Daily Horoscope Today December 23rd, 2023 ( డిసెంబరు 23 రాశిఫలాలు)


మేష రాశి (Aries Horoscope Today)


ఈ రాశివారు సంతోషంగా ఉంటారు. అహంకారం తగ్గించుకుంటే మంచిది. ఆర్థిక సంబంధిత నిర్ణయాలు తీసుకునేముందు ఆలోచించండి. ఆరోగ్యం  బాగానే ఉంటుంది. కార్యాలయంలో కొత్త బాధ్యతలు తీసుకోవాల్సి రావొచ్చు. ఆరోగ్యం బాగానే ఉంది. మీ పనితీరు పట్ల కొందరు సీనియర్లు సంతోషించకపోవచ్చు. పూర్వీకుల ఆస్తిని వారసత్వంగా పొందే అవకాశం ఉంది. తోబుట్టువులతో ఆర్థిక వివాదాలను పరిష్కరించుకోవడానికి ఈరోజు మంచి రోజు. కార్యాలయ - వ్యక్తిగత జీవితాన్ని సమతుల్యంగా ఉంచుకోండి.  2024 మేషరాశి ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి


వృషభ రాశి (Taurus  Horoscope Today) 


వివాహేతర సంబంధాల ప్రభావం మీ వ్యక్తిగత జీవితంపై పడకుండా చూసుకోవాలి. ఇప్పటికే అలాంటి బంధాల నుంచి బయటపడి ఉంటే ఇంకా మంచిది. ఆర్థికపరంగా మీకు కలిసొచ్చే సమయం ఇది. విద్యార్థులు పరీక్షలలో విజయం సాధిస్తారు. ఉద్యోగులకు శుభసమయం. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టేందుకు మంచి సమయం. విలాసవంతమైన వస్తువులతో పాటూ గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంది. 2024 వృషభ రాశి ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి


Also Read: ఈ శ్లోకాలతో మీ బంధుమిత్రులకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేయండి


మిథున రాశి (Gemini Horoscope Today) 


తెలియని వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. మీరు కుటుంబ జీవితంలో ఆనందాన్ని అనుభవిస్తారు. ఆస్తిపై పెట్టుబడి పెట్టడం శుభప్రదం. ప్రభుత్వ పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. మీ ప్రవర్తనలో సరళంగా ఉండండి. మీరు మీ జీవిత భాగస్వామికి టైమ్ కేటాయించాలి.  ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఎక్కువ ఆసక్తి చూపిస్తారు.2024 మిథున రాశిఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి 


కర్కాటక రాశి (Cancer Horoscope Today)  


ఈరోజు ఇంటికి అతిథులు రావచ్చు. మీరు అకస్మాత్తుగా వ్యాపారంలో పెద్ద లాభాలను పొందవచ్చు. విదేశాలకు వెళ్లేందుకు అవకాశాలు వస్తాయి. ప్రేమికులు వివాహానికి సంబంధించి కుటుంబ సమ్మతి పొందవచ్చు. అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దు. కార్యాలయంలో చిన్న సమస్యలు ఉన్నప్పటికీ మీ పనితీరు సంతృప్తికరమైన ఫలితాలను తెచ్చిపెడుతుంది. వివాదాలకు దూరంగా ఉండండి. ఆర్థిక విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి.  2024 కర్కాటక రాశి ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి


Also Read: భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పాడు - మీకేం అర్థమైంది!


సింహ రాశి (Leo Horoscope Today)


ఈ రోజు మీరు క్రీడల కోసం సమయాన్ని వెచ్చిస్తారు. కార్యాలయంలో మీ ఆధిపత్యం పెరుగుతుంది. పనులన్నీ సకాలంలో పూర్తి చేయడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ జీవిత భాగస్వామితో కలిసి మతపరమైన ప్రదేశాన్ని సందర్శించవచ్చు. కొత్త వాహనం కొనుగోలు చేసే ఆలోచన చేస్తారు. ముఖ్యమైన పనులను పెండింగ్‌లో ఉంచవద్దు. ప్రభుత్వ ఉద్యోగులు ఈ రోజు బదిలీ సమాచారం వింటారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలుంటాయి   2024 సింహ రాశి ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి


కన్యా రాశి  (Virgo Horoscope Today) 


మీరు ప్రారంభించే పనిలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. పాత ప్రతికూల విషయాలను గుర్తుచేసుకుని బాధపడతారు. వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితానికి సంబంధించి బ్యాలెన్స్ చేసుకోగలగుతారు. ఆర్థిక పరిస్థితి సురక్షితమైన దీర్ఘకాలిక పెట్టుబడులకు మార్గం ఏర్పరుచుకుంటారు. ఆరోగ్యం బావుంటుంది. ఆస్తులు కొనుగోలు చేయాలన్న ఆలోచన కార్యరూపం దాల్చుతుంది.  2024 కన్యా రాశి ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి


తులా రాశి (Libra Horoscope Today) 


ఈ రోజు మీరు ఒత్తిడి లేకుండా ఉంటారు. రోజు మొత్తం ప్రశాంతంగా గడిచిపోతుంది. రాజకీయాలతో ముడిపడి ఉన్న వ్యక్తులకు ఈ రోజు గొప్పగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణ సమయంలో అవసరమైన పత్రాలు మీ దగ్గర ఉంచుకోవడం మర్చిపోవద్దు. మీ ప్రేమ భాగస్వామి అభిప్రాయానికి ప్రాముఖ్యత ఇచ్చినప్పుడే బంధం బలోపేతం అవుతుంది. సాహసోపేతమైన కార్యకలాపాల్లో పాల్గొనేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండండి. 


Also Read: వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం టైమింగ్స్ ఇవే!


వృశ్చిక రాశి (Scorpio Horoscope Today) 


అనారోగ్య సమస్యలను తేలికగా తీసుకోవద్దు. అవివాహితులకు వివాహం నిశ్చయం కావడంలో జాప్యం జరగవచ్చు. ఈరోజు కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాలు చర్చిస్తారు. ఉద్యోగ సమస్యలు పరిష్కారమవుతాయి. చెడు సాంగత్యానికి దూరంగా ఉండాలి. మీరు మీ కృషికి అర్ధవంతమైన ఫలితాలను పొందుతారు. ఉద్వేగానికి లోనవుతూ, మీరు కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుని ఆ తర్వాత బాధపడతారు. ఖర్చులు పెరుగుతాయి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యల పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలి.


ధనుస్సు రాశి  (Sagittarius Horoscope Today) 


ఈ రాశివారికి ఈ రోజు చాలా మంచి రోజు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఒత్తిడికి దూరంగా ఉంటారు. కొత్త వ్యాపార ఒప్పందాలలో ప్రవేశించే ముందు కొంత జాగ్రత్త వహించడం ముఖ్యం. పార్టీ చేసుకునేందుకు ప్లాన్ చేసుకుంటారు. మీ జీవితంలో శక్తి మరియు ఉత్సాహం పెరుగుతుంది. మీ దారికి వచ్చే ఏవైనా సవాళ్లను ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉంటారు. 


మకర రాశి (Capricorn Horoscope Today) 


ఈ రోజు మీరు ఏకాంతంగా జీవించడానికి ఇష్టపడతారు. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి. ఉద్యోగంలో అదనపు శ్రమ పడాల్సి రావచ్చు. అధికారులు మీ పని పట్ల అసంతృప్తిగా ఉండవచ్చు. తల్లిదండ్రుల పట్ల శ్రద్ధ వహించండి. మీరు మీ లక్ష్యాలు మరియు కోరికలకు అనుగుణంగా ఉండే అవకాశాలను అందుకుంటారు. మీ అభిప్రాయాన్ని వ్యక్తపరచడానికి సిగ్గుపడకండి కానీ మీరు ఇతరుల పట్ల గౌరవంగా ఉండేలా చూసుకోండి. మీ ఆర్థిక పరిస్థితిలో గణనీయమైన మార్పులను చూస్తారు. 


కుంభ రాశి  (Aquarius Horoscope Today) 


ఈ రాశివారికి ఆర్థిక లాభాలుంటాయి. మీ ప్రియమైనవారికి మనసులో మాట చెప్పేందుకు ఈ రోజు మంచి రోజు. మీ అభిరుచికి అనుగుణంగా పని చేయడం వల్ల మీ మనసు సంతోషంగా ఉంటుంది. రోజంతా ఆనందంగా ఉంటారు. వ్యాపారంలో కొన్నాళ్లుగా ఉన్న సమస్యలు పరిష్కారమవుతాయి.
మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి కొత్తగా ట్రై చేస్తే సక్సెస్ మీ సొంతం. గత పెట్టుబడులు కలిసొస్తాయి. 


మీన రాశి (Pisces Horoscope Today) 


ఈ రాశికి చెందిన యూత్ కెరీర్ కి సంబంధించి కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఇది. ఉద్యోగులకు పని విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఒంటరిగా  ఉండాలన్న ఆలోచనలు చుట్టుముడతాయి. ఇప్పటికే రిలేషన్‌షిప్‌లో ఉన్నవారు మీ ముఖ్యమైన వారిపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన సమయం ఇది. ఆదాయం పెరుగుతుంది. పెట్టుబడుల విషయంలో తెలివైన నిర్ణయాలు తీసుకోండి. వృధా ఖర్చులు తగ్గించాలి.


గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పండితులు, కొన్ని పుస్తకాల నుంచి సేకరించింది మాత్రమే. దీనిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం