Man Hospitalized with Rat Bite : కెనడాకు చెందిన ఓ వ్యక్తిని ఎలుక కరవగా తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. టాయిలెట్లో ఉన్న ఎలుకను పట్టుకునే క్రమంలో.. ఎలుక అతని రెండు వేళ్లను కరిచేసిందట. దీంతో ఆ వ్యక్తి ఆర్గాన్స్ అన్ని ఫెయిల్ అయిపోయి.. సెప్సిస్ వంటి సమస్యలు వచ్చి ఐసీయూలో జాయిన్ అవ్వాల్సి వచ్చిందట. అసలు ఎలుకల కలిస్తే అంత ప్రాణాంతకమా? దీని గురించి కెనడియన్ మెడికల్ అసోసియేషన్ ఏమి చెప్పింది వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ విషయం, పేషంట్ పరిస్థితిని గురించి కెనడియన్ మెడికల్ అసోసియేషన్ జర్నల్‌లో ప్రచురించింది. బాధితుడి వయసు 76 సంవత్సరాల్లో దానిలో తేలింది. అయితే ఎలుక కరిచిన తర్వాత వ్యక్తికి ప్రాథమిక చికిత్సగా టెటానస్ షాట్ ఇచ్చారట. కానీ రోజులు గడుస్తున్న అతని పరిస్థితి మెరుగుకాకపోగా.. 18 రోజుల తర్వాత కూడా తీవ్రమైన అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించారు. వెంటనే అతన్ని ERకి తీసుకువెళ్లినట్లు జర్నల్‌లో పేర్కొన్నారు. తీవ్రమైన జ్వరం, తలనొప్పి, కడుపునొప్పి వంటి లక్షణాలు పేషెంట్లో గుర్తించారు.
ప్రాణాంతకమైన బ్యాక్టీరియా సోకింది..
బాధితుడికి వైద్య పరీక్షలు నిర్వహించగా.. దానిలో గుండె వేగంగా కొట్టుకుంటున్నట్లు తేలింది. రక్తపోటు తక్కువగా ఉందని, మూత్రపిండాలు దెబ్బతిన్నాయని తేలింది. అలాగే అతని అవయవాలకు సంబంధించిన సమస్యలను దానిలో గుర్తించారు. సెప్సిస్ కూడా ఉన్నట్లు టెస్ట్‌లలో తేలింది. దీనివల్ల అతనిని ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉంచినట్లు జర్నల్‌లో ప్రచురించారు. ప్రస్తుతం అతని వైద్య పరిస్థితి మెరుగుపరిడినప్పటికీ.. ఆరోగ్య పరిస్థితి మాత్రం క్షీణిస్తున్నట్లు గుర్తించారు. దీంతో బ్లెడ్, యూరిన్ టెస్ట్‌లు చేయగా.. అతినికి లెప్టోస్పిరోసిస్ ఉందని కనుగొన్నారు.
ఎలుక మూత్రం ద్వారనే..
ఎలుకలు వంటి జంతువులు మనుషులకు బదిలీ చేసే బ్యాక్టీరియా వల్ల లెప్టోస్పిరోసిస్ వస్తుందని వారు తెలిపారు. ఈ పరిస్థితి తీవ్రమైతే మరణానికి కూడా కారణమవుతుందని వారు వెల్లడించారు. వైద్యులు ఇచ్చిన నివేదిక ప్రకారం.. ఎలుక కరవడం ద్వారా బ్యాక్టీరియా అతని శరీరంలోకి ప్రవేసించినట్లు గుర్తించారు. ఎలుక నోటిలో మూత్రం ఉండొచ్చని.. ఆ సమయంలో వ్యక్తిని కరవడం వల్ల ఇన్ఫెక్షన్ చర్మానికి సోకి ఉండొచ్చని భావిస్తున్నారు. ఎందుకంటే ఈ రకమైన బ్యాక్టీరియా ఎలుకల వంటి జంతువుల మూత్రంలోనే ఉంటుందని వారు తెలిపారు.
ఈ ప్రాణాంతకమైన సమస్యకు చికిత్స ఉందా?
కెనడియన్ వ్యక్తికి వైద్యులు యాంటీ బయాటిక్స్, స్టెరాయిడ్స్‌తో ట్రీట్మెంట్ చేశారు. మూడు రోజుల తర్వాత ఐసీయూ నుంచి విడుదల చేసినట్లు వైద్యులు తెలిపారు. లెప్టోస్పిరోసిస్ చాలా ప్రమాదకరమైనదని.. కానీ ఎలుక కరిచిన వ్యక్తికి యాంటీబయాటిక్స్ ఇవ్వడం వల్ల పరిస్థితి మెరుగుపడుతుందని వారు పేర్కొన్నారు.
ఏటా 60 వేల మంది చనిపోతున్నారట..
ప్రపంచవ్యాప్తంగా ఏటా 1 మిలియన్ కంటే ఎక్కువ లెప్టోస్పిరోసిస్ కేసులు నమోదవుతున్నాయని అధ్యయనాలు చెప్తున్నాయి. దాదాపు 60 వేలమంది మరణిస్తున్నారట. ఈ బ్యాక్టీరియా సంక్రమణ మరణాల రేటు 5 నుంచి 15 శాతం ఉంటున్నట్లు పేర్కొన్నాయి. కాబట్టి ఈ విషయంలో కాస్త అలెర్ట్‌గా ఉండాలి అంటున్నారు. ఎలుకల సమస్యను వదిలించుకోవడం, ఎలుకలు కరిస్తే.. వెంటనే చికిత్స చేయించుకోవాలి అంటున్నారు. లేకుంటే ప్రాణాంతకం కావొచ్చని హెచ్చరిస్తున్నారు.
Also Read : పక్షవాతానికి గురైన వ్యక్తి స్టెమ్ సెల్ థెరపీతో మళ్లీ నడవగలరా? ట్రీట్మెంట్ సక్సెస్ అయింది కానీ