డయాబెటిస్ రాకను ముందే పసిగట్టాలన్న ఆలోచన ఎవరికీ ఉండదు. అదే ఉంటే ఇంత మంది డయాబెటిస్ రోగులు ప్రపంచంలో పెరిగే వారే కాదు. ఒక చిన్నరక్తపరీక్ష ద్వారా డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంటే ముందే తెలుసుకునే అవకాశం ఉంది. అదే HbA1c పరీక్ష. ఈ రక్త పరీక్షకు పెద్దగా ఖర్చవ్వదు. మీరు డయాగ్నోస్టిక్ సెంటర్ ని బట్టి వెయ్యి రూపాయల నుంచి 1500 రూపాయల దాకా వసూలు చేస్తారు. ఈ టెస్టు ద్వారా గత రెండు నుంచి మూడు నెలల్లో మీ రక్తంలోని చక్కెర స్థాయిలను చెబుతారు. దీని వల్ల ప్రీడయాబెటిస్ ఉన్న సంగతి కూడా బయటపడుతుంది. ప్రీ డయాబెటిస్ ఉంటే త్వరలో మీకు డయాబెటిస్ రాబోతోంది అర్థం. ప్రీ డయాబెటిస్ ఉందని తెలుసుకున్న వెంటనే మీరు ఆహార విషయంగా, వ్యాయామపరంగా జాగ్రత్తలు తీసుకుంటే డయాబెటిస్ రాకుండా అడ్డుకోవచ్చు.ప్రతి ఆరునెలలకోసారి ఈ టెస్టు చేయించుకుంటే డయాబెటిస్ రావడానికి ముందే తెలుసుకుని జాగ్రత్త పడచ్చు. 


టెస్టు ఫలితాలు ఇలా...
HbA1c టెస్టునే గ్లైకోనేటెడ్ హీమోగ్లోబిన్ టెస్టు అని కూడా అంటారు. ఇందులో కాస్త రక్తాన్ని సేకరిస్తారు. ఆ రక్తం ద్వారా మూడు నెలల ముందు నుంచి రక్తంలో చక్కెర శాతం సగటుగా  ఎంత ఉందనేది తెలుసుకుంటారు. వచ్చే ఫలితాలను బట్టి నార్మల్ ఉందా లేక ప్రీ డయాబెటిక్ స్టేజ్ లో ఉన్నారో తెలుసుకోవచ్చు. ఈ టెస్టులో రీడింగు 5.7 కన్నా తక్కువగా వస్తే మీకు రక్తంలో చక్కెర సాధారణంగా ఉందని అర్థం. అదే 5.7 నుంచి 6.4 శాతం మధ్య ఉంటే ప్రీ డయాబెటిక్ అని అర్థం. 6.4 శాతం కన్న ఎక్కువ రీడింగు వస్తే వారు డయాబెటిస్ ఉన్నట్టు అర్థం. మీకే 5.7 రీడింగు దాటి వస్తే మాత్రం సమీప భవిష్యత్తులో మీకు డయాబెటిస్ వచ్చే ఛాన్స్ పూర్తిగా ఉందని అర్థం. ఈ రీడింగు వచ్చిన వారే మధుమేహం రాకుండా జాగ్రత్త పడాలి. 


ఆహారపు అలవాట్లను కఠినంగా మార్చుకోవాలి. చక్కెర ఉన్న పదార్థాలు పూర్తిగా మానివేయాలి. వీరికి నీరసంగా ఆవహిస్తుంది. దానికి కారణం రక్తంలోని ఎర్ర కణాల్లోని హిమోగ్లోబిన్ కు చక్కెర అంటుకోవడమే. అందుకే షుగర్ టెస్టును రక్తాన్ని సేకరించి చేస్తారు. ప్రీ డయాబెటిక్ స్థాయిలో ఉన్న వారు రోజూ వ్యాయామం చేయడం ద్వారా షుగర్ లెవెల్స్ ని నార్మల్ స్టేజ్ కి తీసుకురాగలరు. ఇక షుగర్ అధికంగా ఉండే ఆహార పదార్థాలను పూర్తిగా దూరం పెట్టాలి. ఒకేసారి అధిక మొత్తంలో తినే కన్నా చిన్న చిన్న భోజనాల రూపంలో తింటే నీరసం రాకుండా ఉంటుంది. 




Also read: ఇంగువ మన దేశంలో ఇంతవరకు పండించలేదు, మరెలా మన వంటల్లో భాగమైంది?