Horoscope Today 23 May 2022: ఈ రాశివారు ఎవ్వరి నుంచీ ఏమీ ఆశించకపోవడమే మంచిది, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope In Telugu: ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించాలి.

Continues below advertisement

2022 మే 23 సోమవారం రాశిఫలాలు ( మేష రాశి నుంచి కన్యారాశి వరకు)

మేష రాశి
 ఈ రాశి వ్యాపారులు వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రచిస్తారు.  గత తప్పుల నుంచి  పాఠాలు నేర్చుకుని ముందుకు సాగుతారు. కుటుంబంలో మీ బాధ్యతలు పెరుగుతాయి. మీ కెరీర్ పట్ల సానుకూలంగా ఉండండి. జీవిత భాగస్వామితో విభేదాలు పరిష్కారమవుతాయి.  మీ పని తీరు మెరుగుపడుతుంది. కోపంతో ఎవరితోనూ మాట్లాడ వద్దు. 

Continues below advertisement

వృషభ రాశి
ఈ రోజు మీకు చాలా మంచి రోజు అవుతుంది. ప్రయాణం చేసేందుకు ప్లాన్ చేసుకోవచ్చు.  కుటుంబ సభ్యులు మీతో చాలా సంతోషంగా ఉంటారు. వ్యాపారంలో లాభాలు పొందుతారు. ఆదాయం, వ్యయం మధ్య గొప్ప సమతుల్యత ఉంటుంది. మీరు పిల్లల సమస్యల గురించి కొంచెం ఆందోళన చెందుతారు. పాత మిత్రులను కలుస్తారు.

మిథున రాశి
ఈరోజు మీరు మంచి సమాచారం అందుకుంటారు.  మీ పురోగతిలో వస్తున్న అడ్డంకులు తొలగిపోతాయి. మీ ప్రత్యర్థులతో చేయి కలుపుతారు. సామాజిక కార్యక్రమాలలో బిజీగా ఉంటారు. మంచి వ్యక్తులను కలిసేందుకు ఆసక్తి చూపిస్తారు.  బంధువులను కలుస్తారు. నిస్వార్థంగా పని చేస్తే ప్రయోజనం ఉంటుంది. అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి.  

Also Read: శుక్రగ్రహ సంచారం వల్ల ఈ మూడు రాశులవారు ఓ సమస్య నుంచి బయటపడితే మరో సమస్యలో ఇరుక్కుంటారు
 
కర్కాటక రాశి
మీ సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది.  మీ చుట్టుపక్కల వారు  మీ భావాలను అగౌరవపరచవచ్చు. ఈరోజు మీకు చేయాలనుకున్న సాయం చేయండి కానీ  ఎవరి నుంచి ఏమీ ఆశించవద్దు.  మనసులో ప్రతికూల భావాలు తలెత్తుతాయి. జీవిత భాగస్వామితో సైద్ధాంతిక విభేదాలు ఉంటాయి.  ఆఫీసులో కొన్ని పనుల వల్ల కొంత టెన్షన్ ఉంటుంది.
 
సింహ రాశి
ఈరోజు ఆహ్లాదకరమైన రోజు అవుతుంది. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. మీకు గౌరవం లభిస్తుంది. బులియన్ వ్యాపారులు అధిక లాభాలు పొందుతారు. ఈ రోజు కొత్త వ్యాపార సంబంధాలు ఏర్పడతాయి. ఈ రోజు అదృష్టం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఇంటి వాతావరణం క్రమశిక్షణతో ఉంటుంది. డబ్బు సంబంధిత సమస్యలను అధిగమిస్తారు. ఉద్యోగులకు శుభసమయం.

కన్యా రాశి 
మీకు విధేయత చూపమని ఎవరినీ బలవంతం చేయవద్దు. పిల్లల అవసరాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీ సంకల్పం బలంగా ఉంటుంది. పిల్లల వృత్తిపట్ల ఆందోళన ఉంటుంది. కొన్ని ముఖ్యమైన పనులకు అంతరాయం కలగవచ్చు. కొన్ని పనులు ప్రారంభించడానికి ఈ రోజు మంచి రోజు అవుతుంది. ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులకు సాధారణంగా ఉంటుంది. 

Also Read: మే 23న రాశి మారుతున్న శుక్రుడు, ఈ రాశులవారి జీవితం ప్రేమమయం

Continues below advertisement
Sponsored Links by Taboola