Men stealing womens underwear and bras have increased: దొంగతనాలంటే డబ్బులు, బంగారం, వజ్ర వైఢూర్యాలనే చేయరు. కొంత మందికి వీటి కంటే ఎక్కువ విలువైనవి మహిళల అండర్‌వేర్లు, బ్రాలు.  వాటిని దొంగతనం చేయడానికి చాలా సాహసాలు చేస్తారు. బిల్డింగుల పైకి ఎక్కుతారు. గోడలు దూకుతారు. ఇటీవల కాకినాడలో ఓ దొంగను పోలీసులు పట్టుకున్నారు. అసలు వీరు మహిళల లోదస్తులను తీసుకుని ఏం చేస్తారన్నది చాలా మందికి వచ్చే సందేహం. ఇప్పటి వరకూ పోలీసులకు పట్టుబడిన ఇలాంటి దొంగల్లోచాలా మంది చిత్రమైన కారణాలు చెప్పారు. కానీ దొంగలు నిజాలు చెప్పరని సులువుగానే అర్థం చేసుకోవచ్చు. మరి ఏం చేస్తారు అంటే..దీని వెనుక మానసిక పరమైన కారణాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. 


కొంత మంది మగవాళ్లకు మహిళల లోదుస్తుల్ని ధరించడం ఇష్టం !


మారుతున్న కాలంతో పాటు చాలా మంది ఆలోచనల్లో మార్పులు వస్తున్నాయి. ఈ కారణంగానే మహిళల్ని మహిళలు ఇష్టపడటం.. పురుషుల్నిపురుషులు ఇష్టపడటం వంటివి జరుగుతున్నాయి. కొంత మంది మహిళల్ని ఇష్టపడినా వారిని శారీరకంగా తాకడానికి ఇష్టపడరు. కానీ వారి లోదుస్తులను తస్కరించి తాము ధరింస్తే మాత్రం వారికి మానసిక ఆనందం కలుగుతుంది. ఇలాంటిది రోగమో.. మరొకటో కానీ ఇలాంటి వారు .. లోదస్తుల్ని దొంగతనం చేసేందుకు ఇంటి బయట ఆరేసి ఉన్నప్పుడు దొంగతనం చేయడానికి దేనికైనా వెనుకాడరని మానసిక నిపుణులు చెబుతున్నారు. 


Also Read:  ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !


కొంత మందికి వాటిని సేకరించడం మానసిక రోగం


మరికొంత మంది మహిళ లోదస్తుల్ని దొంగతనం చేయడమే హాబీగా పెట్టుకుంటారు. ఎందుకు అంటే వారికి కూడా తెలియదు. తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకుంటారు.కొన్ని సార్లు పోలీసులకు దొరికినప్పుడు వారి ఇళ్లల్లో సోదాలు చేస్తే పెద్ద ఎత్తున మహిళల లోదుస్తుల్ని కనిపెడుతూ ఉంటారు. వాటిని అలా సేకరించి పెట్టుకోవడమే వారి పని. వారికి ఆ పని ఆనందం కలిగిస్తుంది. ఓ రకంగా అది మానసిక రోగం. అంత ే కానీ వారికి అంతకు మించిన నేర ప్రవృతి ఉండదు. కొంత మందికి కొన్ని బలహీనతలు ఉన్నట్లుగా వారికి ఆ బలహీనత ఉంటుందని చెబుతారు. 


Also Read: వైజాగ్ ప్రజలకు బిగ్ అలర్ట్ - జనవరి ఒకటి నుంచి భూముల విలువ పెంపు - ఎక్కడెక్కడ ఎంత పెరగనున్నాయంటే ?


మరికొంత మంది వాటితో లైంగిక ఉద్రేకం పొందుతారు !


ఇలా మహిళల అండర్వేర్లు, బ్రాలను దొంగతనం చేసేవారిలో ఎక్కువ మంది వాటిని లైంగిక ఉద్రేకం పొందడానికి ఉపయోగించుకుంటారన్న అంచనాలు ఉన్నాయి. ఇలాంటి వారు ఎక్కువ మంది ఉంటారు. వారికి అదో తృప్తి. సాదారణంగా లేడీస్ హాస్టళ్లలో ఎక్కువ మంది బయట బట్టలు ఆరేస్తూ ఉంటారు. వారు కాలేజీలకు ఆఫీసులకు వెళ్లిపోతారు. అలాంటి చోట్ల ఎక్కువగా దొంగతనాలు చేస్తారు. చాలా మంది ఫిర్యాదుల వరకూ వెళ్లరు. అదే దొంగలకు బలం అవుతుంది. కొద్ది సార్లు మాత్రం దొరికిపోతారు. అప్పుడే వారి వ్యవహారం వెలుగులోకి వస్తుంది.