Pregnancy Symptoms in Body : ప్రెగ్నెన్సీని కన్ఫార్మ్ చేయడానికి గర్భధారణ పరీక్షలు, అల్ట్రాసౌండ్​లు మాత్రమే మార్గం అనుకుంటున్నారా? అయితే కొన్ని ఆరోగ్య లక్షణాలతో.. శరీర మార్పులతో మీరు ముందుగానే ప్రెగ్నెన్సీ లక్షణాలు గుర్తించవచ్చు. మీ గర్భం మొదటివారం గత నెలలో వచ్చిన పీరియడ్స్ తేదీ ఆధారంగా మొదలవుతుంది. మీరు ప్రెగ్నెంట్ అప్పటికీ కాకపోయినా.. పీరియడ్స్ చివరి తేదీనే మొదటివారంగా పరిగణిస్తారు. అయితే కొన్ని వారాలలో మీకు లక్షణాలు ఉండకపోవచ్చు. అయినా పీరియడ్ ఆగితే ప్రెగ్నెంట్ అయిపోయినట్టేనా..? కానే కాదు. వివిధ ఆరోగ్య కారణాల వల్ల కూడా పీరియడ్స్ ఆగడమో.. లేట్​గా రావడమో జరుగుతాయి. మరి గర్భం విషయంలో ఎలాంటి లక్షణాలతో నిర్ధారణ చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. 


గర్భధారణ సమయంలో తిమ్మరి


గర్భం ధరించిన 10 నుంచి 14 రోజుల తర్వాత మీకు కాస్త తిమ్మిరిగా ఉంటుంది. అంతేకాదు ఈ సమయంలో మీరు ఇంప్లాంటేషన్ బ్లడ్​ డిశ్చార్జ్​ జరగవచ్చు. ఇది పీరియడ్స్​గా మీరు భావిస్తారు కానీ.. అది కానీ కాదు. ఇది ప్రెగ్నెన్నీకి సంకేతం. ప్రెగ్నెన్సీ సమయంలో కాస్త బ్లడ్ డిశ్చార్జ్ అవ్వడం సహజమే. దాని గురించి ఎక్కువ స్ట్రెస్​ తీసుకోకూడదు. 


పీరియడ్ లేనట్టే


గర్భధారణ ప్రారంభంలో రుతుక్రమం తప్పుతుంది. ఇంప్లాంటేషన్ తర్వాత మీ శరీరం హ్యూమన్ కోరియోనిక్ గోనడో ట్రోపిన్ అనే హార్మోన్​ను తయారు చేయడం ప్రారంభిస్తుంది. ఇది గర్భధారణకు సహాయంచేస్తుంది. దీనివల్ల శరీరంలో ఎగ్స్ రిలీజ్​ అవ్వడం ఆగుతాయి. దాని అర్థం గర్భం దాల్చిన 4 వారాల తర్వాత మీ పీరియడ్స్ మిస్​ అవుతారు. ఒకవేళ మీకు పీరియడ్స్ వచ్చాయనిపిస్తే వైద్య పరీక్షలు చేయించుకోవాలి.


శరీర ఉష్ణోగ్రతల్లో మార్పు


గర్భవతిగా ఉన్నప్పుడు మీ శరీర ఉష్ణోగ్రతల్లో మార్పులు వస్తాయి. వ్యాయామం లేదా వేడి వాతావరణంలో ఉన్నప్పుడు మీ కోర్ ఉష్ణోగ్రత మరింత పెరుగుతుంది. ఈ సమయంలో మీరు ఎక్కువ నీరు తాగాల్సి ఉంటుంది. వ్యాయామాలు జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఉంటుంది. 


అలసట ఎక్కువవుతుంది


గర్భధారణ ప్రారంభ సమయంలో అలసటగా ఉంటుంది. ఎప్పుడైనా.. ఏదైనా పని చేస్తున్నా మీరు త్వరగా అలసిపోతూ ఉంటారు. ఈ లక్షణం చాలామందిలో కనిపిస్తుంది. ప్రొజెస్టెరాన్ స్థాయిలు శరీరంలో పెరగడం వల్ల మీకు నిద్ర రావడం, అలసటగా ఉండడం జరుగుతుంది. 


హృదయ స్పందన పెరగడం..


మొదటి 8 నుంచి 10 వారాల వరకు మీ హృదయం వేగంగా కొట్టుకోవడం జరుగుతుంది. బ్లడ్​ పంపింగ్​ కూడా కాస్త ఎక్కువగా ఉంటుంది. దడ వంటి ఫీలింగ్ మీకు కలుగవచ్చు. ఇది హార్మోన్ల వల్ల కలిగే సాధారణ పరిస్థితి. గర్భధారణ వల్ల రక్తప్రసరణ పెరిగి ఇలా అనిపిస్తూ ఉంటుంది. 


రొమ్ములలో మార్పు


ప్రెగ్నెన్సీ మొదటి 4 నుంచి 6 వారాల్లో రొమ్ముల్లో మార్పులు కలుగుతాయి. హార్మోన్ మార్పుల కారణంగా రొమ్ముల్లో వాపు అభివృద్ధి జరిగే అవకాశముంది. మీ శరీర హార్మోన్లు రిలాక్స్ అయిన తర్వాత అవి కూడా సాధారణ స్థితికి వచ్చేస్తాయి. 11వ వారంలో కూడా ఈ మార్పులు రావొచ్చు. ఇవి రొమ్ముల పెరుగుదలకు కారణమవుతాయి. చనుమొన చుట్టూ భాగం పెద్దగా.. ముదురు రంగుకు మారుతుంది.


మానసిక స్థితిలో మార్పులు


గర్భధారణ సమయంలో మీ ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ స్థాయిలు పెరుగుతాయి. కాబట్టి సాధారణంగా కంటే మీరు ఎక్కువగా రియాక్ట్ అవుతూ ఉంటారు. మూడ్ స్వింగ్స్ సర్వసాధారణం కాబట్టి.. ఇంట్లోవారు.. పరిస్థితిని అర్థం చేసుకుంటే మంచిది. 


మూత్రవిసర్జన 


ప్రెగ్నెంట్​ లేడీ తరచుగా మూత్రవిసర్జనకు వెళ్తారు. దానిని కంట్రోల్ చేసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. ఈ సమయంలో మీ శరీరం పంప్ చేసే రక్తాన్ని పెంచుతుంది. ఇది మూత్రపిండాలు సాధారణం కంటే ఎక్కువ ద్రవాన్ని ప్రాసెస్ చేస్తుంది. అంటే యూరిన్​కు ఎక్కువ వెళ్తూ ఉంటారు. 


కడుపు ఉబ్బరం..


గర్భధారణ సమయంలో ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు పెరుగుతాయి. ఇది మీ జీర్ణవ్యవస్థను నెమ్మది చేస్తుంది. ఫలితంగా మీకు ఈ సమస్యలు వస్తాయి. పొత్తికడుపు భారంగా, ఉబ్బరంగా మారుతుంది. 


వికారం, వాంతులు


గర్భధారణ సమయంలో ఉదయం వికారం, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇది 4 నుంచి 6 వారాలలో ఎక్కువగా ఉంటుంది. 9వ వారంలో గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. దీనిని మార్నింగ్ సిక్​నెస్ అంటారు. కొన్నిసార్లు పగలు, రాత్రి తేడా లేకుండా వాంతులు అయిపోవచ్చు. 


అధిక రక్తపోటు.. 


గర్భధారణ సమయంలో అధిక రక్తపోటు, మైకంగా ఉంటుంది. ప్రారంభ సమయంలో రక్తపోటు తక్కువగా ఉంటుంది. ఇది మీకు తలతిరిగిన ఫీలింగ్ ఇస్తుంది. 


ఫుడ్ సెన్సిటివిటీ..


గర్భధారణ సమయంలో వాసనలో సెన్సిటివిటీ, ఆహారం పట్ల విరక్తి కలుగుతుంది. ఇది ప్రారంభ లక్షణం. ఈ సమయంలో మీరు కొన్ని ఆహారాలు అస్సలు తీసుకోరు. వాటిని తింటే మీకు వాంతులు అవుతున్న ఫీలింగ్ వస్తుంది. 


బరువు పెరగడం..


మొదటి త్రైమాసికంలో బరువు పెగడం సర్వసాధారణం. మీరు తీసుకునే ఆహారం మారకపోవచ్చు కానీ.. బరువు పెరగడం కొంచెం జరుగుతూ ఉంటుంది. 


ఇవే కాకుండా గర్భధారణ సమయంలో గుండెల్లో మంటగా ఉంటుంది. ప్రెగ్నెన్సీ గ్లో వస్తుంది. మొటిమలు వస్తుంటాయి. ఇవన్నీ హార్మోన్ల ప్రభావం వల్లే జరుగుతాయి. కాబట్టి ఏ మార్పులు వచ్చినా ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి. మీరు పీరియడ్ మిస్​ అయిన వెంటనే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవచ్చు. ముందుగానే తెలుసుకునేందుకు వైద్యుడిని సంప్రదించాలి. 


Also Read : కొవిడ్ జెఎన్​ 1 లక్షణాలు ఇవే.. దీనితో ప్రాణహాని తప్పదా?













గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.