బియ్యం అనగానే అందరూ బయట దొరికే తెల్ల బియ్యాన్ని గుర్తుకు తెచ్చుకుంటారు. నిజానికి అవి ఆరోగ్యకరమైనవి కావు. అవి తెల్లగా రావడానికి ఎన్నోసార్లు పాలిష్ పెడతారు. అలా పాలిష్ పెట్టకుండా వదిలేసినవే దంపుడు బియ్యం. ఇవి బ్రౌన్ రంగులో ఉంటాయి. నిజానికి తెల్ల బియ్యంతో పోలిస్తే దంపుడు బియ్యం ఎన్నో పోషకాలను అందిస్తాయి. బియ్యం పైన ఉండే పొట్టులో ఎన్నో విటమిన్లు ఖనిజాలు ఉంటాయి. బియ్యాన్ని తెల్లగా కనిపించేలా చేయడం కోసం పాలిష్ పెట్టి ఆ పొరలను తీసేస్తారు. దీని వల్ల బియ్యంలో విటమిన్లు, ఖనిజాలు తొలగిపోయి తెల్ల బియ్యం మాత్రం మిగులుతాయి. దంపుడు బియ్యాన్ని ఒకసారి మాత్రమే పాలిష్ పెడతారు. దీనివల్ల పైన ఉన్న తొక్క పోతుంది. కానీ మిగతా పోషకాలు, ఖనిజాలు అలానే ఉంటాయి. కాబట్టే తెల్ల బియ్యంతో పోలిస్తే దంపుడు బియ్యాన్ని తినమని సిఫారసు చేస్తారు వైద్యులు.


రోజూ తెల్ల బియ్యం తినేవారితో పోలిస్తే దంపుడు బియ్యం తినేవారిలో మధుమేహం వచ్చే ముప్పు చాలా తగ్గుతుంది. ఈ విషయాన్ని హార్వర్డ్ శాస్త్రవేత్తలే నిర్ధారించారు. ఒక పూట తెల్ల బియ్యాన్ని, మరో పూట దంపుడు బియ్యాన్ని తిని చూడండి. మధుమేహం వచ్చే ముప్పు 16% వరకు తగ్గే అవకాశం ఉంది. అలాగే అధిక రక్తపోటు కూడా రాకుండా ఉంటుంది. ఎందుకంటే దంపుడు బియ్యంలో సోడియం చాలా తక్కువగా ఉంటుంది. ఇక మనం తినే ఆహారంలో కూడా ఉప్పును కలుపుతాము. ఇవన్నీ కలిపితే సోడియం అధికంగా శరీరంలో చేరే అవకాశం ఉంది. కాబట్టి దంపుడు బియ్యాన్ని తినడం ద్వారా కొంతమేరకు సోడియం శరీరంలో చేరకుండా అడ్డుకోవచ్చు.


బియ్యం తినడం వల్ల త్వరగా ఆకలి వేయదు. ఇతర ఆహారాలను తినాలనిపించదు. అంతేకాదు కాస్త అన్నాన్ని తింటే చాలు పొట్ట నిండిన ఫీలింగ్ వస్తుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి దంపుడు బియ్యం చాలా మంచి ఎంపిక. దీని గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. కాబట్టి తిన్నాక జీర్ణమవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు కూడా ఒకేసారి పెరగవు. కాబట్టి మధుమేహం ఉన్నవారు తెల్ల బియ్యానికి బదులుగా పూర్తిగా దంపుడు బియ్యం తినేందుకు ప్రయత్నించాలి. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్లు ఇతర పోషకాలు కూడా ఎక్కువే. కాబట్టి రొమ్ము క్యాన్సర్ వంటివి కూడా రాకుండా ఉంటాయి.


Also read: మెరిసే చర్మం కోసం ఇంట్లోనే ఇలా దానిమ్మ ఫేస్ మాస్క్‌లు ప్రయత్నించండి






Also read: ఈ పండ్లు ఎక్కడైనా కనిపిస్తే కచ్చితంగా తినండి, గుండె జబ్బులు రాకుండా ఉంటాయి



































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.