Best Places to Visit in India During Christmas Time : ఇండియాలో ఉంటూ ఫారిన్ కంట్రీల కోసం వర్క్ చేసేవారికి క్రిస్మస్ సమయంలో ఎక్కువ సెలవలు దొరుకుతాయి. అలాగే క్రిస్మస్ సెలబ్రేషన్స్ కోసం హాలీడేలు తీసుకునే వారు కూడా ఉంటారు. ఈ సెలవుల సమయంలో ఇండియాలో మీరు కొన్ని ప్రాంతాలను విజిట్ చేయవచ్చు. క్రిస్మస్ సెలబ్రేషన్స్‌తో పాటు మంచి ఎక్స్పీరియన్స్ కావాలనుకునేవారు ఇండియాలోని ఈ బెస్ట్ ప్రాంతాలకు వెళ్లిపోవచ్చు.
గోవా
క్రిస్మస్కి గోవా బెస్ట్ ఆప్షన్ అంటారు. అక్కడ చర్చిలో సెలబ్రేషన్స్ అలా ఉంటాయి మరి. అంతేకాకుండా క్రిస్మస్, న్యూఇయర్ సమయంలో అక్కడి నైట్ లైఫ్ చాలా అందంగా, గ్రాండ్‌గా ఉంటుంది. సీ ఫుడ్ ఇష్టపడేవారికి ఇది ఒక మంచి ఆప్షన్. అక్కడి సెకేథడ్రల్‌లోని, బీచ్లలోని క్రిస్మస్ పార్టీలను అస్సలు మిస్ కాకండి. ఇది మీకు కచ్చితంగా బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది.
Also Read : బడ్జెట్ ఫ్రెండ్లీ గోవా ట్రిప్.. క్రిస్మస్ సమయంలో వెళ్తే మరీ మంచిది.. ఎందుకంటే?
కోల్కత్తా
కోల్‌కత్తాలో ఆంగ్లో ఇండియన్స్ ఎక్కువగా ఉంటారు. అక్కడ చర్చ్‌లు, వింటర్ స్పెషల్ స్వీట్స్ మిమ్మల్ని మరో లోకంలోకి తీసుకెళ్తాయి. స్ట్రీట్ ఫుడ్ కూడా ఇక్కడ చాలా బాగుంటుంది. కిస్మస్ ట్రీలు, లైట్స్, స్టార్లతో అక్కడి వీధులు మీకు వెల్కమ్ చెప్తాయి.
ఢిల్లీ
ఇండియాలో క్రిస్మస్ సమయంలో మీరు విజిట్ చేయగలిగిన ప్రాంతాల్లో ఢిల్లీ ఒకటి. అక్కడి చర్చ్‌లను చాలా గ్రాండ్‌గా డెకరేట్ చేస్తారు. క్రిస్మస్కి మీరు అక్కడుంటే ఈవ్ పార్టీలను అస్సలు మిస్ కావొద్దు. షాపింగ్ మాల్స్‌లోని క్రిస్మస్ కార్నివల్స్ మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్తాయి.
పాండిచ్చేరి
ఇండియాలో మీరు వింటర్ సమయంలో ముఖ్యంగా క్రిస్మస్ సమయంలో పాండిచ్చేరి వెళ్తే బెస్ట్ సెలబ్రేషన్స్, ఎక్స్పీరియన్స్ మీ సొంతమవుతుంది. అక్కడ ఫ్రెంచ్ కాలనీలో కల్చర్స్ బాగా ఆకట్టుకుంటాయి. లోకల్‌గా ఉండే చర్చ్‌లను మీరు విజిట్ చేయవచ్చు. ఫ్రెంచ్ వంటకాలు, ప్రశాంతమైన వాతావరణం మీ హాలీడేకి జస్టిస్ చేస్తాయి.
Also Read : హైదరాబాద్ టూ పాండిచ్చేరి బడ్జెట్ ఫ్రెండీ ట్రిప్ 6 వేల లోపే.. 3 రోజులు - 4 నైట్స్‌కి ప్లాన్ ఇదే
సిమ్లా
హిమాచల్ ప్రదేశ్‌లోని అందమైన హిల్ స్టేషన్ అయిన సిమ్లా వెళ్తే మీరు సింపుల్, ప్రశాంతమైన క్రిస్మస్ వేడుకల చూడొచ్చు. లైట్స్‌తో అందంగా డెకరేట్ చేసిన చర్చ్‌లు బ్యూటీఫుల్ ఎక్స్పీరియన్స్ ఇస్తాయి. స్ట్రీట్ ఫుడ్ అస్సలు మిస్ కావొద్దు.
డయ్యూ డామన్
కేంద్రపాలిత ప్రాంతమైన డయ్యూడామన్ క్రిస్మస్ సెలబ్రేషన్స్‌కి మంచి డెస్టినీ అవుతుంది. అక్కడి అందమైన బీట్లు, డెకరేట్ చేసిన చర్చ్‌లు, ట్రెడీషనల్, పోర్చుగీస్ వంటకాలు మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తాయి.
ముంబై, చెన్నై, హైదరాబాద్, మేఘాలయ, నాగాలాండ్, మిజోరం వంటి ప్రాంతాల్లో కూడా క్రిస్మస్ వేడుకలు బాగా జరుగుతాయి. యునిక్‌గా, ట్రెడీషనల్గా జరుపుకునేందుకు ఇవి బెస్ట్ అని చెప్పవచ్చు. పైగా ఈ ప్రాంతాలకు ఫ్యామిలీతో, ఫ్రెండ్స్‌తో కూడా వెళ్లి ఎంజాయ్ చేయవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం. మీరు కూడా ఈ క్రిస్మస్ హాలీడేలకు ఈ ప్రాంతాలను చుట్టేయండి.
Also Read : ఆంధ్రప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలకు ఎప్పుడైనా వెళ్లారా? ఈసారి ట్రిప్‌కి ప్లాన్ చేసేసుకోండిలా