Blocked Heart Arteries : గుండెలోని ఆర్టరీ వాల్స్​లో కొవ్వు ఏర్పడిపోవడాన్ని అథెరోస్క్లోరోసిస్ (Atherosclerosis) అంటారు. దీనినే Clogged Arteries అని కూడా అంటారు. ఇవి గుండె సమస్యలన్ని పెంచుతాయని.. వీటిని అస్సలు అశ్రద్ధ చేయవద్దని చెప్తున్నారు నిపుణులు. అసలు వీటి వల్ల కలిగే నష్టాలేంటి? ఇవి ఎందుకు వస్తాయి? చికిత్స ఉందా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫుడ్స్​తో వీటిని కంట్రోల్ చేయవచ్చా? వంటి విషయాలు ఇప్పుడు చూసేద్దాం. 


కారణాలు ఇవే..


ధమనులలో కొవ్వు పేరుకుపోవడానికి అనేక కారణాలు ఉంటాయి. ఆర్టరీ వాల్స్​లో కొవ్వు చేరుకున్నప్పుడు లేదా డ్యామేజ్ అయినప్పుడు గుండెకు రక్తప్రవాహం తగ్గుతుంది. కొన్ని సందర్భాల్లో పూర్తిగా ఆగిపోతుంది. రక్తంలో కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు.. ధమనుల్లో ఫలకం ఏర్పడుతుంది. బీపీ ఉన్నవారిలో ధమని గోడలు దెబ్బతిని కొవ్వు పేరుకుపోయేలా చేస్తాయి. పొగాకు వాడేవారిలో కూడా గుండెలోని ధమనుల్లో మార్పులు ఉంటాయి. ఇవి గుండెకు రక్తం చేరకుండా అడ్డుకుంటాయి. మధుమేహం ఆర్టరీలను దెబ్బతీస్తుంది. ఊబకాయం ఈ ప్రమాదాన్ని రెట్టింపు చేస్తుంది. అలాగే అన్​హెల్తీ ఫుడ్స్ తీసుకోవడం వల్ల కూడా ఈ సమస్య ఎక్కువ అవుతుంది. 


లక్షణాలు ఇవే..


ధమనుల్లో కొవ్వు పెరిగి.. గుండెకు రక్తప్రసరణ మెరుగ్గాలేనప్పుడు ఛాతీలో నొప్పిగా ఉంటుంది. శ్వాస సరిగ్గా ఆడదు. అలసట ఎక్కువ అవుతుంది. కాళ్లు, చేతుల్లో నొప్పి, వీక్​నెస్ ఉంటుంది. జ్ఞాపకశక్తి తగ్గి చర్మం రంగు మారిపోతుంది. ఇవన్నీ గుండెపోటు, స్ట్రోక్​కు కారణమవుతాయి. లేదంటే పరిధీయ ధమని వ్యాధి, కరోనరి ఆర్టరీ, కిడ్నీ వ్యాధులు, రక్తం గడ్డకట్టడం, ఆర్గాన్స్ ఫెయిల్ అవ్వడం వంటి ప్రాణాంతక సమస్యలకు దారితీస్తాయి. 


ప్రమాద కారకాలు ఇవే


ఆర్టరీ వాల్స్ దెబ్బతినడం వంటి సమస్య మహిళల్లో కంటే పురుషుల్లోనే ఎక్కువగా ఉంటుంది. పురుషుల్లో 45 ఏళ్లు దాటిన వారికి దీని ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. మహిళల్లో 55 ఏళ్లు దాటిన వారిలో ఎక్కువగా ఉంటుంది. మోనోపాజ్ ఆగిపోయిన స్త్రీలల్లో కూడా ఈ తరహా సమస్యలుంటాయి. కాబట్టి వీలైనంత త్వరగా వైద్యుల సలహాలు తీసుకోవాలి. అలాగే డైట్​లో కొన్ని ఫుడ్స్ చేర్చుకోవడం వల్ల కూడా ఈ సమస్య తగ్గుతుందని చెప్తున్నారు నిపుణులు. 



డైట్​లో తీసుకోవాల్సిన ఫుడ్స్


గుండె ధమనులను క్లీన్​గా, కొవ్వు లేకుండా ఉంచుకోవాలంటే కొన్ని ఫుడ్స్​ని డైట్​లో చేర్చుకోవాలి. అలాంటి వాటిలో అవకాడోలు ఒకటి. ఇవి సూపర్ హెల్తీ ఫుడ్స్. వీటిలో హెల్తీ మోనోశాచురేటెడ్ కొవ్వులు, ఫైబర్ ఉంటాయి. ఇవి ఆర్టరీ వాల్స్​లో కొవ్వు పేరుకుపోకుండా కాపాడుతాయి. అరటిపండు గట్ హెల్త్​కే కాదు.. ధమనులను సురక్షితంగా ఉంచడంలో కూడా హెల్ప్ చేస్తాయి. శనగలు కూడా గుండె ఆరోగ్యాన్ని పెంపొందించడంలో సహాయం చేస్తాయి. బ్రౌన్ రైస్ గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేస్తుంది. చేపలు కూడా మంచివే. వీటన్నింటిలో విటమిన్ బి6 కామన్​గా ఉంటుంది. ఇవి ధమనుల్లోని కొవ్వును తగ్గించడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. 



జీవనశైలిలో మార్పులు


డైట్​ విషయంలో పూర్తి మార్పులు చేయాలి. పండ్లు, కూరగాయలతో పాటు మిల్లెట్స్ తీసుకోవాలి. రెగ్యూలర్​గా వ్యాయామం చేయాలి. స్మోకింగ్ పూర్తిగా మానేస్తే మంచిది. స్ట్రెస్​ పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. బీపీ, కొలెస్ట్రాల్​ను కంట్రోల్​లో ఉంచుకునేందుకు జాగ్రత్తలు తీసుకోవాలి. వైద్యుల సహాయంతో మందులు వాడాలి. బైపాస్ సర్టరీ ద్వారా కూడా ఈ కొవ్వును తొలగించేస్తారు. అశ్రద్ధ చేస్తేనే ఈ సమస్య ప్రాణాంతకమవుతుంది. 


Also Read : రాత్రుళ్లు ఆ పనులు చేస్తే సైలెంట్ హార్ట్ ఎటాక్స్ తప్పవట.. ఆ మిస్టేక్స్ అస్సలు చేయొద్దంటోన్న నిపుణులు