ప్రపంచంలో ఎక్కువ శాతం మంది తినే ఆహారాలలో బ్రెడ్ ఒకటి. దానితో సులువుగా రకరకాల బ్రేక్‌ఫాస్ట్‌లు చేసుకోవచ్చు కాబట్టి దాన్ని విరివిగా వాడతారు. సాండ్ విచ్, పీనట్ బటర్, జామ్ ఇలా ఏదో ఒకదానికి జతగా చేసుకుని బ్రెడ్‌ను లాగించేస్తారు. బ్రెడ్ తినడం వల్ల ఎలాంటి ఆరోగ్యసమస్యలు రావని భావిస్తారు,నిజానికి బ్రెడ్‌ను రోజూ తినడం అంత మంచిది కాదు. రోజూ బ్రెడ్ తినేవారిలో కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. 


చక్కెర అధికం
మైదా, చక్కెర కలిపి తయారుచేసే బ్రెడ్ లో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. పోషకాలు మాత్రం తక్కువ. బ్రెడ్ అధికంగా తినడం వల్ల అనారోగ్యకరంగా బరువు పెరుగుతారు. కేలరీలు శరీరంలో చేరుతాయి. కాబట్టి బ్రెడ్ అతిగా తింటే అనారోగ్యకరమైనదనే చెప్పుకోవాలి. 


పోషకాహారం కాదు
మైదా, గోధుమలతో చేసిన బ్రెడ్ లు ఎన్ని తిన్నా అందే పోషకాలు తక్కువే. కేలరీలు మాత్రం అధికంగా ఉంటాయి. ఇది పోషకాహారం కిందకి రాదు. ఎందుకంటే దీని ద్వారా అందే పోషకాలు సున్నా.  


గ్లూటెన్ ఎక్కువ
గోధుమ పిండి లేదా మైదాతో చేసిన బ్రెడ్‌లో గ్లూటెన్ అధికంగా ఉంటుంది. కొందరికి ఈ గ్లూటెన్ అరగదు. దాని వల్ల అలెర్జీలు వస్తాయి. పొట్ట ఉబ్బరం, విరేచనాలు, పొట్ట నొప్పి వస్తాయి.  
 
నిండా కార్బోహైడ్రేట్లే
బ్రెడ్‌లో అధికంగా కార్బోహైడ్రేట్లు ఉంటాయి. అధికరక్తపోటు, మధుమేహంతో బాధపడేవారికి బ్రెడ్ తినడం మంచిది కాదు.  కార్బోహైడ్రేట్లు శరీరంలో చేరాక గ్లూకోజ్ గా విడిపోతాయి. రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. దీని గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా అధికం. 


ఉప్పు అధికం
బ్రెడ్ రుచి ఉప్పగా లేనప్పటికీ, దీనిలో ఉప్పు కంటెంట్ మాత్రం ఉంటుంది. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్న వారికి బ్రెడ్ మేలు చేయదు. దీన్ని తినకపోవడమే వారికి మంచిది. 


హార్మోన్ల అసమతుల్యత
ప్రతిరోజూ బ్రెడ్ తినేవారిలో శరీరంలో ఇన్‌ఫ్లమ్మేషన్ వస్తుంది. అధికంగా తినేవారిలో హార్మోన్ల అసమతుల్యత ప్రారంభమవుతుంది. ఈ సమస్య వల్ల ఇతర అనేక అనారోగ్యాలు దాడి చేసే అవకాశం ఉంది. కాబట్టి బ్రెడ్ తినడం తగ్గించుకోవాలి. 


Also read: కాకరకాయ చిప్స్, డయాబెటిక్ రోగులకు బెస్ట్ చిరుతిండి


Also read: 27 గంటల పాటూ 100 మంది వైద్యుల కష్టం, అవిభక్త కవలలకు పునర్జన్మ - ఉపయోగపడిన వర్చువల్ రియాల్టీ టెక్నాలజీ


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.