Happy Christmas 2024 : క్రైస్తవులు ఘనంగా చేసుకునే పండుగల్లో క్రిస్మస్ ఒకటి. డిసెంబర్ 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ ఫెస్టివల్​ను చాలామంది జరుపుకుంటారు. ఆరోజును జీసస్ బర్త్​డేగా సెలబ్రేట్ చేసుకుంటారు క్రిస్టియన్స్. ఈ సమయంలో ఫ్రెండ్స్​కి, ఫ్యామిలీకి కేక్స్​, చాక్లెట్స్ పంచిపెడుతూ విష్ చేసుకుంటారు. లేదంటే సోషల్ మీడియా వేదికగా, వాట్సాప్, ఫేస్​బుక్​, ఇన్​స్టాగ్రామ్​లలో క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తారు. 


క్రిస్మస్ 2024 సమయంలో మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీకి తెలుగులో ఎలా విషెష్ చెప్పాలని ఆలోచిస్తున్నారా? అయితే మీరు సోషల్​ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తూ.. వాటికి తగిన కోట్స్​తో విష్ చేయాలనుకున్నా.. వాట్సాప్, ఫేస్​బుక్, ఇన్​స్టాలో విష్ చేయాలనుకున్నా.. ఇక్కడ కొన్ని విషెష్​ ఉన్నాయి. మీరు వీటితో సింపుల్​గా క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పేయొచ్చు. 


క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుగులో చెప్పేయండిలా



  • మెర్రీ క్రిస్మస్ 2024.

  • హ్యాపీ క్రిస్మస్ 2024.

  • లోక రక్షకుడైన ఏసు క్రీస్తు మీ కొరకు పుట్టియున్నాడు. హ్యాపీ క్రిస్మస్ 2024.

  • పాపులను కాపాడుటకొరకు యేసు క్రీస్తు మీకోసం జన్మించియున్నాడు. క్రిస్మస్ శుభాకాంక్షలు 2024.

  • మెర్రీ క్రిస్మస్ 2024. ఈ క్రిస్మస్ మీ జీవితంలో ప్రేమ, ఆనందం, సంతోషాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను.

  • మీకు, మీ కుటుంబానికి క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ క్రిస్మస్​ ఈ సంవత్సరంలో మంచి ముగింపుగా.. కొత్త సంవత్సరానికి ఎగ్జైటింగ్​గా వెల్కమ్​గా ఉండాలని కోరుకుంటున్నాను.

  • హ్యాపి క్రిస్మస్ 2024. ఈ స్పెషల్ డే మీ జీవితంలో ఆనందాన్ని, ప్రశాంతతను, మరపురాని జ్ఞాపకాలను అందించాలని విష్ చేస్తున్నాను.

  • క్రిస్మస్ శుభాకాంక్షలు. ఆ దేవుడు మీరు చేసే అన్ని పనుల్లో మీకు తోడుగా ఉండాలని కోరుకుంటూ హ్యాపి క్రిస్మస్.

  • ఈ క్రిస్మస్​ మీకు అంతులేని సంతోషనాన్ని ప్రేమను అందించాలని కోరుకుంటూ.. మెర్రీ క్రిస్మస్.

  • క్రిస్మస్ లైట్​లలోని మెరుపు.. మీ జీవితంలో రంగులు నింపాలని దేవుడికి నేను ప్రార్థిస్తున్నాను. హ్యాపీ క్రిస్మస్. 

  • ఈ క్రిస్మస్ మీ ఫ్యామిలీలోని కలతలన్నీ దూరం చేయాలని.. దేవునిలో మీరు ఇంకా ఎదగాలని కోరుకుంటూ హ్యాపీ క్రిస్మస్.




  • మీ జీవితానికి ఈ క్రిస్మస్ మంచి హోప్​ని ఇవ్వాలని కోరుకుంటూ.. మెర్రీ క్రిస్మస్ 2024.

  • క్రిస్మస్ సమయంలో మీకు ఎంతో సంతోషం దక్కాలని.. కొత్త సంవత్సరంలో మీరు కోరుకున్నవన్నీ నెరవేరాలని కోరుకుంటూ హ్యాపీ క్రిస్మస్. 

  • లోక రక్షకుడు నేడు మీ కొరకు పుట్టియున్నాడు. మీరందరూ ఆయనను పాటలతో, స్తుతి ఆరాధనలతో స్తుతించండి. హ్యాపీ క్రిస్మస్.


Also Read : క్రిస్మస్​ను డిసెంబర్ 25నే ఎందుకు జరుపుకుంటారో తెలుసా?


ఇలా మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీకి సోషల్ మీడియా ద్వారా విషెష్ చెప్పవచ్చు. లేదంటే ప్లమ్ కేక్స్, చాక్లెట్స్​ని ప్యాక్ చేసి.. గిఫ్ట్ కార్డ్​పై ఈ విషెష్ రాసి పంపించొచ్చు. క్రిస్మస్ విషెష్​కు అనువైన ఫోటోలు ఎంచుకుని.. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. వాటికి క్యాప్షన్​గా మీరు వీటిని రాయొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం. ఈ క్రిస్మస్ పండక్కి.. మెర్రీ క్రిస్మస్​ 2024 అనేకాకుండా.. ఇలా కూడా శుభాకాంక్షలు చెప్పేయండి. 


Also Read : క్రిస్మస్ సెలబ్రేషన్స్​కి ట్రిప్​ ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే ఇండియాలో బెస్ట్​ ప్లేస్​లు ఇవే