ఏదైనా చిన్న సమస్య ఉన్నా సరే దాని నుంచి దృష్టి మరల్చుకోలేకపోవడం, కార్టిసాల్ వంటి ఒత్తిడికి, ఆందోళనకు కారణమయ్యే హార్మోన్ల స్థాయి పెరిగిపోవడం వంటివి ఆందోళన యాంగ్జైటీకి కారణమవుతున్నాయి. పూర్తి స్థాయి విశ్రాంతి రాత్రి నిద్ర ద్వారా మాత్రమే మనకు దొరుకుతుంది. రాత్రి నిద్ర సరిగా లేని వారికి తెల్లవారి రకరకాల సమస్యలు వేధిస్తాయి తిరిగి మంచి నిద్ర తర్వాతే కోలుకుంటారు. అలాంటిది ఈ సమస్య దీర్ఘకాలం కొనసాగితే ఆరోగ్యం ప్రమాదంలో పడుతుందని చెప్పడంలో ఎలాంటి సంకోచం అవసరం లేదు. నిద్ర అంత ప్రధానమైనది. రాత్రి నిద్రను ఆటంకపరిచే అంశాల్లో ఆందోళన కూడా ఒకటి. రాత్రి పూట కలిగే ఆందోళన వల్ల నిద్ర మీద తీవ్రమైన ప్రభావం పడుతుంది. సిర్కాడియన్ రిథమ్ లో కూడా భారీ మార్పులు జరిగే ప్రమాదం ఉంటుంది. రాత్రి కలిగే ఆందోళన ఎందుకు? లక్షణాలేమిటి? దాన్ని ఎలా మేనేజ్ చెయ్యాలి? వంటి విషయాలగురించి తెలసుకునే ప్రయత్నం చెద్దాం.


దృష్టి మరల్చలేకపోవడం


ఒక్కోసారి కొన్ని విషయాల మీద పెద్దగా ఫోకస్ చేయకూడదు. అంటే అనవసరమనుకునే విషయాల గురించి ఎక్కువ ఆలోచించకూడదు. లేకుంటే అవి ఆందోళనకు కారణమవుతాయి. రోజంతా పని ఒత్తిడితో ఉన్నపుడు రకరకాల ఇబ్బందికర పరిణామాల మధ్య రోజు గడుస్తుంటుంది. రాత్రి కాగానే దొరికిన ఏకాంతం రకరకాల సమస్యలను గుర్తుచేస్తుంది. ఈ సమస్యల నుంచి ఆ సమయంలో దృష్టి మరల్చడంలో విఫలమవుతే అది ఆందోళన కలిగిస్తుంది. ఈ ఆందోళన వల్ల నిద్ర పట్టదు.


కార్టిసాల్


ఒత్తిడి వల్ల శరీరంలో కార్టిసాల్ అనే ఒత్తిడి పెంచే హార్మోన్ స్థాయి పెరుగుతుంది. ఇలా కార్టిసాల్ పెరిగిపోతే ఒత్తిడి అధికమై ఆందోళనగా మారుతుంది. ఆలోచనలు విపరీతమై పోయినపుడు కార్టిసాల్ స్థాయిలు పెరిగిపోతాయి. జరిగిపోయిన సంఘటనలు, అనవసరపు ఆరోపణల వంటివి రాత్రి ఏకాంతంలో ఎక్కువ గుర్తురావడం వల్ల ఆలోచనలు తీవ్రమవుతాయి. ఇదే ఆందోళనకు ముఖ్యమైన కారణంగా చెప్పవచ్చు. ఆందోళన డిప్రెషన్ కు దారితీస్తుంది.



లక్షణాలు


ఆందోళన కలగడం మొదలవగానే గుండె వేగం హెచ్చుతుంది. నెమ్మది కండరాలు బిగుసుకుంటున్న భావన కలుగుతుంది. శ్వాస తీసుకోవడం లో ఇబ్బంది కలుగుతున్న భావన కలుగుతుంది. నుదుటి మీద, అరచేతుల్లో చెమటలు పడతాయి. రాత్రి ఒంటరితనంలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే మరింత ఆందోళ హెచ్చే ప్రమాదం ఉంటుంది.


జీవితంలో కొన్ని అంశాలను ఎంత ఆలోచించినా మార్చడం సాధ్యం కాదన్న అవగాహన లేనపుడు ఓవర్ థింకింగ్ కి కారణమవుతుంది. అవసరానికి మించి ఆలోచించడం ఆందోళనలో మొదటి మెట్టు. తప్పుజరిగిపోతుందేమో అనే భయం భవిష్యత్తు గురించిన చింత ఆందోళనకు కారణం. ఆందోళనలో ఉన్నపుడు చేస్తున్న పని మీద దృష్టి నిలపడం సాధ్యం కాదు. తీవ్రమైన అశాంతి వేధిస్తుంటుంది.


ఆందోళనకు కారణాలు



  • రోజంతా ఒత్తిడిలో పనిచెయ్యడం వల్ల రాత్రి యాంగ్లైటి పెరిగిపోతుంది.

  • కొందరి శరీరంలో హార్మోన్లు రాత్రి పూట భిన్నంగా స్పందిస్తాయి. కొందరిలో పగటి పూట చురుకుగా ఉండే హార్మోన్లు రాత్రి కూడా ఎక్కువగా ఉండడం వల్ల ఆందోళన కలుగుతుంది.

  • చాలా కాలంగా రాత్రి నిద్ర సరిగా లేని వారిలో కూడా ఆందోళన కలిగే ప్రమాదం ఉంటుంది.

  • రాత్రి కెఫిన్, ఆల్కహాల్, చక్కెర కలిగిన ఆహారాలు తీసుకుంటే నిద్రకు అంతరాయం కలిగి ఆందోళనకు కారణం కావచ్చు.

  • అనిమియా, థైరాయిడ్, ఇతర అనారోగ్యాల వల్ల కూడా రాత్రి ఆందోళన పెరిగిపోవచ్చు.

  • రాత్రి కలిగే ఆందోళన చాలా సార్లు తీవ్రమైన మానసిక సమస్యలకు సంకేతం కావచ్చు.

  • మరుసటిరోజున ఎదర్కోబోయే ముఖ్యమైన సంఘటనలు ఏవైనా ఉన్నపుడు కూడా ఆందోళన కలుగువచ్చు.  


వీటిని ఫాలో అవ్వండి..


నిద్రించే చోటు లేదా బెడ్ మార్చుకోవాలి. వేధించే ఆలోచనల నుంచి మనసు మరల్చేందుకు నిద్రకు ముందు ఏదైనా చదవడం అలవాటు చేసుకోవాలి. నిద్రకు ఉపక్రమించే ముందు ఒక పది నిమిషాల పాటు ధ్యనం చెయ్యడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. లేదా నిద్రపుచ్చే సంగీతం విన్నా మంచిదే. శ్వాసను గమనించడం, గుండె లయను వినడం వంటి మన శరీరంతో కనెక్టివిటి పెంచుకునే క్రియలు కూడా మెరుగైన నిద్రను ప్రేరేపిస్తాయి. 


Also Read : 60 ఏళ్లు దాటినా జగపతి బాబు ఇంత ఫిట్​గా ఉండడానికి రీజన్స్ ఇవే.. బెండకాయ జ్యూస్​లట, కాకరకాయ రసాలట