెస్ట్రాల్‌ని పెంచుతాయి. కాబట్టి ఉదయం లేదా సాయంత్రం గ్రీన్ టీ తీసుకుంటే మంచిది. ఇది ఒత్తిడిని తగ్గించి రిలాక్స్ చేయడంతో పాటు నిద్ర నాణ్యతను పెంచుతుంది.
బీట్ రూట్ జ్యూస్
బీట్ రూట్ జ్యూస్‌ని ఉదయమే కాదు. రాత్రుళ్లు కూడా తీసుకోవచ్చు. ఇది రక్తప్రసరణను మెరుగుపరిచి.. బీపీని కంట్రోల్ చేస్తుంది. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తాయి. రోజూ పడుకునే ముందు చిన్న గ్లాస్ బీట్రూట్ జ్యూస్ తీసుకుంటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
యాపిల్ సైడర్ వెనిగర్
యాపిల్ సైడర్ వెనిగర్‌తో కూడా ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ముఖ్యంగా కొలెస్ట్రాల్‌ని కంట్రోల్ చేసుకోవడం కోసం తీసుకోవచ్చు. స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్‌ని.. గోరువెచ్చని నీటితో నిండిన గ్లాస్లో వేసుకుని.. దానిలో తేనె కలిపి రాత్రుళ్లు తాగితే చాలా మంచిది. పరగడుపున తాగినా మంచి ఫలితాలుంటాయి. ఇది జీర్ణ సమ్యలను, చెడు కొవ్వును దూరం చేస్తుంది.
మరిన్ని డ్రింక్స్
క్రాన్ బెర్రీ జ్యూస్, దానిమ్మ జ్యూస్, ద్రాక్ష జ్యూస్, అవకాడో స్మూతీలు కూడా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. చెడు కొలెస్ట్రాల్ కంట్రోల్ చేస్తాయి.
వీటితో పాటు రెగ్యూలర్‌గా వ్యాయామం చేస్తూ.. ఒత్తిడిని తగ్గించుకునే రోటీన్‌ను ఫాలో అయితే శరీరంలో చెడు కొవ్వు నిల్వ ఉండదు. అలాగే వాకింగ్ చేయడం వల్ల కూడా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. వీటిని డైట్లో తీసుకునే ముందు కచ్చితంగా వైద్యుల సూచనలు తీసుకోవాలి.
Also Read : మగవారిలో గుండె సమస్యలు పెరగడానికి కారణం ఇదే.. కారకాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు