Heart Benefits of Alcohal : మద్యపానం సేవించే వారి ఆరోగ్యంపై అది సానుకూల ప్రభావాలు చూపిస్తుందా? అనే డిబేట్​పై హార్వర్డ్ యూనివర్శిటి వేదికైంది. అక్కడి పరిశోధకులు, నిపుణులు దీనిపై దీర్ఘకాలికమైన చర్చను జరిపి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. దానికి సంబంధించిన అంశాలను యూనివర్శిటీ ప్రతిష్టాత్మకంగా తమ వెబ్​సైట్​లో నమోదు చేసింది. అయితే దీనిలో బాగా ఆకట్టుకున్న అంశం ఏదైనా ఉందా అంటే.. అది ఆల్కహాల్​ గుండె ఆరోగ్యానికి మంచిదేనని పరిశోధకులు భావించడం. అయితే మంచిదే కదా అని ఎక్కువగా తాగేసే ప్లాన్​లో ఉంటే మాత్రం కాస్త బ్రేక్​ వేయండి. మితంగా తీసుకుంటేనే దీని ప్రయోజనాలు మీరు పొందవచ్చు. 


రెడ్​ వైన్ బెటర్..


ఒకటి లేదా రెండు పెగ్​లు తీసుకోవడం వల్ల గుండెపోటు, అధిక కొలెస్ట్రాల్ కంట్రోల్​లో ఉండవచ్చని యూనివర్శిటీ అధికారులు చెప్పారు. మధుమేహ సమస్యను కూడా తగ్గిస్తుంది. దీనికోసం పలు అధ్యయనాలను సైతం సూచించారు. ఆల్కహాల్​ కంటే.. రెడ్​వైన్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని, కొలెస్ట్రాల్ తగ్గించవచ్చని అధ్యయనాలు చెప్తున్నాయి. అయితే పలు పరిశోధనలు దీర్ఘకాలిక డేటాను చూడవని.. అదనంగా మద్యపానం వల్ల వ్యాధుల క్యాన్సర్, కంటిశుక్లం వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం పెరుగుతున్నట్లు పలు అధ్యయనాలు సూచిస్తున్నాయని తెలిపారు. 


రుజువులున్నాయి..


ఈ రెండు విషయాలపై ఇప్పటికీ అస్పష్టత ఉంది. అయితే నిపుణుల ప్రధానంగా ఏమి చెప్పారంటే.. ఆల్కహాల్ రక్తం గడ్డకట్టేలా చేస్తుంది. గుండె కండరాలకు మరింత సులభంగా ప్రయాణిస్తుంది. తద్వార గుండెపై ఎక్కువ ప్రెజర్ ఉండదని తెలిపారు. మితమైన మద్యపానం వల్ల గుండెకు ప్రయోజనం కలుగుతుందనడానికి దశాబ్దాలుగా పలు రుజువులు ఉన్నాయని.. మద్యపాన విధానాలు, ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్న అనేక మందిలో ఇది రుజువైందని తెలిపారు. 


మద్యం తాగనివారికే ముప్పు


కాలక్రమేణా మితమైన మద్యపానం చేసేవారు.. అస్సలు మద్యపానం చేయనివారు, మద్యం ఎక్కువగా తాగేవారికంటే తక్కువగా గుండెపోటుకు గురవుతున్నారని తెలిపారు. మితమైన మద్యపానంతో గుండె ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని హార్వర్డ్ వెబ్​సైట్​లో రాశారు. వారానికి రెండు పెగ్​లు మద్యం తీసుకోవడం మంచిదని దానిలో తెలిపారు. అయితే కొన్ని అధ్యయనాలు రోజుకు ఒకటి లేదా రెండు పెగ్స్ తీసుకుంటే మంచిదనగా.. కొందరు మద్యాన్ని ఎంత మోతాదులో తీసుకున్నా మంచిది కాదని హెచ్చరించారు. 


రోజుకు ఓ గ్లాస్ వైన్


మితమైన మద్యపానం మంచి కొలెస్ట్రాల్​ను పెంచుతుందని, చెడు కొలస్ట్రాల్​ను తగ్గిస్తుందని కొన్ని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఇది రక్తం మరింత సులభంగా గడ్డకట్టడంలో హెల్ప్ చేస్తుంది. రెడ్ వైన్​ వంటి పానీయాలు కొలెస్ట్రాల్​ను తగ్గించగలవు. ఎందుకంటే వాటిలో పాలీఫెనాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్​ను తొలగించి.. రక్తనాళాల లోపలి పొరను కాపాడుతాయి. 2022లో జరిగిన ఓ అధ్యయనం ప్రకారం 40 ఏళ్లు దాటిన వారు రోజుకు ఒక గ్లాసు వైన్​ లేదా బీర్​ తాగితే గుండె జబ్బులు, టైప్​ 2 మధుమేహం వచ్చే ప్రమాదం తగ్గుతుందని ది లాన్సెట్ ప్రచురించింది. అయితే ఈ విషయాలపై ఇప్పటికీ క్లారిటీ రావాల్సి ఉంది. చివరిగా ఏమి చెప్పారంటే.. ఎంత ఎక్కువ తాగితే అంత హానికరం.. ఎంత తక్కువ తాగితే అంత సురక్షితమైనదని పేర్కొన్నారు. 


Also Read :  టెస్ట్​ కన్నా ముందే గర్భవతి అవునో కాదో తెలుసుకోవచ్చట!














గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.