డయాబెటిస్ చాలా ప్రమాదకరమైంది. అందుకే మధుమేహులు తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తారు. ఇష్టమైన పదార్థాలు తినకుండా కడుపు మాడ్చుకుంటారు. మారుతున్న జీవనశైలి కారణంగా వయస్సుతో సంబంధం లేకుండా డయాబెటిస్ వచ్చేస్తుంది. మధుమేహం వస్తుందనే దానికి కొన్ని సంకేతాలు ఉన్నాయి. వాటిని సరైన సమయానికి గుర్తిస్తే మధుమేహం ఎక్కువ కాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. షుగర్ పేషెంట్స్ కి ఏదైనా గాయమైతే అది మానడానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది. మనకి మధుమేహం వచ్చిందో లేదో మన పాదాలు చెప్పేస్తాయని అంటున్నారు నిపుణులు. పాదాలు, కాళ్ళలో ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులని సంప్రదించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు.
పాదాల్లో కనిపించే లక్షణాలు
⦿ పాదాల్లో సూదులు గుచ్చినట్టుగా అనిపించడం, జలదరింపులు
⦿ కాళ్ళలో మంట(నొప్పి)
⦿ పాదాలు మెరుస్తూ మృదువుగా మారడం
⦿ కాళ్ళ మీద జుట్టు రాలిపోవడం
⦿ అరికాళ్లు, పాదాలు స్పర్శ కోల్పోవడం
⦿ పాదాలకు చెమట పట్టకపోవడం
⦿ పాదాలు ఉబ్బిపోవడం
⦿ కాళ్ళకి గాయాలు ఏదైనా అయితే అవి ఎక్కువ రోజులు మానకపోవడం
⦿ విశ్రాంతి తీసుకున్నప్పుడు, నడిచేటప్పుడు కళ్ళల్లో తిమ్మిర్లు
ఈ లక్షణాలు కనిపిస్తే మీరు ఎటువంటి ఆలస్యం చెయ్యకుండా వైద్యులని సంప్రదించడం మేలు. మీ పాదాలు చక్కగా చూసుకోవాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. పురుషులల్లో అంగస్తంభన లోపం కాళ్ళ చర్మం రంగు మారడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. మధుమేహం ఉన్న వ్యక్తులు ఒనికోమైకోసిస్ అనే ఫంగల్ ఇన్ఫెక్షన్ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇది సాధారణంగా గోళ్ళని ప్రభావితం చేస్తుంది. గోళ్ళ రంగు మారడం, మందంగా, పెళుసుగా మారిపోతాయి.
రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండటం వల్ల పాదాలకు తీవ్ర నష్టం వాటిల్లితుంది. మధుమేహం ఉన్న వాళ్ళతో పోలిస్తే లేని వాళ్ళకి గాయాలు త్వరగా నయం అవుతాయి. కానీ మధుమేహులు నిర్లక్ష్యంగా ఉంటే గాయం పెద్దది అయి ఇన్ఫెక్షన్ ఎక్కువ అవుతుంది. దీని వల్ల గాయం అయిన కాలుని తొలగించే ప్రమాదం కూడా ఉంటుంది. అందువల్ల గాయాల విషయంలో డయాబెటిస్ లు చాలా జాగ్రత్తగా ఉండాలి.
గాంగ్రీన్ అనేది డయాబెటిస్ కారణంగా వచ్చే అనారోగ్యం. శరీరంలోని ఒక ప్రాంతానికి రక్తప్రసరణ కాకుండా, అంతరాయం కలిగినప్పుడు శరీర కణజాలం చనిపోతుంది. ఆ పరిస్థితినే గాంగ్రీన్ అంటారు. ఇది గాయం వల్ల లేదా, నియంత్రణ లేకుండా ఇన్ఫెక్షన్ సోకడం వల్ల ఆ ప్రాంతంలో కణజాలం చనిపోవడం వల్ల కలుగుతుంది. ఈ పరిస్థితి ఎక్కువగా కాళ్లు, కాలివేళ్లు, పాదాలు, చేతులనే ప్రభావితం చేస్తుంది. ఆ ప్రాంతం రంగు మారడం, లేదా చీము పట్టడం, స్పర్శ తెలియక పోవడం వంటి లక్షణాల ద్వారా గాంగ్రీన్ బయటపడుతుంది. గాంగ్రీన్ పరిస్థితి తలెత్తినప్పుడు చనిపోయిన కణజాలాన్ని తొలగించాలి లేకుంటే అక్కడి బ్యాక్టిరియా రక్త నాళాల ద్వారా చాలా వేగంగా ఇతర అవయవాలకు వ్యాపిస్తుంది. దీని వల్ల ప్రాణానికే ప్రమాదం. అందుకే గాంగ్రీన్‌ను గుర్తించగానే ఆ భాగాన్ని తొలగిస్తారు వైద్యులు.
గాంగ్రీన్‌ను ముందుగానే గుర్తిస్తే చికిత్స సులభమవుతుంది. యాంటీబయోటిక్స్ మందుల ద్వారానే పరిస్థితిని సాధారణంగా మారుస్తారు. చికిత్స సరైన సమయంలో అందకపోతే సెప్టిక్ గా మారిపోతుంది.
Also read: చిన్నికృష్ణయ్యకు తియ్యటి నైవేద్యాలు, వీటిని పావుగంటలో చేసేయచ్చు
Also read: సహోద్యోగులు తన పెళ్లికి పిలిస్తే రాలేదని ఆ పెళ్లి కూతురు ఏం చేసిందంటే