Healthy Food Choices for Diabetics : మధుమేహం ఉంటే లైఫ్‌స్టైల్ నుంచి తినే ఫుడ్స్ వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే రక్తంలో షుగర్ స్పైక్ అయి పూర్తి ఆరోగ్యాన్ని కరాబ్ చేస్తుంది. ముఖ్యంగా తినే ఆహారం విషయంలో షుగర్ పేషెంట్లు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు నిపుణులు. అయితే ఫుడ్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి ఆహారం తింటే మంచిది? ఏ ఫుడ్స్‌కి దూరంగా ఉండాలి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
కార్బోహైడ్రెట్స్కి దూరంగా ఉండాలి కానీ.. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్‌ని తీసుకోవచ్చు. ప్రాసెస్ చేయని ఫుడ్స్, తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలను డైట్లో చేర్చుకోవచ్చు. నట్స్, సీడ్స్, అవకాడో, ఆలివ్ నూనె వంటి హెల్తీ ప్రోటీన్, హెల్తీ సీడ్స్‌ను తినవచ్చు. షుగర్ డ్రింక్స్, స్వీట్స్, వైట్ బ్రెడ్ వంటి పిండిపదార్థాలు, షుగర్ స్నాక్స్ తీసుకోకపోవడమే మంచిది. హైడ్రేటెడ్‌గా ఉండేందుకు నీటిని ఎక్కువగా తాగితే మంచిది.
వీటిని తప్పక తీసుకోవాలి..
తోటకూర, కాలె వంటి ఆకుకూరల్లో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. బ్లూబెర్రీలు, స్ట్రాబెర్రీలు, రాస్ప్బెర్రీలలో ఫైబర్, విటమిన్స్, యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. బాదం, వాల్నట్స్, చియా సీడ్స్, అవిసెగింజల్లో హెల్తీ ఫ్యాట్స్, ప్రోటీన్, ఫైబర్ ఉంటాయి.
ఫ్యాటీ ఫిష్‌లో ఒమేగా 3 యాసిడ్స్ ఉంటాయి. పప్పులు, శనగల్లో ప్రోటీన్ ఫైబర్, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. బ్రౌన్ రైస్, క్వినోవాలో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, ఫైబర్ ఉంటాయి. ఇవన్నీ రక్తంలోని షుగర్ లెవల్స్‌ని కంట్రోల్ చేస్తాయి. కాబట్టి వీటిని రెగ్యులర్‌గా తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి.
తినకూడని, దూరంగా ఉండాల్సిన ఫుడ్స్ లిస్ట్
సోడా, స్పోర్ట్స్ వంటి షుగర్ డ్రింక్స్, టీ, కాఫీలలో స్వీట్ వేసుకునేవారు వాటికి దూరంగా ఉండాలి. బ్రెడ్, షుగర్ స్నాక్స్ తినకపోవడమే మంచిదంటున్నారు. హాట్ డాగ్స్, ప్రొసెస్ చేసిన నాన్ వెజ్ తినకూడదని చెప్తున్నారు. ఫ్రెంచ్ ఫ్రైస్, ఫ్రై చేసిన చికెన్, డోనట్స్ వంటి ఫుడ్స్‌కి వీలైనంత దూరంగా ఉండాలి. క్యాన్డ్ ఫుడ్స్ ప్రాసెస్, ఫ్రీజ్ చేసిన ఫుడ్స్‌లో సోడియం ఎక్కువగా ఉంటుంది. ఇవి బీపీతో పాటు షుగర్‌ని పెంచుతుంది.
డైట్ ప్లానింగ్ ఎలా ఉండాలంటే..
రోజుకు మూడుసార్లు తినేలా చూసుకోవాలి. ఒకటి లేదా రెండు స్నాక్స్ ప్లాన్ చేసుకోవాలి. వీటివల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. పోర్షన్స్‌లో అంటే ఫుడ్‌ని కొలిచి తింటే మంచిది. వారానికి కనీసం మూడు నాలుగుసార్లు ఎరోబిక్స్, వ్యాయమం చేస్తూ ఉంటే మంచిది. ఫుడ్ తినేముందు, తిన్న తర్వాత కూడా షుగర్‌ను చెక్ చేసుకోవాలి.
Also Read : బీపీ ఎక్కువగా ఉండేవారు తినకూడని ఆహార పదార్థాలు ఇవే.. తినాల్సిన ఫుడ్ లిస్ట్
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.