Vitamin Deficiency: వాసన, రుచి తెలియడం లేదా? కరోనా వల్లే కాదు, ఈ విటమిన్ లోపం వల్ల కూడా కావచ్చు

వాసన, రుచి తెలియకపోవడానికి కారణాలలో విటమిన్ లోపం కూడా ఒకటి.

Continues below advertisement

కరోనా లక్షణాలలో వాసన, రుచి తెలియకపోవడం ప్రధానం. చాలా మంది కరోనా సోకిన రోగులు ఈ విచిత్రి పరిస్థితిని ఎదుర్కొన్నారు. అప్పట్నించి వాసన, రుచి శక్తి తగ్గితే చాలు కరోనా వచ్చిందేమో అన్న అనుమానాలు అధికమైపోయాయి. వాసన తెలియకపోయినా వెంటనే కరోనా టెస్టులు చేయించుకునే వారి సంఖ్య పెరిగిపోయింది. నిజానికి కరోనా వైరస్ కారణంగా  మాత్రం వాసన, రుచి శక్తిని కోల్పోదు శరీరం, విటమిన్ల లోపం వల్ల కూడా ఆ శక్తి సమర్థంగా పనిచేయదు. ముఖ్యంగా విటమిన్ డి లోపం వల్ల రుచి, వాసన గ్రహించే శక్తి తగ్గిపోతుంది. అందుకే విటమిన్ డి లోపం లేకుండా చూసుకోవాలి. 

Continues below advertisement

విటమిన్ డి పుష్కలంగా దొరికేది నీరెండ నుంచే. కొన్ని ఆహారాలలో దొరికినా కూడా అది కొద్దిమొత్తమే. ఇప్పుడు ప్రజలకు నీరెండలో ఓ అరగంట పాటూ నిల్చునేంత టైమ్ ఎక్కడుంది? ఏసీ రూముల్లో ఇరుక్కుపోతున్నారు. ఎండ కనిపిస్తే చాలు నీడ పట్టుకు చేరుకుంటున్నారు. ఉదయాన కాచే ఎండనే నీరెండ అంటారు. ఈ ఎండ ద్వారానే విటమిన్ డి పుష్కలంగా అందుతుంది. అలాగే సాయంత్రం పూట సూర్యాస్తమయానికి ముందు కాచే ఎండ ద్వారా కూడా విటమిన్ డి అందుతుంది. అపార్టమెంట్లు అధికం అవ్వడంతో చాలా మందికి ఎండ జాడ తెలియడం లేదు. భారీ భవంతులు పెరిగిపోవడంతో నీరెండ ప్రజలకు చేరడం లేదు కూడా.అయినా సరే ఎండ తగిలే చోట రోజుకో అరగంటైనా నిల్చుంటే చాలా మంచిది. మనదేశంలో 90 శాతం ప్రజల్లో విటమిన్ డి లోపం ఉందంటే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఎలా ఉందో.

విటమిన్ డి ఎలా?
సూర్యకిరణాలు మన చర్మంపై పడినప్పుడు, చర్మం కింద పొరల్లో ఉన్న కొవ్వులు కరిగి డి విటమిన్ ఉత్పత్తి అవుతుంది. కాబట్టి నీరెండలో నిల్చోవాల్సిన అవసరం ఉంది. డి విటమిన్ లోపం వల్ల ఎముకలు గుల్లబారడం, రోగనిరోధక శక్తి తగ్గడం, గుండె సంబంధ వ్యాధులు రావడం వంటివి జరుగుతాయి. విటమిన్ డి తగినంత అందకపోతే శరీరం కాల్షియాన్ని కూడా సరిగా గ్రహించలేదు. 

నిత్యం అలసట, తరచూ ఒళ్లు నొప్పులు, కండరాల నొప్పులు, మెట్లు ఎక్కలేకపోవడం, కింద కూర్చుని లేవలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయంటే విటమిన్ డి లోపమేమో చెక్ చేసుకోవాలి. 

సూర్య కాంతిలో నిల్చోవడమే కాదు, ఆహారంలో పాలకూర, సోయా బీన్స్, సాల్మన్, సార్టయిన్, గుడ్డులోని పచ్చసొన, పాలు, బెండకాయ వంటివి తింటూ ఉండాలి.  

Also read: ఆరు నెలలకోసారైనా ఈ టెస్టు చేయించుకుంటే మంచిది, డయాబెటిస్ రాకను ముందే కనిపెట్టవచ్చు

Also read: ఇంగువ మన దేశంలో ఇంతవరకు పండించలేదు, మరెలా మన వంటల్లో భాగమైంది?

Continues below advertisement
Sponsored Links by Taboola