శారీరక రుగ్మతలే కాదు, కొన్ని మానసిక రోగాలు కూడా చాలా ఇబ్బంది పెడతాయి. ఇవి మనిషిని స్థిమితంగా ఉండనివ్వవు. నిద్రపోనివ్వవు. తిననివ్వవు. కనీసం ప్రశాంతంగా ఐదు నిమిషాలు కూర్చొనివ్వవు. అలాంటి వాటిల్లో ఒకటి కోటార్డ్ సిండ్రోమ్. ఈ వ్యాధి బారిన పడిన మనుషులు తాము చనిపోయామని... ఆత్మ రూపంలో తిరుగుతున్నామని అనుకుంటూ ఉంటారు. ప్రతిదీ భ్రాంతి చెందుతూ ఉంటారు. తాము నిజంగా బతికే ఉన్నామన్న సంగతిని కూడా గమనించలేరు. ఆహారం, మందులు వంటివి తీసుకోవడానికి ఇష్టపడరు. వారు తాము మరణించాం కనుక ఆహారం, మందులతో ఎలాంటి పని లేదని అనుకుంటారు. ఇలాంటి వ్యక్తితో కలిసి జీవించడం చాలా కష్టం. అలాంటివారు కళ్ళముందే బక్క చిక్కి సన్నగా మారిపోతారు. మీరు తాగడానికి కూడా ఇష్టపడరు. తాము చనిపోయామంటూ మాట్లాడుతూ ఉంటారు. ఈ సిండ్రోమ్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతుంది. ఈ సిండ్రోమ్ వ్యాధిబారిన పడితే దాన్ని సీరియస్‌గానే పరిగణిస్తారు మానసిక వైద్యులు. మొదటిసారి ఈ సిండ్రోమ్‌ను 1880లో కనిపెట్టారు ఫ్రెంచ్ న్యూరాలజిస్ట్  జ్యూస్ కోటార్డ్ ఈ సిండ్రోమ్‌ను కనిపెట్టాడు. అందుకే ఈ వ్యాధికి అతని పేరు నే పెట్టారు.


ఈ సిండ్రోమ్ బారిన పడిన రోగులు ఎప్పుడు పరధ్యానంగా ఉంటారు. ఎవరో ఒకరిని తిడుతూ ఉంటారు. ఏమిచ్చినా తినడానికి ఇష్టపడరు. తమ శరీరం గురించి పట్టించుకోరు. తీవ్ర యాంగ్జయిటీతో ఉంటారు. తమను చంపడానికి ఎవరో ప్రయత్నిస్తున్నారని అంటారు. తమ చనిపోయామని భ్రమ పడుతూ ఉంటారు. ఇలాంటివారు గ్రామాల్లో ఉన్నప్పుడు వారు దయ్యం పట్టిందని అనుకుంటూ ఉంటారు. వేపకొమ్మలతో కొట్టడం వంటి వింత వైద్యాలు చేస్తూ ఉంటారు. ఇదొక మానసిక రుగ్మత అని తెలుసుకోరు. ఇలాంటి వారికి చికిత్స అందించడం చాలా ముఖ్యం. కొన్ని రకాల మందుల ద్వారా లక్షణాలను తగ్గించవచ్చు. యాంటీ సైకోటిక్స్, సైకో థెరఫీలు, యాంటీ డిప్రెసెంట్స్ వంటి మందులు ఇచ్చి దీనికి చికిత్స చేస్తారు. 


ఇచ్చిన మందులు వేసుకోవడానికి కూడా వీరు ఇష్టపడరు. తాము నచ్చిన పనే చేస్తారు. ఆసుపత్రికి తీసుకెళ్లడం, వైద్యులతో మాట్లాడించడం చాలా కష్టంగా మారిపోతుంది. ఇలాంటి వారితో ఏదైనా మాట్లాడే ఒప్పించాలంటే... పక్కనున్న వారు తాము కూడా ఆత్మలమేనని, తామూ మరణించామని వారు నమ్మేలా చెయ్యాలి. అలా నమ్మాక వారు పక్కవారితో స్నేహం చేస్తారు. అలాంటప్పుడే ఆహారాన్ని, మందులను తినిపించాల్సి ఉంటుంది. మందులు వాడాక కొన్ని నెలలకు ఈ సిండ్రోమ్ లక్షణాలు తగ్గుతాయి. తమ శరీరంపైనా, తమ వ్యక్తిగత శుభ్రత పైనా వారికి కాస్త స్పృహ వస్తుంది. అప్పటివరకు మాత్రం వీరితో ఇబ్బంది తప్పదు. ఆ తరువాత ఆహారాన్ని, మందులను తమకు తాముగా తీసుకోవడానికి ఇష్టపడతారు. కాబట్టి ఈ వ్యాధి బారిన పడినవారు తమని  తాము మానసిక రోగులమని గుర్తించుకోలేరు. కాబట్టి ఇంట్లో వారితో పాటు ఉన్న కుటుంబ సభ్యులే గుర్తించి వారికి తగిన చికిత్స అందించాలి.


Also read: కొంతమంది పిల్లలు మట్టి, బలపాలు తింటారు, ఎందుకో తెలుసా?



Also read: మా నాన్న మళ్లీ పెళ్లి చేసుకుంటానంటున్నారు, నాకు ఇష్టం లేదు






















గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.