చైనాకు చెందిన మహిళ ఓ సంస్థ పనిచేస్తోంది. చాలా ఏళ్ల నుంచి అదే సంస్థలో వర్క్ చేస్తోంది. ఆమెకు పెళ్లి సెటిలైంది. తనకు తెలిసిన వారినే పెళ్లికి పిలిస్తే మిగతావారు ఫీలవుతారేమోనని ఆఫీసులో ఉన్న 70 మందిని పెళ్లికి పిలిచింది. వివాహానికి రెండు నెలల ముందే శుభలేఖలను పంచింది. ఆ రోజు అందరూ తప్పకుండా రావాలని, ముందుగానే చెప్పాను కాబట్టి ఆ డేట్ రోజున ఏ ప్రోగ్రాములు పెట్టుకోవద్దని అందరినీ రిక్వెస్ట్ చేసింది. ఆఫీసులో ఉన్న అందరూ తప్పకుండా వస్తామని మాటిచ్చారు. 


ఒక్కరే వచ్చారని..
పెళ్లి రోజు రానే వచ్చింది. 70 మంది సహోద్యోగుల్లో ఒకే ఒక్కరు వివాహానికి హాజరయ్యారు. దీంతో ఆమె షాక్‌కు గురైంది. పెళ్లిలో చాలా బాధపడింది. మనుసటిరోజే ఆఫీసుకు వెళ్లి ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చేసింది. దానికి కారణాలు కూడా వివరించింది. తన పెళ్లికి ఆఫీసు నుంచి 70 మంది వస్తారని అనుకున్నానని, అందులో సగం మంది వచ్చిన సంతోషించే దాన్నని వివరించింది. తన టీమ్ లీడర్ తప్ప మరెవరూ పెళ్లికి రాకపోవడం చాలా బాధించిందని చెప్పింది. వీరంతా వస్తారని ఆశించి ఆరు టేబుళ్లు ఎక్స్ ట్రా బుక్ చేశామని, ఆ టేబుళ్లకు సరిపడా ఆహారాన్ని బయట పడేయాల్సి వచ్చిందని చెప్పింది. అన్నింటి కన్నా ముందు బంధువుల ముందు చాలా అవమానాలకు గురైనట్టు పేర్కొంది. అది తనను మానసికంగా చాలా కుంగదీసిందని, పెళ్లిలో తాను నవ్వుల పాలైనట్టు తెలిపింది. పెళ్లి రోజు తన సహోద్యోగుల వల్ల తీవ్ర ఇబ్బందులు, అవమానాలు ఎదుర్కొన్నానని, వారి ముఖం తిరిగి చూడాలనుకోవడం లేదంటూ ఉద్యోగానికే రాజీనామా చేసింది. 


ఉద్యోగాలకు రాజీనామా చేయాలంటే చాలా బలమైన కారణం అవసరం. తగిన గుర్తింపు లభించడం లేదనో, జీతం సరిపోవడం లేదనో లేక బాస్‌తో పడకో చాలా మంది మానేస్తుంటారు. వేరే చోట ఆఫర్ వచ్చి మానేసిన వాళ్లు అధికమే. కానీ ఇలా సహోద్యోగులు పెళ్లికి రాలేదని మానేయడం మాత్రం ఎక్కడా జరిగి ఉండదు. ఇప్పుడిది చైనా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 


ఇలాంటి ఫన్నీ రాజీనామాలు ఈ మధ్య అధికంగా మారాయి. కొద్దిరోజుల క్రితం ఒక వ్యక్తి ట్విట్టర్లో చిన్న రాజీనామా లేఖను షేర్ చేశారు. అది ఎంత చిన్న రిజైన్ లెటర్ అంటే అందులో ‘బై బై సార్’ అని మాత్రమే రాసి ఉంది. చాలా సింపుల్‌గా రాసిన ఈ లెటర్ ట్విట్టర్లో బాగా వైరల్‌ అయ్యింది. 



Also read: చిన్నికృష్ణయ్యకు తియ్యటి నైవేద్యాలు, వీటిని పావుగంటలో చేసేయచ్చు



Also read: ఎంత నవ్వితే గుండెకు అంత మంచిది, హైబీపీ - మధుమేహం కూడా అదుపులో, ఇకనైనా నవ్వండి