రోజుల్లో పిల్లలకు ఎవరూ రొటీన్ పేర్లు పెట్టడం లేదు. చివరికి జపాన్, చైనా నుంచి దిగుమతి చేసుకొని కూడా పెడుతున్నారు. కోవిడ్ సమయంలో చాలామంది తమ పిల్లలకు ‘కరోనా’ అనే పేరును కూడా పెట్టారు. అలాంటి వార్తలు విన్నప్పుడు వీరికి మతిగానీ పోయిందా? ఏమిటీ? అనే సందేహం కలుగుతుంది. తాజాగా ఓ జంట కూడా ఇదే టైపులో తమ బిడ్డకు వెరైటీ పేరు పెట్టారు. అయితే, ఇందుకు మనసు బరువెక్కించే ఓ కారణం ఉంది. 


పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావీన్స్‌లోని రజాన్పూర్ జిల్లా‌కు చెందిన నింబు బాయ్, బలామ్ రామ్ అనే జంట ఇటీవల తన బిడ్డకు ‘బోర్డర్’ (సరిహద్దు) అని పేరు పెట్టారు. అయితే, వారు ఆ పేరు పెట్టడానికి బలమైన కారణమే ఉంది. తీర్థయాత్రల కోసం పాకిస్థాన్ నుంచి ఇండియాకు వచ్చిన 97 మంది తిరిగి తమ దేశానికి వెళ్లలేకపోయారు. వీరిలో 47 మంది పిల్లలు ఉన్నారు. వారిలో ఆరుగురు ఏడాది కంటే తక్కువ వయస్సు ఉన్న శిశువులు కూడా ఉన్నారు. 


వారి డాక్యుమెంట్లు సరిగ్గా లేవనే కారణంతో వారు ఇండియాలోని అత్తరి బోర్డులో చిక్కుకున్నారు. 97 రోజుల నుంచి అక్కడే పడిగాపులు కాస్తున్నారు. గర్భంతో ఉన్న నింబు బాయ్ డిసెంబరు 2న నొప్పులతో బాధపడింది. దీంతో పంజాబ్‌లోని స్థానిక మహిళలు ఆమెకు సాయం చేయడంతో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. సరిహద్దులోని భారతీయులు తమకు చేసిన సాయానికి గుర్తుగా ఆ జంట తమ బిడ్డకు ‘బోర్డర్’ అని పేరు పెట్టారు. 


Also Read: నల్లకోడి చికెన్, గుడ్లు తింటే ఇన్ని లాభాలా? అందుకేనా దానికంత రేటు?


ఇటీవల ఓ మహిళ పొరపాటున తన బిడ్డకు ఓ ఫేమస్ పంది పేరు పెట్టింది. ఆ తర్వాత ఆ పేరును మార్చాలని కోరినా ఆమె వెనక్కి తగ్గలేదు. ఈబీ వైట్ రచించిన ‘షార్లెట్స్ వెబ్’ అనే నవలకు ఆమె పెద్ద అభిమాని. అందులో ‘ఓలివర్ లీ’ అనే పేరును తన బిడ్డకు పెట్టాలని అనుకుంది. కానీ, పొరపాటున ఆమె ఆ నవలలోని మరో పాత్ర ‘విల్బుర్ ఫెలిక్స్’ పేరు పెట్టేసింది. అయితే, అది ఆ నవలలో పంది పేరు. ఈ రోజుల్లో ఎవరికీ ఆ నవల గురించి పెద్దగా తెలియదని, కాబట్టి.. పేరును మార్చాల్సిన అవసరం లేదని ఆమె చెప్పింది. అలస్కాకు చెందిన ఓ మహిళ కూడా ఇలాగే తన బిడ్డకు వెరైటీ పేరు పెట్టింది. విమానంలో పుట్టిన బిడ్డకు ‘స్కై’ (ఆకాశం) అని నామకరణం చేసింది. 


Read Also: గుడ్డుతో పాటూ వీటిని తినకూడదు, తింటే ఈ సమస్యలు తప్పవు
Read Also:  ఇలాంటి పేపర్ ప్లేట్లలో రోజూ భోజనాలు లాగిస్తున్నారా? అయితే ఈ రోగాలు రాక తప్పవు
Read Also:  ఈ మూడు వంటలు ప్రెషర్ కుక్కర్లో వండకూడదు... అయినా వండేస్తున్నాం


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి